MLA Prakash reddy (imagecredit:swetcha)
నార్త్ తెలంగాణ

MLA Prakash reddy: అవకాశాన్ని వినియోగించుకోండి..ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి.

పరకాల స్వేచ్ఛ: MLA Prakash reddy: రాష్ట్రంలోని మహిళలను కోటీశ్వరులను చేయాలనే సంకల్పం కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యమని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. దామెర మండలం ల్యాదల్ల గ్రామంలో ఏర్పాటు చేయనున్న స్కిల్ డెవలప్మెంట్ అండ్ మినీ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ఫర్ ఉమెన్ సెంటర్ ను ఆయన హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్యతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు పెంపొందించే దిశగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు.

మహిళలను వ్యాపార వేత్తలుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో స్కిల్ వలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. మహిళా సోదరీమణులను కోటీశ్వరులుగా చేయాలని సంకల్పంతో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను ఏర్పాటు చేస్తుందని ఆయన తెలిపారు. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఏర్పాటు చేస్తున్నామని తద్వారా ఇంటర్నేషనల్ స్థాయిలో ప్రొడక్ట్స్ ని తయారు చేయగలుగుతామని అన్నారు.

ల్యాదల్లలో సెంటర్ ఏర్పాటు చేయడం వల్ల ఆత్మకూరు, దామెర, నడికూడ, పరకాల రూరల్, టౌన్ మహిళలకు అందుబాటులో ఉంటుందని ఆయన అన్నారు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా ప్రతి ప్రతి ఇంట్లో ఒకరికి ఉపాధి అవకాశాలు పొందుతారన్నారు. త్వరలో దామెర మండల కేంద్రంలో డైరీ సెంటర్ ను ఏర్పాటు చేయబోతున్నామన్నారు.

ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని అన్నారు. అలాగే నిరుద్యోగ యువతకి ఈనెల 4వ తేదీన మెగా జాబ్ మేళా ఏర్పాటు చేస్తున్నామని పరకాల ఎంఎల్ఏ రేవూరి అన్నాడు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, నాయకులు పాల్గొన్నారు.

Also Read: TG Cabinet Expansion: మంత్రి వర్గ విస్తరణపై వీడని సస్పెన్స్.. ఈ కారణాలే ఆటంకంగా మారాయా?

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు