Kodanda Reddy: రైతులు చిరుధాన్యాలు సాగు చేయాలని, అధిక లాభాలు గడించాలని రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి (Kodanda Reddy) కోరారు. హైదరాబాద్ లోని బీఆర్కే భవన్ లో రైతుకమిషన్ కార్యాలయంలో సంగారెడ్డి జిల్లాకు చెందిన డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ రైతులు కలిశారు. చిరుధాన్యాలతో తయారుచేసిన ఉత్పత్తులు, స్వీట్స్ ను రైతు కమిషన్ సభ్యులు కేవీఎన్ రెడ్డి, గోపాల్ రెడ్డి లకుఅందజేశారు. చిరుధాన్యాల సాగులో సాధించిన విజయాలను వివరించారు. సేంద్రియ వ్యవసాయ పద్ధతుల్లో రాగులు, సజ్జలు, జొన్నలు, అరికెలు, కొర్రలు, కందులు ఇతర చిరుధాన్యాలు, పప్పుదినుసుల సాగు చేస్తున్నట్లు తెలిపారు.
రాష్ట్రాల రైతులకు దక్కన్ డెవలప్మెంట్
దశాబ్దాల కాలంగా సహజ సిద్దమైన వ్యవసాయ విధానంలో సాగు చేస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా కోదండరెడ్డి మాట్లాడుతూ దేశంలోని వివిధ రాష్ట్రాల రైతులకు దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ రైతులు ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు. ఇతర దేశాల రైతులకు సైతం శిక్షణ ఇస్తున్నారని మండిపడ్డారు. దాదాపు30-40ఏళ్లుగా సహజ పద్ధతుల్లోనే సాగు చేస్తూ భూమిని, ఆరోగ్యాలను కాపాడుతున్నారన్నారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల రైతులు కూడా డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ రైతులను ఆదర్శంగా తీసుకొని పంటల సాగుచేయాలని పిలుపు నిచ్చారు.
వ్యూస్ కోసం విలువలు మరిచిపోతారా? ఇకపై చర్యలు తప్పవు.. సీపీ సజ్జనార్ హెచ్చరిక
పిల్లలతో కలిసి అసభ్యకర కంటెంట్ తో సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీ.సీ. సజ్జనార్ హెచ్చరించారు. వ్యూస్, లైక్స్ కోసం చిన్నారుల భవిష్యత్తును ఫణంగా పెడతారా? అని ప్రశ్నించారు. ఫేమస్ కావటానికి ఎంతటి నీచానికైనా దిగజారుతారా? అంటూ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ఇలాంటి కంటెంట్ తో పోస్టులు పెడుతున్నవారు సమాజానికి ఎలాంటి సందేశం ఇస్తున్నారన్నారు. పిల్లలు, యువతకు స్ఫూర్తినిచ్చే వ్యక్తుల ఇంటర్వ్యూలు చేసి వాటిని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయాలన్నారు.
జువెనైల్ జస్టిస్ యాక్ట్ ప్రకారం కేసులు పెడతాం
అలా కాకుండా అభ్యంతరకర కంటెంట్ తో పోస్టులు పెడితే అది బాలల హక్కుల ఉల్లంఘన అవుతుందని స్పష్టం చేశారు. ఇలాంటి వారిపై పోక్సో, జువెనైల్ జస్టిస్ యాక్ట్ ప్రకారం కేసులు పెడతామని హెచ్చరించారు. ఇలాంటి పోస్టులను వెంటనే తొలగించాలని సూచించారు. ఇక ముందు ఇలాంటి పోస్టులు పెట్టేవారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారన్నారు. కేసులు నమోదు చేయటంతోపాటు శిక్షలు పడేలా చూస్తామన్నారు. సోషల్ మీడియాలో ఇలాంటి పోస్టులు కంటపడితే వెంటనే 1930 నెంబర్ కు సమాచారం అందించాలని ప్రజలను కోరారు. దాంతోపాటు స్థానిక పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేయవచ్చన్నారు.
Also Read: Kodanda Reddy: రైతు ర్యాయితీలకు పూసగింజలు .. ఉద్యానవన పంటలకు కొత్త వెలుగు.. రైతు కమిషన్ చైర్మన్
