Adluri Laxman Kumar: జిల్లాలోని సాంఘిక సంక్షేమ గురుకులాలు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ వసతి గృహాలలో విద్యా, వసతి, శానిటేషన్, ఆరోగ్యం విషయం లో ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అధికారులకు సూచించారు. కలెక్టరేట్లోని స్టేట్ సాంబార్ లో జిల్లా కలెక్టర్ కె. హైమావతి, అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్, ఆర్డీఓ సదానందం, జిల్లా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, పౌరసరఫరాల శాఖల అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు.
Also Read: Adluri Laxman Kumar: మైనార్టీ ఉద్యోగుల జీతాల్లో టెక్నికల్ ఎర్రర్.. త్వరలో జీఓ జారీ!
ఉన్నతమైన విలువలతో విద్యార్థులు గురుకులాల్లో విద్య
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి అన్ని గురుకులాలు సంక్షేమ వసతి గృహాలలో చదువే విద్యార్థులకు మంచి క్రమశిక్షణతో విద్యాబుద్ధులు నేర్పించి ఉన్నతమైన విలువలను విద్యార్థులకు అందించాలనేదే ముఖ్య ఆశయంతో ఉన్నారని అన్నారు. జిల్లాలోని గురుకులాల్లో ఎంత మంది విద్యార్థులు చదువుతున్నారు. గురుకులాల్లో మిగిలిన సీట్ల గూర్చి ఆరా తీశారు. అద్దె భవనాలలో కొనసాగుతున్న గురుకులాల సమస్యలు గూర్చి పూర్తి సమాచారం తమకు అందించాలని అధికారులను ఆదేశించారు. బెస్ట్ అవలెబుల్ స్కూల్ లలో పిల్లలు చదువు సమస్యలు తలెత్తకుండా చూడాలని ఆదేశించారు. స్కూల్ యూనిఫాం, బుక్స్, కాస్పోటిక్స్, ఆరోగ్య హాస్టల్ వసతిలో భోజన వసతి గూర్చి కల్పించాలి. తల్లిదండ్రులు ఎంతో నమ్మకంతో ప్రభుత్వ గురుకులాలు, సంక్షేమ వసతి గృహాలలో చేర్చడం జరుగుతుందని వారికి వారి నమ్మకాన్ని వమ్ముచేయకుండా విద్య, వసతితో మంచి ఉన్నతమైన విలువలతో విద్యార్థులు గురుకులాల్లో విద్యను అందించాలన్నారు.
గృహాలలో కామన్ డైట్ మెనూ పాటించాలి
అన్ని గురుకులాలు, సంక్షేమ వసతి గృహాలలో కామన్ డైట్ మెనూ పాటించాలని, వంట గది గురుకుల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. నాణ్యమైన సన్నబియ్యం పంపిణీలో ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి. జిల్లా కలెక్టర్ నుండి ఆయా సంక్షేమ శాఖల అధికారులందరూ గురుకులలు, సంక్షేమ వసతి గృహాలను ఆకస్మికంగా తనిఖీ చేసి పర్యవేక్షించాలని అన్నారు. వికలాంగులకు సంక్షేమం కోసం ట్రై సైకిల్, పలు పరికరాల పంపిణీ ప్రక్రియ వేగవంతం చెయ్యాలి. పెండింగ్ బిల్లులు, మరియు గురుకులాల్లో మౌలికవసతుల గూర్చి సంబంధిత బడ్జెట్ అతి త్వరలో సాంక్షన్ చేపిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. సమీక్షకు ముందు..మంత్రి అడ్లూరీ లక్ష్మణ్,కలెక్టర్,ఇతర అధికారులు సంక్షేమ హాస్టల్లో గురుకులాలను సందర్శించారు. విద్యార్థులతో సహా పంక్తి భోజనం చేశారు.విద్యార్థులతో మంత్రి మాట్లాడారు.సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
