MP Raghunandan rao (imagecredit:swetcha)
నార్త్ తెలంగాణ

MP Raghunandan rao: రాజకీయాల కోసం గుడులను వాడుకుంటే ప్రజా ఆగ్రహం తప్పదు

MP Raghunandan rao: శ్రీ కోదండ రామాలయంను ఎండోమెంట్ లో విలీనం కాకుండా కోదండ రాముడే దేవాలయాన్ని కాపాడుతాడని దానికి నేను ఎంపీగా పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తానని మెదక్ ఎంపీ రఘునందన్ రావు(MP Raghunandan Rao) స్పష్టం చేశారు. మెదక్(Medak)లో రామాలయాన్ని దేవాదాయ శాఖలో విలీనాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ(BJP) శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ రఘునందన్ రావు పాల్గొని మాట్లాడారు.

ధూప దీప నైవేద్యానికి నోచుకోక
మెదక్‌లో రామాలయాన్ని కక్షసాధిoపుల కోసమే దేవాదాయ శాఖలో విలీనం చేస్తున్నారని ఆరోపించారు. దేవాలయాల అభివృద్ధి పేరిట ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. గత రెండు రోజుల నుండి దేవాలయంను ఎండోమెంట్‌లో విలీనంపై రభసా జరుగుతుందని ఈ విషయం పై త్వరలోనే ఎండోమెంట్ కమిషనర్‌ను రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha)ను కలుస్తామని ఎంపీ హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఎన్నో దేవాలయాలు ధూప దీప నైవేద్యానికి నోచుకోక ఉన్నాయని ప్రభుత్వం దేవాలయం గురించి పట్టించుకో వద్దా అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వంకు ఆదాయం వచ్చే దేవాలయాలు ఎన్ని ఉన్నాయనీ. స్పష్టత లేదని ఆరోపణలు చేశారు.

Also Read: KCR Meetings: భవిష్యత్తు కనపడుతోందా.. బీఆర్ఎస్‌లో టెన్షన్ టెన్షన్

ఆసక్తి చూపించడం మంచిది కాదు
కోదండరామాలయం(Kodandaramalayam) పై ఎండోమెంట్ అధికారులు నిర్లక్ష్యంగా వైఖరి చూపించారని పబ్లిక్ నోటీస్(Public Notice) లేకుండా గుడికి తాళం ఎలా వేస్తారని రాజకీయ నాయకులు చెప్పినంత మాత్రాన ఎండోమెంట్ అధికారులు ఆసక్తి చూపించడం మంచిది కాదని ఆయన మండిపడ్డారు. అంతకుముందు మెదక్(Medak) జిల్లా బిజెపి(BJP) కార్యకర్తలు హిందూ సంఘాల వ్యక్తులు భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా బిజెపి అధ్యక్షుడు వాళ్దాస్ రాజా మల్లేష్ గౌడ్(Raja Mallesh Goud) బిజెపి సీనియర్ నాయకులు గడ్డం శ్రీనివాస్(Gaddam Srinivass), గడ్డం కాశీనాథ్, చోళ పవన్ కుమార్ యాదవ్, బిజెపి మోర్చా శివకుమార్, ఆలయ కమిటీ చైర్మన్ బండ నరేందర్ తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Also Read: 71 National Film Awards: జాతీయ అవార్డులు అందుకున్న తెలుగు సినిమాలివే..

Just In

01

Huzurabad Gurukulam: గురుకులంలో విద్యార్థులకు టార్చర్?.. ప్రిన్సిపాల్, ఓ పోలీస్ ఏం చేశారంటే?

Sujeeth Birthday: సుజీత్ బర్త్‌డే.. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ ట్వీట్ చూశారా?

Bottu Gambling: చిత్తు-బొత్తు ఆడుతున్న ఏడుగురి అరెస్ట్.. ఎంత డబ్బు దొరికిందంటే?

Mega Jathara: అసలైన మెగా జాతర సంక్రాంతి నుంచి మొదలు కాబోతోంది.. మెగా నామ సంవత్సరం!

Pak Targets Salman: సల్మాన్ ఖాన్‌పై పగబట్టిన పాకిస్థాన్.. ఉగ్రవాదిగా ముద్ర వేసేందుకు భారీ కుట్ర!