Ponguleti Srinivas Reddy(image credit:X)
నార్త్ తెలంగాణ

Ponguleti Srinivas Reddy: కాంగ్రెస్ పార్టీ పెద్ద వట వృక్షం.. మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు!

Ponguleti Srinivas Reddy: కాంగ్రెస్ పార్టీ దేశంలో పెద్ద వట వృక్షమని రాష్ట్ర రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం కూసుమంచిలో జరిగిన కాంగ్రెస్ పార్టీ పాలేరు నియోజకవర్గ సన్నాహక సమావేశంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ఆ చెట్టు కింద ఎన్ని కోట్ల మందయిన సేద తీర్చుకోవచ్చన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఎత్తు పల్లాలు సహజమని నాయకులు, కార్యకర్తలు ఆందోళన పడాల్సిన అవసరం లేదన్నారు. తెలంగాణా రాష్ట్రాన్ని ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ అన్నారు.

కాంగ్రెస్ పార్టీ దాటికి ప్రాంతీయ పార్టీలు తారాజువ్వల ఎగిరి కింద పడతాయని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీలో పని చేస్తున్నామని గర్వంగా చెప్పుకుంటామన్నారు. పార్టీని బలోపేతం చేసేందుకు జాతీయ, రాష్ట్ర నాయకులు కృషి చేస్తున్నారని వెల్లడించారు. తెలంగాణా లో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ, నాయకులు కుటుంబ సభ్యులది ప్రధాన పాత్ర పోషించారన్నారు.
పదవులు కావాల్సిన వారు పార్టీ ఫార్మాట్ లో బయోడేట ఇవ్వాలని సూచించారు. రూ.8 లక్షల 19 వేల కోట్ల అప్పు చేసి గత ప్రభుత్వం అప్పు చేసి ప్రజలకు శతకోపం పెట్టిందన్నారు. ఆ అప్పులు తీర్చుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నామని గుర్తు చేశారు.

బీఆర్ఎస్ పది సంవత్సరాలు పాలించిన నాయకులు రాష్ట్రాన్ని పూర్తిగా కొల్లగొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. నిజాన్ని తప్పుగా మార్చుతూ బిజెపి, బిఆర్ఎస్ నాయకులు ప్రజలను వక్ర దారి పట్టిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రం చల్లగా ఉండలనుకునే వారు ప్రతిపక్ష విమర్శలు తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. ఉద్యోగ సంఘాల ను రెచ్చగొడుతుంది ప్రధాన ప్రతిపక్ష నాయకులేనని ఆందోళన వ్యక్తం చేశారు.
ఉద్యోగులు వారిపై ఎదురు దాడి చేయాలని సూచించారు.

Also read: KTR on CM Revanth: చేతకాకుంటే తప్పుకో.. దివాలా మాటలు వద్దు.. సీఎంపై కేటీఆర్ ధ్వజం

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనని దాన్ని అన్నట్లు ప్రతిపక్షం ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. రాష్ట్రాన్ని చిన్న బుచ్చుకున్నట్లు ఎలా అవుతుందో చెప్పాలన్నారు. మాయమాటలు చెప్పడం ఇందిరమ్మ ప్రభుత్వానికి రాదని స్పష్టం చేశారు. అప్పు ఉందని చెప్పకపోతే ప్రజలను మోసం చేసినట్లు అవుతుందని తెలిపారు. దొరికినంత వడ్డీకి తీసుకొచ్చి రాష్ట్రం మీద గుదిబండ పెట్టింది గత ప్రభుత్వమేనని విమర్శించారు. దేశంలో ఎనిమిదో వింత కాళేశ్వరమని చెప్పారు. ఒక లక్ష ఇరవై వేల కోట్ల పెట్టి కడితే కూలిపోతే చెప్పకుండా ఎలా ఉంటామని అన్నారు.

అబద్ధాలను నిజాలు చేయాలని బీఆర్ఎస్ నాయకులు తాపత్రయ పడుతున్నారని చెప్పారు. వరంగల్ సభను ఆపడానికి ఇందిరమ్మ ప్రభుత్వం చూసిందని చెపుతున్నారు… ఆపాలనుకుంటే ఆర్టీసీ బస్సులను ఎందుకు పంపుతామని చురకలు వేశారు. ఖమ్మంలో రాహుల్ గాంధీ సభను అడ్డుకుంది బీఆర్ఎస్ నాయకులు కాదా? అని ప్రశ్నించారు. రాబోయే రోజుల్లో ఏ ఎన్నికలు వచ్చిన ఇందిరమ్మ ప్రభుత్వం సిద్ధంగా ఉంటుందని వెల్లడించారు.

మీ ప్రభుత్వం చేసిన అప్పు మీ ఘన కార్యమే, మా ఖాతాలో వేసుకోమన్నారు. తెరిచిన పుస్తకంలా ఇందిరమ్మ ప్రభుత్వం నడుస్తుందని తెలిపారు. పేదవారి బాగోగుల కోసం ఇందిరమ్మ ప్రభుత్వం పని చేస్తుందని చెప్పారు. ఇందిరమ్మ ప్రభుత్వం లో ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు చేశామన్నారు. 25 లక్షల 60 వేల మంది రైతులకు రుణమాఫీ చేశామని, ఈ ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు.

ప్రతి నియోజకవర్గనికి 3,500 ఇళ్ళు ఇస్తున్నామని, ఇది నిరంతర కార్యక్రమమని పేర్కొన్నారు. పదేళ్ళలో మీరు (బిఆర్ఎస్) చేయలేనివి 16 నెలల్లో మేము చేసి చూపించామన్నారు. ఇందిరమ్మ ప్రభుత్వం లో భూభారతి చట్టం తీసుకొచ్చి రైతులకు అండగా ఉన్నామని స్పష్టం చేశారు.

Just In

01

CM Revanth Reddy: దేశంలోనే భాద్‌షా.. జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు