Medchal registration office ( IMAGE credit: swetcha reporter)
నార్త్ తెలంగాణ

Medchal registration office: రిజిస్ట్రేషన్ ఆఫీస్‌లో గందరగోళం.. ఇంటర్నెట్ లేక ఇబ్బందులు

Medchal registration office: రిజిస్ట్రేషన్లు ఆగిపోయి క్రయ విక్రయదారులు అబ్బందికి గురవుతున్నారు. ఇటీవల రామంతాపూర్(Ramanthapur) జరిగిన ఘటనలో విద్యుత్ స్తంభాలకు ఉన్న టీవీ, ఇంటర్నెట్ కేబుళ్లను తొలగించిన విషయం తెలిసిందే దీంతో మేడ్చల్ ప్రాంతంలోని పలు ప్రాంతాలకు ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. అందులో భాగంగా మేడ్చల్ రిజిస్ట్రేషన్ కార్యాలయానికి ఉన్నఎయిర్టెల్ ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. గత  మేడ్చల్ రిజిస్ట్రేషన్ కార్యాలయాని(Medchal registration office)కి ఇంటర్నెట్ సేవలను నిలిచిపోయి, రిజిస్ట్రేషన్లు అగిపోయాయి. అప్పటి నుంచి క్రయ విక్రయదారులు కార్యాలయం చుట్టూ తిరుగాల్సి వస్తుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడి ఉండే సాయంత్రం ఊసురుమంటూ ఇంటికి వెళ్తున్నారు.

Also Read: Dharmapuri Heavy Rains: భారీ వర్షాలు వర్షాలు.. ధర్మపురిలో ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్న గోదావరి

పేరుకుపోతున్న రిజిస్ట్రేషన్ దరఖాస్తులు

మేడ్చల్ రిజిస్ట్రేషన్ కార్యాలయం(Medchal registration office) పరిధిలో ప్రతి రోజు 60 నుంచి 70 రిజిస్ట్రేషన్లు అవుతాయి మంచి రోజు అయితే 100 వరకు అవుతాయి. శని, సోమ, మంగళ, గురువారం నాలుగు రోజులకు సంబంధించిన 500లకు పై చిలుకు దరఖాస్తులు రిజిస్ట్రేషన్ కాకుండా నిలిచిపోయాయి. దస్తావేజు లేఖర్లు తమ వద్ద ఉన్న ప్రైవేట్ ఆపరేటర్ల ఇంటర్నెట్ సౌకర్యంతో ప్లాట్లు బుక్ చేస్తున్నా రిజి స్ట్రేషన్ కార్యాలయంలో మాత్రం నెట్ లేకపోవడం ఇబ్బందిగా మారింది దూర ప్రాంతాల నుంచి వచ్చే క్రయ, విక్రయదారులు రిజి స్ట్రేషన్ కార్యాలయానికి రావడం, నోటీసు బోర్డు మీద అతికించి ఉన్న ప్రకటనను చూసి, వెనుదిరిగి వెళ్లిపోతున్నారు. డబ్బులు వస్తాయని విక్రయదారులు ఎదరుడూస్తుంటే, డబ్బులు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకుంటే అయిపోతుండా కదా అని కొనుగోలుదారులు ఎదురు చూస్తున్నారు.

పునరుద్ధరణపై కొరవడిన స్పష్టత

మేడ్చల్ రిజి స్ట్రేషన్ కార్యాలయానికి ఇంటర్నెట్ సేవల పునరుద్ధరణ ఎప్పుడు జరిగి, రిజిస్ట్రేషన్ ఎప్పుడు ప్రారంభం అవుతాయనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. కార్యాలయ అధికారులు తమ పడుతున్న ఇబ్బందులపై ఇంటర్నెట్లోను అందిస్తున్న ఎయిర్టెల్ నిర్మాహకులకు ఫిర్యాదు చేశారు. అయితే వారు ఎప్పుడు సేవలు పునరుద్ధరిస్తారనే విషయానికి సంబంధించిన స్పష్టమైన సమాచారమైతే లేదు. దీంతో క్రయ, విక్రయదారులు ప్రతి రోజు నోటీసు బోర్డు చు సుకొని, ఈ రోజు రిజిస్ట్రేషన్లు జరగవన్న మాట అని అనుకోవాల్సి వస్తుంది.

దుర ప్రాంతాల నుంచి వచ్చిన కొంత మంది ఎలాగో ఇంత దూరం వచ్చాం కదా కొన్ని గంటలు వేచి చూస్తే రిజిస్ట్రేషన్లు ప్రారంభం కాకపోతాయా అని ఎదురు చూసి, సాయంత్రం ఊసురుమని వెళ్లిపోతున్నారు. అయితే ఎయిర్టెలు, విద్యుత్ శాఖకు మధ్య సమన్యయం కొరవడి, ఇంటర్నెట్ సేవల పునరుద్ధరణ జరగడం లేదని తెలుస్తోంది ఇద్దరి మధ్య సమన్వయం కుదిరినప్పుడే సేనలు ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది.

సేవల పునరుద్ధరణకు ప్రయత్నిస్తున్నాం

ఇంటర్నెట్ సేవల పునరుద్ధరణకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. గంట గంటలకు ఇంటర్నెట్ సేనీల నిర్వాహక కంపెలీ ఎయిర్టెల్తో పాటు విద్యుత్ శాఖ అధికారులను సంప్రదిస్తున్నాం వెంటనే పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం అలాగే తమ శాఖ ఉన్నతాదికారులకు కూడా మేడ్చల్ తలెత్తతున్న ఇబ్బందులను వివరిస్తున్నాం గురువారం సైతం విద్యుత్ శాఖ ఎయిర్టెల్స్ను సంప్రదించాం శుక్రవారం వరకు ఇంటర్కెట్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. కాని ఖచ్చితంగా ప్రారంభం అవుతాయని చెప్పలేకున్నాం.

 Also Read: Plants: మనుషులకే కాదు.. మెుక్కలకూ ఆ ఫీలింగ్స్ ఉంటాయట.. అప్పుడవి ఏం చేస్తాయంటే?

Just In

01

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?