Mudiraj Caste Case (imagecredit:AI)
నార్త్ తెలంగాణ

Mudiraj Caste Case: కుల బహిష్కరణ కలంకలం.. చావే దిక్కుఅంటున్న బాధితులు

కమలాపూర్ స్వేచ: Mudiraj Caste Case: హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో కుల బహిష్కరణ కేసు చర్చనీయాంశంగా మారింది. 2021-22, 2022-23 సంవత్సరాల్లో ముదిరాజ్ సంఘంలో జరిగిన లావాదేవిల వివాదాల కారణంగా 24 మంది వ్యక్తులను మత్స్య పారిశ్రామిక సహకార సంఘం సర్వసభ్య సమావేశం ద్వారా కుల బహిష్కరణ చేసినట్లు భాదితులు ఆరోపిస్తున్నారు.

ఈ వ్యవహారంపై బాధితులు న్యాయం చేయాలని కోరుతూ హన్మకొండ సెంట్రల్ జోన్ డీసీపీని కలిసి బాధితులు ఫిర్యాదు చేశారు. అలాగే, కమలాపూర్ పోలీస్ స్టేషన్లోనూ పిర్యాదు చేసినట్టు బాధితులు తెలిపారు. బాధితులు మాట్లాడుతూ, గ్రామంలో తమపై అన్యాయం జరుగుతోందని, తక్షణమే న్యాయం జరిగేలా చూడాలని డిమాండ్ చేశారు.

కుల బహిష్కరణ కారణంగా తమ కుటుంబాలు తీవ్ర ఆర్థిక, సామాజిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని బాధితులు వాపోయారు. ఈ వ్యవహారంపై పోలీసులు తక్షణమే దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాలని బాధితులు విజ్ఞప్తి చేశారు. లేని యెడల మాకు ఆత్మహత్యే శరణ్యమని మీడియా ముందు వాపోయారు.

Also Read: Friendly Traffic Police: బైక్ ఆపిన పోలీస్.. ఒట్టేసి మరీ చెప్పిన బైకర్.. వీడియో వైరల్..

కమలాపూర్ ముదిరాజ్ కుల సంఘం పై సభ్యులు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని కమలాపూర్ ముదిరాజ్ కుల సంఘ పెద్దలు అన్నారు. కావాలనే అసత్య ప్రచారం చేస్తున్నారాని, ఇది కుల సంఘం గౌరవాన్ని మసకబార్చేలా ఉందని వారు పేర్కొన్నారు. ముదిరాజ్ సంఘం ఎప్పుడూ సమాజ హితమే కోరుకుంటుందని, సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుండే సంఘమని స్పష్టం చేసారు.

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు