Miss World Contestants (imagecredit:twitter)
నార్త్ తెలంగాణ

Miss World Contestants: రేపు ఓరుగల్లు సందర్శించనున్న అందాల భామలు!

Miss World Contestants: హైదరాబాద్ కేంద్రంగా మిస్ వరల్డ్ పోటీలు ఈ నెల 17న ప్రారంబించి 31వరకు నిర్వహించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సర్వం సిద్ధం చేశారు. తెలంగాణ సంస్కృతిని విశ్వవ్యాప్తం చేయాలనే ఉద్దేశ్యంతో అందాల పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన అందాల భామలకు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను చారిత్రాత్మక, ప్రసిద్ధ ప్రదేశాలను వీక్షించేందుకు ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఈ క్రమంలో ఈనెల 14న చారిత్రాత్మక ఓరుగల్లులో అందాల భామలు పర్యటించనున్నారు.

ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తింపు పొందిన ములుగు జిల్లాలోని రామప్ప ఆలయాన్ని, హనుమకొండ జిల్లాలోని వేయి స్తంభాల ఆలయం, వరంగల్ లోని కాకతీయుల కోటను అందాల ముద్దు గుమ్మలు వీక్షించనున్నారు. అందుకోసం రాష్ట్ర పర్యాటక శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. పాకిస్థాన్ తో యుద్ధ వాతావరణం, తెలంగాణ సరిహద్దులో కర్రే గుట్టల్లో మావోయిస్టుల అలజడి నేపథ్యంలో రెండువేల మందికి పైగా పోలీసులతో మూడంచెల భద్రత ఏర్పాట్లను అందాల భామలకు భద్రత కల్పించేందుకు పోలీసులు భద్రత ఏర్పాట్లు చేశారు.

ముస్తాబైన వరంగల్ పర్యాటక ప్రాంతాలు

ప్రపంచంలోని అనేక దేశాల నుంచి అందాల పోటీల్లో పాల్గొనేందుకు తెలంగాణకు వస్తున్న అందాల భామల రాక కోసం వరంగల్ లోని చారిత్రక, ప్రసిద్ధ ప్రాంతాలు ముస్తాబు అయ్యాయి. ఈనెల 14న ఓరుగల్లు అందాలను వీక్షించేందుకు 57 మందితో కూడిన ముద్దు గుమ్మల బృందాలు రానున్నాయి. 14న మధ్యాహ్నం 2గంటలకు హైదరాబాద్ నుంచి అమెరికా, కెనడాలకు చెందిన 35 మంది అందగత్తెల బృందం ఒకటి హనుమకొండ హరిత హటల్ కు చేరుకుంటారు. ఇదే సమయంలో 22 మంది యూరప్ అందగత్తెల బృందం రామప్పకు చేరుకుంటారు. వారు హనుమకొండ హరిత హోటల్ కు సాయంత్రం 4.30 గంటలకు చేరుకుంటారు. ఇక్కడి నుంచి వెయ్యి స్తంభాల గుడిని సందర్శిస్తారు.

అనంతరం వరంగల్ కోటకు చేరుకుని కాకతీయుల కళా వైభవాన్ని, అక్కడి ఉన్న శిల్పా సంపదను విక్షిస్తారు. కొంత సమయం మన విద్యార్థులలో మాట్లాడిన తరువాత రాత్రి 9:30 గంటలకు హరిత హోటల్ కు చేరుకుని రాత్రి భోజనం చేసి హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం అవుతారు. ముందుగా హనుమకొండకు చేరుకున్న మరో బృందం సాయంత్రం 5.30 గంటలకు రామప్ప చేరుకుంటారు. రామప్ప శిల్ప వైభవాన్ని తిలకిస్తారు. నీటిలో తేలియాడే అరుదైన ఇటుకులతో పాటు శిల్ప సంపద అందాలు పరిశీలిస్తారు. అనతంరం కాకతీయుల కాలంలోనే పురుడు పోసుకున్న పేరిణి నృత్య ప్రదర్శనను తిలకిస్తారు.

Also Read: BRS Party: ఉప ఎన్నికలు వస్తే గులాబీ పరిస్థితి ఏంటి.. కరువైన బలమైన నాయకులు!

అనంతరం రామప్ప కాటేజీల్లో రాత్రి భోజనం చేసి రాత్రి 8గంటలకు హైదరాబాద్ బయలుదేరుతారు. వీరి పర్యటనను సుమారు 120దేశాలకు ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. దీంతో కాకతీయుల కళానైపుణ్యం, శిల్ప సంపద సహా ఓరుగల్లు చరిత్ర ప్రపంచవ్యాప్తంగా వీక్షించనున్నారు. అందాల ముద్దుగుమ్మల రాకకోసం రామప్ప, వరంగల్ కోట, వేయిస్తంభాల దేవాలయాన్ని అధికారులు ప్రత్యేకంగా ముస్తాబు చేస్తున్నారు. వరంగల్ కు వచ్చే ముద్దుగుమ్మలను మంత్ర ముగ్ధులను చేసేందుకు జిగేల్ జిగేల్ మనిపించే లైట్లు, సౌండ్స్ ఏర్పాటు చేశారు.

అందాల బామలకు ప్రత్యేక బహుమతులు

ప్రపంచ అందాల పోటీల్లో పాల్గొనేందుకు వచ్చి వరంగల్ అందాలను వీక్షించేందుకు వస్తున్న ప్రపంచంలోని పలు దేశాల సుందరమణులకు జ్ఞాపికగా అందించే ప్రత్యేక బహుమతులను అటవీశాఖ అధికారులు సిద్ధం చేశారు. తెలుగాణ ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా మారుమోగేలా బహుమతులను సిద్ధం చేయించారు. మధ్యప్రదేశ్ నుంచి ఇద్దరు టైనర్లను పిలిపించి అంగాలపల్లి గ్రామంలోని 30 మంది మహిళలకు. శిక్షణ ఇప్పించి వెదురు కర్రతో వివిధ రకాల బొమ్మలను తయారు చేయించారు. ఈ బొమ్మల తయారికి తడ్వాయి నుంచి వెదురు వర్ర తెప్పించారు. ఎంతో నైపుణ్యంతో మహిళలు తయారు చేసిన బహును తులను బామలకు అందించనున్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు.

14న పర్యటకులకు అనుమతి లేదు.

ఈ నెల 14వ తేదీన మిస్ వర్డ్ పోటీలో పాల్గొనే అందాల బామలు వెంకటాపూర్ మండలం పాలంపేటలోని యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయానికి సందర్శించనున్నారు. ఈ నేపథ్యంలో ఆరోజు రామప్ప సందర్శించడానికి పర్యాటకులకు అనుమతి లేదని జిల్లా కలెక్టర్ టి. ఎస్. దివాకర తెలిపారు. 14వ తేదీ సాయంకాలం నాలుగు గంటల సమయంలో 30 నుండి 35 మంది సుందరీమణులు రామప్ప దేవాలయాని సందర్శించనున్నారని, దాదాపు మూడు గంటల పాటు రామప్పలో ఉంటారని కలెక్టర్ తెలిపారు.

ఈ సందర్భంగా పర్యాటకులకు ఎలాంటి అనుమతి ఉండదని, పాలంపేట గ్రామ ఆర్చి లోపలికి మధ్యాహ్నం 2 తర్వాత ఎవరికి అనుమతి ఉండదని, పర్యాటకులకు నిలిపివేస్తమన్నారు. 5 కిలోమీటర్ల వరకు డ్రోన్ కెమెరాలను నిషేధించడంజరిగిందని జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ తెలిపారు. ప్రపంచంలోనే నలుమూలల నుంచి విచ్చేస్తున్న అందగత్తెల పర్యటన నేపథ్యంలో వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మూడు అంచల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసినట్లు వరంగల్ సిపి సన్ ప్రీత్ సింగ్ తెలిపారు.

Also Read: MLC Kavitha: జైల్లో ఉన్నది సరిపోదా.. నన్ను ఇంకా కష్టపెడతారా.. కవిత ఆవేదన!

 

Just In

01

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?