Municipal Elections: ఇటీవల గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వచ్చిన రిజల్ట్స్ రెబల్స్ కారణంగా జరిగిన నష్టం ఇతర అంశాలపై ప్రధాన పార్టీలు ఇప్పటికే గ్రౌండ్ వర్క్ కంప్లీట్ చేసి విశ్లేషణ పూర్తి చేసుకొని తప్పిదాలను సరిదిద్దుకునే పనిలో ఉన్నాయి. మున్సిపల్ ఎన్నికలకు కట్టుదిట్టంగా సిద్ధమవుతున్నాయి. ప్రధానంగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ (Congress Party) గ్రామపంచాయతీ ఎన్నికల్లో కొన్ని కీలక జీపీల్లో ఓటమి చవి చూసింది. ఈ నేపథ్యంలో మున్సిపల్ పోరులో అభ్యర్థుల ఎంపిక, పార్టీలో అంతర్గత విభేదాలను సమన్వయం చేసుకుంటూ బరిలోకి దిగాలని పార్టీ అధిష్టానం సూచన మేరకు మున్సిపల్ ఎన్నికలకు రెడీ అవుతోంది.
9 వేల పైచిలుకు మహిళా ఓటర్లు
ఓవైపు బీఆర్ఎస్ (Brs) పార్టీకి గ్రామపంచాయతీ ఎలక్షన్ ఫలితాలు ఆశాజనకంగా ఉండగా మరోవైపు కాంగ్రెస్ పార్టీ (Congress Party) మున్సిపల్ ఎన్నికలను (Municipal Elections)ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న నేపథ్యంలో మున్సిపల్ పోరు మరింత ఆసక్తికరంగా మారనుంది. జిల్లాలో మొత్తం ఓటర్లు 3,09,036 మంది ఉండగా పురుష ఓటర్లు 1,49,924 మంది ఉన్నారు. మహిళ ఓటర్లు 1,59,112 మంది ఉన్నారు. మున్సిపాలిటీలో పురుష ఓటర్ల కంటే సుమారు 9 వేల పైచిలుకు మహిళా ఓటర్లు అత్యధికంగా ఉండటం గమనార్హం. మొత్తానికి మున్సిపల్ ఎన్నికల పోరు హీట్ పెంచుతోంది.
జిల్లాల్లో 162 మున్సిపల్ వార్డులకు రిజర్వేషన్ల ప్రకటన
నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ సహా జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల పరిధిలోని వార్డులకు ఎస్టీ, ఎస్సీ లకు 2011 జనాభా ప్రకారం, అదేవిధంగా బీసీలకు డెడికేషన్ కమిషన్ సిఫారసు మేరకు రిజర్వేషన్ల స్థానాలను కేటాయించారు. ఎస్టీ కేటగిరీకి 11, ఎస్సీలకు_ 22, బీసీలకు_49, జనరల్ మహిళకు _48, జనరల్ కు 33 వార్డులను రిజర్వ్ చేశారు. నల్గొండ (Nalgonda) కార్పొరేషన్ తో పాటు మిగిలిన ఆరు మున్సిపాలిటీలలో మొత్తం 162 వార్డులకు గాను 81 స్థానాలను ఎస్టీ, ఎస్సీ, బీసీ, జనరల్ మహిళలకు రిజర్వ్ చేశారు. 2019 మున్సిపాలిటీ యాక్ట్ తో పాటు 2023 జాతీయ మహిళా రిజర్వేషన్ బిల్ విధానాలను పరిగణలోకి తీసుకొని రిజర్వేషన్లు ప్రకటించినట్లు అధికారులు తెలిపారు.
పొత్తులపై చర్చలు ముమ్మరం
మున్సిపాలిటీ ఎన్నికల బరిలోకి దిగేందుకు పొత్తులపై పార్టీలు తమ చర్చలను ముమ్మరం చేశాయి. మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ బలంగా ఉండటం, అదేవిధంగా బీజేపీకి ఆయా మున్సిపాలిటీలలో పట్టు ఉండటం ఎవరు ఏ వార్డు నుంచి బరిలోకి దిగాలని, ఎన్ని వార్డులలో పోటీ చేయాలన్న విషయమై చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ కలిసి పొత్తులతో బరిలోకి దిగనునునున్నాయ అనేది వార్డుల వారీగా రిజర్వేషన్లు ఖరారు చేసిన అనంతరమే తేలనుంది.
రిజర్వేషన్లపై ఉత్కంఠ
ఆయా మున్సిపాలిటీలో కేటగిరిల వారీగా కేటాయించిన వార్డుల రిజర్వేషన్ల స్థానాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా రిజర్వేషన్ రొటేషన్ విధానంలో ఏ రిజర్వేషన్ ఏ వార్డుకు వర్తింప చేస్తారన్నది ఖరారు చేయాల్సి ఉన్నది. ఈ నేపథ్యంలో ఆయా వార్డుల నుంచి పోటీ చేసేందుకు సిద్ధమైన అభ్యర్థులు రిజర్వేషన్ల కోసం ఉత్కంఠ గా ఎదురుచూస్తున్నారు.
ఫెస్టివల్ అనంతరం వార్డుల వారీగా రిజర్వేషన్లు ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది.
Also Read: Municipal Elections: మున్సీపాలిటీ వార్డుల రిజర్వేషన్‌పై ఉత్కంఠ.. నేడో రేపో రిజర్వేషన్ల ఖరారు

