Anudeep Durishetty: జిల్లాలోని 5 మునిసిపాలిటీలు (ఏదులాపురం, వైరా, మధిర, కల్లూరు, సత్తుపల్లి) లలో ఎన్నికలు నిర్వహించడానికి స్వేచ్ఛాయుత ఎన్నికలే లక్ష్యం గా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలోని 5 మునిసిపాలిటీల్లో 117 వార్డులకు 242 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటుచేసారు. సత్తుపల్లి మున్సిపాలిటీలో 28830, మధిరలో 25679, వైరా లో 24689, ఏదులాపురంలో 45256, కల్లూరు మున్సిపాలిటీలో 18866 మంది ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకొనున్నారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమీషన్ నోటిఫికేషన్ జారీచేసిందే తడవుగా నామినేషన్ల స్వీకరణకు ఏదులాపురం మునిసిపాలిటీలో 13, కల్లూరు లో 7, మధిర లో 8, సత్తుపల్లి లో 8, వైరా మునిసిపాలిటీలో 7 మొత్తం 43 నామినేషన్ స్వీకరణ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
స్వేచ్ఛగా, పకడ్బందీ ఏర్పాట్లు
జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు స్వేచ్ఛగా, న్యాయబద్ధంగా నిర్వహించడానికి పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. ఎన్నికల నిర్వహణకు 55 మంది ఆర్వో లు, 55 మంది ఏఆర్వో లు, 291 మంది పిఓ లు, 948 మంది ఓపిఓ లు, 26 మంది జోనల్ అధికారులు, 10 ఫ్లయింగ్ స్క్వాడ్, 10 ఎస్ఎస్టి టీములు సిద్ధం చేశారు. ఎన్నికల ఖర్చు నిఘాకు 5 గురు వ్యయ పరిశీలకులను , 2 సభ్యుల అకౌంటింగ్ టీములతో నియమించారు. ఎన్నికల నిర్వహణకు ఏదులాపురానికి 166, కల్లూరు కు 96, సత్తుపల్లి కి 113, మధిర కు 106, వైరా కి 99 బ్యాలెట్ బాక్సులు సిద్ధం చేసినట్లు తెలిపారు.
Also Read: Anudeep Durishetty: నిధులిచ్చాం పనులెందుకు చేయలే?.. అధికారులపై కలెక్టర్ అనుదీప్ ఫైర్!
భద్రతా చర్యలు పటిష్టం
ఎన్నికలు జరగనున్న 5 మున్సిపాలిటీలో ఎలక్టోరోల్ సంబంధ 417 అభ్యంతరాలు రాగా, అన్నిటినీ పరిష్కరించినట్లు కలెక్టర్ తెలిపారు. 5 మునిసిపాలిటీల్లోని 242 పోలింగ్ కేంద్రాల్లో 25 సెన్సిటివ్, 33 క్రిటికల్ పోలింగ్ కేంద్రాలను గుర్తించి, భద్రతా చర్యలు పటిష్టం చెసినట్లు కలెక్టర్ అన్నారు.అన్ని చోట్లా పటిష్ట భద్రత చర్యలు చేపడుతున్నట్లు, 163 సెక్షన్ అమలు చేస్తున్నట్లు కలెక్టర్ అన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి వెంటనే అమలులోకి వస్తుందని కలెక్టర్ అన్నారు. ఎన్నికలు స్వేచ్ఛ గా, న్యాయబద్ధంగా, ప్రశాంతంగా నిర్వహణకు అన్ని వర్గాల వారు సహకరించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.

