Medchal Police: హ్యాట్సాఫ్ పోలీస్.. దొంగతనాల నిందితుల పట్టివేత
Medchal Police ( image credit: swetcha reporter)
నార్త్ తెలంగాణ, హైదరాబాద్

Medchal Police: హ్యాట్సాఫ్ పోలీస్.. దొంగతనాల నిందితుల పట్టివేత కేసుల్లో ఆ జిల్లానే టాప్!

Medchal Police:  మేడ్చల్ పోలీసులు కేసులను త్వరితగతిన చేదిస్తూ భేష్ అనిపించుకుంటున్నారు. చైన్ స్నాచింగ్, ఆటోల దొంగతనాల కేసుల్లో నిందితుల పట్టుకొని, కటకటాల్లోకి పంపిస్తున్నారు. ఐదు నెలల కాలంలో ఎన్నో కేసులను పరిష్కరించి, బాధితులకు న్యాయం చేశారు. డీసీసీ కోటిరెడ్డి మార్గదర్శకత్వంలో డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ కిరణ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక టీం నిందితులను పట్టుకొని, శిక్ష పడేలా చేస్తున్నారు చురుగ్గా వ్యవహరిస్తూ ముందస్తు సమాచారంతో చైన్ స్నాచింగ్ ను అడ్డుకున్నారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని పలు పోలీస్ స్టేషన్లో నిరంతరం జరుగుతున్న ఆటోల దొంగతనాలకు ఫుల్స్టాప్ పడేలా చేశారు డిఐ కిరణ్ ఆధ్యర్యంలో ఛే దించిన పలు కేసులకు సంబంధించిన వివరాలను పరిశీలిస్తే గొల్కొండ ప్రాంతానికి చెందిన అబ్దుల్ రహీం, బుద్దీన్లపై ఎంతో కాలంగా నేరాలు చేస్తున్నారు. దొంగతనాలకు సంబంధించి ఒకరిపై 15 కేసుల వరకు, మరొకరిపై 70 కేసుల వరకు ఉన్నాయి.

Also ReadCollector Hanumantha Rao: యువత డ్రగ్స్ బారిన పడకుండా ఉండడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలి : కలెక్టర్ హనుమంతరావు

కేసు దర్యాప్తు

వారిద్దరు ఈనెల 3వ తేదీన పేట్బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిదిలో చైన్ స్నాచింగ్కు పాల్పడ్డారు. ఈ కేసు దర్యాప్తును ప్రారంబించిన డి ఐ కిరణ్ ఆధ్యర్యంలోని బృందం నిందితులను గుర్తించారు. కేవలం ఏడు రోజుల వ్యవధిలో నిందితులు రహీం, ఖుతుబుద్దీన్లపై నిఘా పెట్టి, హైదరాబాద్లో సంచరిస్తుండగా పట్టుకున్నారు. 2024 జూన్లో ధ్రువ కళాశాల వద్ద చైన్ స్నాచింగ్ కూడా వీరిద్దరు బాధ్యులని విచారణలో తేలింది. ఇదిలా ఉంటే ఈ నెల 15వ తేదీన ఇద్దరు పాత నిందితులు చైన్ స్నాచింగ్ వేచి వున్నట్టు వచ్చిన విశ్వసనీయ సమాచారం పట్టుకున్నారు.

పహడీ షరీఫ్కు చెందిన నర్రు, మిర్జాఖాన్లు మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కండ్లకోయ జీఎఆర్ ఫంక్షన్ హాల్కు సమీపంలో చైన్ స్నాచింగ్ లక్ష్యంగా మాటువేసినట్టు సమాచారం రావడంతో వెంటనే స్పందించిన పోలీసులు వారిని పట్టుకొని, నేరం జరగకుండా అడ్డుకున్నారు. కాగా ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన ఖయ్యూం అనే వ్యక్తి పూజలు చేసి, డబ్బులను రెట్టింపు చేస్తానని దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక కుటుంబాన్ని నమ్మించి రూ.30 లక్షలతో ఊడాయించాడు. అతడు మేడ్చల్ రైల్వే స్టేషన్లో ఉన్నట్టు సమాచారం అందుకున్న డిఐ కిరణ్ అక్కడికి వెళ్లాడు. డి ఐని చూసిన నిందితులు పరుగులు పెట్టారు. పారిపోతున్న అతడిని డిఐ రెండు కిలో మీటర్ల దూరం ఛేజింగ్ చేసి, పట్టుకున్నారు.

ఆటోల దొంగతనానికి అడ్డుకట్ట

నిజామాబాద్ జిల్లాలోని నిజామాబాద్, భోదన్ ప్రాంతాలకు చెందిన ముఠా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని మేడ్చల్, పేట్ బషీరాబాద్, జీడిమెట్ల, బాలానగర్, దుండిగల్, రాజేంద్రనగర్ తదితర ప్రాంతాల్లో ఆటోల దొంగతనానికి పాల్పడుంది. ఆయా పోలీస్ స్టేషన్లో వరిధిలోని 108పై చిలుకు ఆటోల దొంగతనం జరిగింది. ఈ కేసు దర్యాప్తు చేపట్టిన బృందం నిజామాబాద్ జిల్లాకు చెందిన వారు ఈ దొంగతనాలకు పాల్పడుతున్నట్టు గుర్తించారు. ముమ్మర దర్యాప్తులో సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో బెంగతనం చేసిన అబోలను మహారాష్ట్రలోని నాందేడ్ ప్రాంతంలో అమ్మి, సొమ్ము చేసుకున్నట్టు తేలింది. మనోహరాబాద్ టోల్ గేట్ మీదుగా వెళ్తున్న తెలుసుకున్న పోలీసుల బృందం ముందుగా టోల్గేట్ వద్ద మాటువేసి, పట్టుకున్నారు. అక్కడ ముగ్గురిని, వారిచ్చిన సమాచారంతో నిజామాబాదులో మరో ముగ్గురిని, మహారాష్ట్రలో మరొకరిని పట్టుకున్నారు. మహారాష్ట్రకు వెళ్లి 20 ఆటోలను రికవరీ చేశారు.

Also Read: Tiger Estimation 2026: రేపటి నుంచే టైగర్ ఎస్టిమేషన్.. వన్యప్రాణుల స్థితిగతులపై సమగ్ర నివేదిక!

Just In

01

Lucky Draw Scam: నిన్న బెట్టింగ్ యాప్స్.. నేడు లక్కీ డ్రా.. ఆశపడ్డారో జేబులు గుల్లే!

NTR Death Anniversary: ఆయనలా స్వార్థం లేకుండా ఈ రోజున రాజకీయం చేయగలరా?

Bhatti Vikramarka Row: భట్టిపై ఓ పత్రిక అవినీతి ఆరోపణలు.. అసలేంటీ ‘ఫీల్డ్ విజిట్’ నిబందన?. అనుమానాలివే!

Assembly Session: ఫిబ్రవరిలో అసెంబ్లీ సమావేశాలు.. ఈసారి జగన్ రావాల్సిందేనా? లేదంటే సీటు గల్లంతేనా?

Bandla Ganesh: తిరుమలకు బండ్ల గణేష్ పాదయాత్ర.. ఎందుకో తెలుసా?