Hrithik Roshan: బాలీవుడ్ స్టార్ యాక్టర్ హృతిక్ రోషన్ (Hrithik Roshan), టాలీవుడ్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (Jr NTR) కాంబినేషన్‌లో వచ్చిన ‘వార్ 2’ (War 2) చిత్రం బాక్సాఫీస్ వద్ద తీవ్ర పరాజయాన్ని చవిచూసిన విషయం తెలిసిందే. ఈ సినిమా విడుదల తర్వాత రిజల్ట్‌పై ఇంత వరకు ఎవరూ మాట్లాడలేదు. సినిమా విడుదలకు ముందు హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో ఎన్టీఆర్ రెండు కాలర్స్ ఎగరేసి మరీ ఈ సినిమా సంచలనాలను క్రియేట్ చేస్తుందని చెప్పడంతో.. ఈ సినిమాపై భారీగా అంచనాలు పెరిగాయి. కానీ, రిలీజ్ తర్వాత ఈ సినిమా అందరినీ నిరాశకు గురి చేసింది. ఈ నేపథ్యంలో.. ఈ సినిమా విడుదలైన ఇన్నాళ్లకు హృతిక్ రోషన్ తన ఇన్‌స్టా వేదికగా ఈ సినిమా రిజల్ట్‌పై పరోక్షంగా స్పందించారు. అయితే ఇందులో ఎన్టీఆర్ పేరును ఎక్కడా ఆయన ప్రస్తావించలేదు. హృతిక్ రోషన్ చేసిన పోస్ట్‌లో ఏముందంటే..
Also Read- 80s Reunion Party: ‘80స్ రీ-యూనియన్ పార్టీ’కి ఒకే ఫ్లైట్‌లో చిరు, వెంకీ.. ఫొటో వైరల్!
‘వార్ 2’ పై హృతిక్ రోషన్ భావోద్వేగ పోస్ట్
‘కబీర్’ పాత్ర నాకు బాగా తెలుసు కాబట్టి, ఆ పాత్ర చేయడం నాకు సరదాగా, ఈజీగా అనిపించింది. ఈ సందర్భంగా నేను చెప్పేది ఏమిటంటే.. దేనిని తలకు ఎక్కించుకోవచ్చు. నటుడిగా పెట్టాల్సిన ఎఫర్ట్ 100 శాతం పెట్టండి. మీ పని పూర్తయిన తర్వాత ఇంటికి వెళ్లిపోండి. ‘వార్ 2’ విషయంలో నేను అదే ఫాలో అయ్యాను. ఈ సినిమాకు నేను ఏం చేయగలనో అది చేశాను. దర్శకుడు అయాన్ ముఖర్జీ సెట్‌లో నన్ను ఎంతో బాగా చూసుకున్నారు. సెట్‌లో ఆయన ఎనర్జీతో మాకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చింది. చాలా జాగ్రత్తలు తీసుకుని ఆయన ఈ సినిమాను రూపొందించారు. కచ్చితంగా విజయం సాధిస్తుందనే ధీమా ఉండేది.
Also Read- OG Movie: ‘ఓజీ’ మూవీ నేహా శెట్టి సాంగ్ వచ్చేసింది.. ఈ పాటను ఎలా మిస్ చేశారయ్యా?
ఇంకా ఏదో కావాలి
ఈ సినిమా చేస్తున్నప్పుడు నా మనసులో రెండు ఆలోచనలు ఉండేవి. ఈ పాత్ర నేను ఈజీగా చేయగలనని, అదే సమయంలో ప్రతి సినిమాకు గాయాలు తగిలించుకున్నట్లుగా ఈ సినిమాకు అంత ఇబ్బందులు పడి చేయాల్సినంత అవసరం లేదని. అందుకే చాలా రిలాక్స్‌గా ఈ సినిమాలో చేశాను’’ అని హృతిక్ తన పోస్ట్‌లో చెప్పుకొచ్చారు. ఆయన పోస్ట్‌ను క్షుణ్ణంగా పరిశీలిస్తే.. నటుడిగా ఆయనకు ఎదురైన సవాళ్లు, ఆ తర్వాత దాన్ని తేలిగ్గా తీసుకోవడానికి ప్రయత్నించిన మనస్తత్వాన్ని ఈ పోస్ట్ సూచిస్తోంది. సాధారణంగా, హృతిక్ రోషన్ తన పాత్రల కోసం తీవ్రంగా కష్టపడుతూ, శారీరకంగా, మానసికంగా ఎంతో శ్రమపడతారనే విషయం తెలియంది కాదు. అలాంటిది, ‘వార్ 2’ విషయంలో ఈజీగా అనిపించినప్పటికీ, ఆ సౌలభ్యం వెనుక ఉన్న కారణాన్ని ఆయన ఇలా చెప్పడం గొప్ప విషయంగా భావించాలి. ‘వార్ 2’ సినిమా రిజల్ట్‌ని హృతిక్ ఈ పోస్ట్‌లో నేరుగా ప్రస్తావించనప్పటికీ.. ‘‘ప్రతిదీ చాలా పర్ఫెక్ట్‌గా అనిపించింది.. అయినా ఇంకా ఏదో కావాలి’ అని ఆయన చేసిన వ్యాఖ్యలు సినిమా ఆశించిన విజయాన్ని అందుకోకపోవడానికి సంకేతంగా అంతా భావిస్తున్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
