Damodar Rajanarasimha (image Credit: swetcha reporter)
నార్త్ తెలంగాణ

Damodar Rajanarasimha: ప్రతి అర్హుడికి 6 కిలోల సన్నబియ్యం.. ధనవంతుల అన్నం పేదల ఇంటికీ

Damodar Rajanarasimha: పేదల నేస్తం కాంగ్రెస్ హస్తం’ అని, ధనవంతులకు మాత్రమే పరిమితమైన సన్నబియ్యాన్ని అర్హులైన ప్రతి పేదవాడికి అందిస్తున్నామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ(Damodar Rajanarasimha) అన్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సంగారెడ్డి జిల్లా(Sangareddy District) కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత పదేళ్లుగా అధికారంలో ఉన్న ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం(Congress government) అధికారంలోకి వచ్చాకే అర్హులైన పేదలందరికీ రేషన్ కార్డులు అందించామని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) నేతృత్వంలో ప్రతి ఇంటికి, ఒక్కో వ్యక్తికి ఆరు కిలోల చొప్పున సన్నబియ్యం అందిస్తున్నామని తెలిపారు.

 Also Read: Universal Creation Test Tube Center: పేద మహిళలే టార్గెట్.. సరోగసి ఉచ్చులోకి లాగి లక్షల్లో సంపాదన?

గురుకులాల్లో నాణ్యమైన భోజనం

మహిళలకు సోలార్ ప్లాంట్లు, బస్సులు, ఇందిరా క్యాంటీన్లకు యజమానులుగా ఉండి ఆర్థికంగా అభివృద్ధి చెందేలా సున్నా వడ్డీ రుణాలను అందిస్తున్నామని అన్నారు. వైద్య ఆరోగ్య శాఖ తరఫున పల్లె దవాఖానలు, బస్తీ దవాఖానల ద్వారా పేదలకు మెరుగైన చికిత్స అందిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. గురుకులాల్లో నాణ్యమైన భోజనం అందించడానికి మెస్ ఛార్జీలు పెంచామని, మహిళా శిశు సంక్షేమ శాఖ ద్వారా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. అంతేకాకుండా, చేనేత కార్మికులకు చేయూతనివ్వడానికి సఖి కేంద్రాలు, చేనేత, జౌళి కేంద్రాలను ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు.

స్వాతంత్య్ర  సమరయోధులను మంత్రి దామోదర రాజనర్సింహ, కలెక్టర్ ప్రావీణ్య సత్కరించారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన ప్రభుత్వ ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా విద్యాశాఖకు చెందిన సంచార విజ్ఞాన ప్రయోగశాల వాహనాన్ని, హోం అఫైర్స్ విభాగపు మొబైల్ ఫోరెన్సిక్ వ్యాన్, క్లూస్ టీమ్ వాహనాన్ని ఎస్పీ పంకజ్‌తో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, మాదిరి, నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఉమా హారతితో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

 Also Read: UPI Payments: 1 నుంచి యూపీఐ పేమెంట్లలో మార్పులు.. లిమిట్ 50 సార్లు!

Just In

01

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?

Balapur Laddu Auction 2025: బాలాపూర్ లడ్డు సరికొత్త రికార్డ్.. ఈసారి ఎన్ని రూ.లక్షలు పలికిందంటే?

Pending Bills: పెండింగ్‌లో అద్దెవాహన బిల్లులు.. ఖజానా కోసం ఎంపీడీవోల చూపులు