Mehabubabad: గార్ల మండల కేంద్రంలో దోమల బెడదతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చిన్నారులు వృద్దులు సీజనల్ వ్యాధులై(Seasonal diseases)న డెంగ్యూ(Dengue), మలేరియా(malaria), టైఫాయిడ్(typhoid) జ్వరాలతో మంచం పడుతున్నారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తుండటంతో వీధుల్లో ఉన్న కాళీ స్థలాలలో పిచ్చి మొక్కలు మొలిచి మురుగు కాలువల్లో నిలిచిన చెత్తాచెదారంతో నీరు నిలువ ఉండటంతో దోమలు కాలీ స్థలాలు ఆవాసాలుగా చేసు కోని, వాటి సంతతి పెరగటానికి కారణమై పగలు రాత్రి తేడా లేకుండా దోమల విజృంభనతో కంటిమీద కునుకు లేకుండా పోతుందని స్దానికులు అవేదన వ్యక్తంచేస్తున్నారు.
పెరిగి పోతున్న వ్యాధులు
దోమల స్వైర విహారంతో ఆరుబయట సైతం నిల్చోలేని పరిస్థితి నెలకొందని దోమల నివారణకు కనీసం కాలువలలో బ్లీచింగ్ పౌడర్(Bleaching powder) చల్లడం లేదని స్థానికులు ఆవేదన వకచక్తం చేస్తున్నారు. ప్రజా ప్రతినిధులు ఉన్నతాధికారులు గ్రామంలో పర్యటించినప్పుడు మాత్రమే బ్లీచింగ్ పౌడర్ చల్లించి పంచాయతీ అధికారులు చేతులు దులుపుకోవడం పరిపాటిగా మారిందని తెలిపారు. దోమల వ్యాప్తి విపరీతంగా పెరిగి ప్రతిఏటా ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన ప్రాణాలు కోల్పోతున్నప్పటికీ వాటిని నివారించేందుకు గ్రామ పంచాయతీ అధికారులు చేస్తున్న కృషి అంతంత మాత్రంగానే ఉందని ఆరోపి స్తున్నారు.
Also Read: MLAs Disqualification Case: బీఆర్ఎస్ అనుకున్నది ఒక్కటి అయినదొక్కటి
పారిశుద్ధ్య నిర్వహణలో లోపం
దోమల వల్ల వైరల్ జ్వరాలతో పాటుగా ఇటీవల ఎమ్మార్వో(MRO) ఆఫీస్ రోడ్‌లో డెంగ్యూ కేసు కూడా నమోదయ్యాయి. పారిశుద్ధ్య నిర్వహణలో భాగంగా దోమల్నిఅరికట్టేందుకు గ్రామ పంచాయతీకీ ఫాగింగ్ యంత్రం సరఫరా చేసినప్పటికీ ఫాగింగ్ యంత్రాలతో దోమల మందు పిచికారి చేయడం లేదని ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని తక్షణ చర్యలు చేపట్టాల్సిన అధికారులు చోద్యంచూస్తున్నారని వాపోతున్నాడు. అప్పుడప్పుడు ఫ్రైడే డ్రైడే(Friday Dryday) ద్వారా దోమల నియంత్రణ చర్యలను మొక్కుబడిగా చేపడుతూ ప్రజారోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి దోమల నివారణకు వార్డులలో ఫాగింగ్(Fogging) చేయించాలని ప్రజలు కోరుతున్నారు.
Also Read: Khammam: ఈ వాహనం నేర పరిశోధనలో చాలా ముఖ్యం: కమిషనర్ సునీల్ దత్