R. Krishnaiah: కార్మికుల ప్లాట్లకు న్యాయం చేయాలి.. ఆర్ కృష్ణయ్య!
R. Krishnaiah ( imagecredit:swetcha)
నార్త్ తెలంగాణ

R. Krishnaiah: అసంఘటిత కార్మికుల ప్లాట్లకు న్యాయం చేయాలి.. ఆర్ కృష్ణయ్య!

 R. Krishnaiah: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్ మండలంలోని కాచవాని సింగారం గ్రామంలో 2004–2005లో ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల పట్టాలకు పొజిషన్ చూపించక పోవడంతో ఇప్పటికీ పేదలు భూమిని స్వాధీనం చేసుకోలేక నిరాశలో ఉన్నారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య అన్నారు. తక్షణమే పొజిషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. మేడ్చల్ కలెక్టరేట్ ఎదుట అసంఘటిత కార్మికులు, సంఘాల ప్రతినిధులతో కలిసి ధర్నా నిర్వహించారు. ధర్నాలో పాల్గొన్న సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ పట్టాలు ఇచ్చిన ప్రభుత్వమే భూమిని అప్పగించకపోవడం తీవ్ర అన్యాయమన్నారు. 1500 మంది పేదలు రెండు దశాబ్దాలుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా పరిష్కారం లేదన్నారు. ఇప్పటికైనా స్పందించకపోతే ఉద్యమాన్ని రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తామని హెచ్చరించారు.

2002–2004 మధ్య ఉద్యమం జరిగింది

2002–2004 మధ్య ఉప్పల్ మండలం పత్తులగూడలో గుడిసెల్లో నివసిస్తూ జీవించిన అసంఘటిత కార్మికుల కోసం జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఉద్యమం జరిగిందని, తత్ఫలితంగా అప్పటి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ స్పందించి, సర్వే నెం.66లో ప్రభుత్వ భూమిని కేటాయించి 1500 మందికి పట్టాలు మంజూరు చేశారన్నారు. ఇప్పటి వరకు పొజిషన్ ఇవ్వకపోవడం పట్ల బాధితులు ఆవేదనతో ఉన్నారన్నారు. ధర్నా అనంతరం కలెక్టర్ గౌతంని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ ధర్నాలో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నీలం వెంకటేష్, గుడిసె వాసుల సంఘం అధ్యక్షుడు రవి, యువజన సంఘం నేతలు అంజి, నవీన్, అనంతయ్య, తదితరులు పాల్గొన్నారు.

Also Read: YSRCP: సీన్ రివర్స్.. స్థానిక సంస్థల ఎన్నిక‌ల్లో వైసీపీ విజయదుందుభి..

 

Just In

01

Jinn Trailer: భూతనాల చెరువు కాలేజ్‌లో దాగి వున్న మిస్టరీ ఏంటి? ఇది ‘జిన్’ ఆడే ఆట!

MLC Kavitha: ఒకవేళ సీఎం అయితే కొత్తగా ఏం చేస్తారు?.. ఎమ్మెల్సీ కవిత సమాధానం ఇదే

Bigg Boss Telugu 9: ఐదుగురు హౌస్‌మేట్స్‌తో ఎమోషనల్ డ్రామా మొదలైంది.. సంజన, తనూజ ఔట్!

MyGHMC App: ‘మై జీహెచ్ఎంసీ’ యాప్‌లో చక్కటి ఫీచర్.. మీ చుట్టూ ఉన్న సౌకర్యాలు ఇట్టే తెలుసుకోవచ్చు

Funky: విశ్వక్ ‘ఫంకీ’ రిలీజ్ డేట్ ఫిక్సయింది.. వాలెంటైన్స్ వీకెండ్ టార్గెట్‌గా!