వర్ధన్నపేట స్వేచ్ఛ: MLA K.R. Nagaraju: పర్వతగిరి మండలం అన్నారం, దూప తండా, పెద్ద తండా, రావురు గ్రామలల్లో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో పాదయాత్ర యాత్ర చేస్తూ భారత రాజ్యాంగం యొక్క ప్రాముఖ్యత, రాజ్యాంగం పై బీజేపీ చేస్తున్న కుట్రలను ప్రజలకు వివరించారు. ఎమ్మెల్యే కె.ఆర్ నాగరాజు అనంతరం బండి లావణ్య-రమేష్ ల ఆహ్వానం మేరకు తెల్లరేషన్ కార్డ్ దారులైన వారి ఇంట్లో ప్రభుత్వం అందిస్తున్న సన్నబియ్యం తో వంట వండిన భోజనంబ్ పలుకగా వెంటనే వారి ఆహ్వానం మేరకు స్వయంగా పాదయాత్ర ముగించుకొని రావురు లోని వారి ఇంటికి వెళ్లి ఎమ్మెల్యే కె.ఆర్ నాగరాజు, జిల్లా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ-వరదరాజేశ్వర్ రావు,
పిన్నింటి అనిల్ రావు, మార్కెట్ ఛైర్మన్ నరుకుడు వెంకటయ్య, బొంపెళ్లి దేవేందర్ రావు వారి ఇంట్లో తెల్లరేషన్ బియ్యంతో వండిన అన్నం తిన్నారు.రావురు గ్రామంలో బండి లావణ్య రమేష్ ల ఆహ్వానం మేరకు భోజనం చెయ్యడం జరిగిందని సన్నబియ్యం పథకం అమలు కావడంతో ప్రతి పేదవాడు కడుపు నిండా అన్నం తింటాడాని ఈ ఘనత రేవంత్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి చెందుతుందని, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఒక గొప్ప పథకం అని అన్నారు.
పేద వారి కలలు నెరవేర్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుందని రానున్న కాలంలో మరిన్ని పథకాలతో పేదవారిని ఆదుకోవడం కాంగ్రెస్ పార్టీ తోనే సాధ్యమని అన్నారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు జాటోతు శ్రీనివాస్,భాస్కర్,యూత్ నాయకులు కొమ్ము రమేష్,గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
Also Read: Bird Flu in Batasingaram: ఆందోళనలో కోళ్ల ఫామ్ నిర్వాహకులు…కోట్లలో ఆస్తి.. యజమానుల ఆవేదన!