Gadwal Municipality: హస్తం పేద ప్రజల నేస్తమని, మున్సిపాలిటీల అభివృద్ధి కాంగ్రెస్ ద్వారానే సాధ్యమని ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి అన్నారు. శుక్రవారం గద్వాల జిల్లా కేంద్రంలోని గద్వాల మున్సిపాలిటీ ఎన్నికల భాగంగా రాఘవేంద్ర కాలనీ నుండి పాత బస్టాండ్ వరకు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి(MLA Bandla Krishnamohan Reddy) ఆధ్వర్యంలో 37 వార్డుల అభ్యర్థుల నామినేషన్ దాఖలు సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు. ముందుగా రాఘవేంద్ర కాలనీ శ్రీ పాండురంగ దేవాలయంలో ఎమ్మెల్యే దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గద్వాల పట్టణం గతంలో ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదన్నారు. ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుండి గద్వాల అభివృద్ధి వైపుగా అడుగులు వేస్తోందన్నారు. గద్వాల పట్టణంలోని 37 వార్డులలో సి.సి రోడ్లు, డ్రైనేజీ నిర్మాణం, వీధిదీపాలు, ప్రతి ఇంటికి స్వచ్ఛమైన మంచినీటి సౌకర్యం కల్పించడం జరిగిందన్నారు.
అక్షరాస్యతలో ముందంజ
ఎన్నికలలో ఇచ్చిన మాట ప్రకారం సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పేద ప్రజలకు 6 గ్యారెంటీలను అమలు చేయడం జరుగుతుందన్నారు. అందులో భాగంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం జరిగిందన్నారు. అదేవిధంగా గద్వాల నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయడం జరిగిందని, సన్న బియ్యం, రేషన్ కార్డులు, సబ్సిడీతో వంటగ్యాసు, 200 యూనిట్ల ఉచిత కరెంటును ఇలా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అర్హులైన లబ్ధిదారులకు అందించడం జరుగుతోందని పేర్కొన్నారు. గతంలో రాష్ట్రంలోని గద్వాల ప్రాంతం వెనుకబడి ప్రాంతంగా పిలువ బడేది. ఇప్పుడిప్పుడే గద్వాల ప్రాంతం అక్షరాస్యతలో ముందంజలో ఉందన్నారు. గద్వాల నియోజకవర్గంలో నర్సింగ్ కాలేజీ మెడికల్ కాలేజీ తీసుకురావడం జరిగిందన్నారు. గద్వాల నియోజకవర్గంలో గట్టు మండలానికి చెందిన 8 మంది విద్యార్థులు మెడికల్ కళాశాలలో సీట్లను సాధించారన్నారు. అదేవిధంగా ఉపాధ్యాయ, పోలీస్ వివిధ రంగాల ప్రభుత్వ ఉద్యోగాలలో గద్వాల ప్రాంతానికి చెందిన యువతీ యువకులు ప్రభుత్వ ఉద్యోగాలను సాధించడం జరిగిందని తెలిపారు.
Also Read: Medigadda Barrage: అత్యధిక ప్రమాదకర జాబితాలో మేడిగడ్డ.. తక్షణ జోక్యం అవసరం అంటూ కేంద్రం హెచ్చరిక..!
ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్..
త్వరలోనే గద్వాలకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, త్రిబుల్ ఐటీ, నవోదయ విద్యాలయాల్లో తీసుకొని వచ్చే విధంగా నా వంతు కృషి చేస్తానన్నారు. ఈ ప్రాంతంలోని ప్రతి చిన్నారి చదువుకోవాలని చదువు ద్వారానే జీవితాలు మారుతాయన్నారు. గద్వాల అభివృద్ధిలో భాగంగా అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించి కోట్ల రూపాయలను తీసుకువచ్చి గద్వాలను అభివృద్ధి వైపుగా తీర్చిదిద్దడం జరుగుతుందన్నారు. భవిష్యత్తులో గద్వాల పట్టణాన్ని మరింత అభివృద్ధి చెందాలంటే. కాంగ్రెస్ పార్టీ తరపున బలపరిచిన అభ్యర్థులను గెలిపించి భారీ మెజార్టీతో గెలిపించి గద్వాల మున్సిపాలిటీ కైవసం చేసుకుని సీఎం రేవంత్ రెడ్డికి కానుకగా ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా సీనియర్ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, సర్పంచులు, మున్సిపాలిటీ కౌన్సిలర్స్ అభ్యర్థులు, నాయకులు కార్యకర్తలు, మహిళలు,యూత్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
Also Read; GHMC: జీహెచ్ఎంసీ విభాగాల పునర్వవస్థీకరణపై అధికారులు ఫోకస్.. రెవెన్యూలో ఎస్టేట్ విలీనం?

