Maoists In Mulugu
నార్త్ తెలంగాణ

Maoists In Mulugu: జనంలోకి రండి.. మావోయిస్టులకు ములుగు ఎస్పీ పిలుపు

ములుగు/మహబూబాబాద్ స్వేచ్ఛ: Maoists In Mulugu: అండర్ గ్రౌండ్ లో పనిచేస్తున్న మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిసి సుఖ సంతోషాలతో జీవితం కొనసాగించాలని ములుగు జిల్లా ఎస్పీ డాక్టర్ పి.శబరిష్ పేర్కొన్నారు. బుధవారం సరెండర్ – కమ్ – రిహాబిలిటేషన్ లో భాగంగా ములుగు జిల్లా ఎస్పీ ముందు లొంగిపోయిన ప్రభుత్వ నిషేదిత సి.పి.ఐ మావోయిస్ట్ పార్టీ నేషనల్ పార్క్ ఏరియా కమిటీ సభ్యురాలు, ఒడిస్సా రాష్ట్రం కలిమల మండలం పొట్టేరు గ్రామానికి చెందిన అలువ స్వర్ణ @ స్వర్ణక్క, ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెం గ్రామానికి చెందిన పుల్సం పద్మ @ ఊరే @గంగక్కలకు ములుగు జిల్లా ఎస్పీ శబరీష్ ప్రభుత్వం తరఫున వారికి అందవలసిన రివార్డును అందజేశారు.

Also Read: Mulugu Farmers: ఎట్టకేలకు న్యాయం.. ఆ రైతన్నలకు పరిహారం ప్రకటన..

అలువ స్వర్ణ @ స్వర్ణక్క కు రూ.4,00,000/, పుల్సం పద్మ @ ఊరే @గంగక్కకు రూ.5,00,000/ డిడిలను అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ… భవిష్యత్తులో ఏ అవసరం వచ్చిన ప్రభుత్వం తరఫున అండగా ఉంటామని, సహకరిస్తామని పేర్కొన్నారు. మావోయిస్టు సిద్ధాంతాలతో పనిచేస్తున్న సిపిఐ మావోయిస్టు పార్టీకి చెందిన అందరూ ప్రభుత్వం అందించే సరెండర్-కం-రిహాబిలిటేషన్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సమాజంలో ప్రశాంతమైన జీవితాన్ని గడపడానికి జనజీవన స్రవంతిలో చేరాలని తెలిపారు.

స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ/https://epaper.swetchadaily.com// లింక్ క్లిక్ చేయగలరు

 

Just In

01

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్

KTR: రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు