Medchal Drainage system (imagecredit:swetcha)
నార్త్ తెలంగాణ

Medchal Drainage system: గ్రామాల్లో కనిపించని అభివృద్ధి.. సమస్యలపై పట్టింపేది!

Medchal Drainage system: ప్రజాప్రతినిధులు లేకపోవడంతో గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడింది. సమస్యలు పరిష్కారం కావడం లేదు. అధికారుల తీరు వస్తున్నామా పోతున్నామా! అన్నట్టే ఉంది. కానీ సమస్యలపై ఏ మాత్రం దృష్టి సారించడం లేదు. శామీర్ పేట్ మండలం యాడారం గ్రామంలో మురుగు నీరు రోడ్డు పైకి చేరి దుర్గంధం వెదజల్లుతోంది. 3 నెలల నుంచి డ్రైనేజ్ పొంగి రోడ్డు పై ప్రవహిస్తున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారు. అధికారులు పాలనలో అభివృద్ధి ఊసే లేదు. కానీ కనీసం సమస్యలనైనా పరిష్కరించడం లేదు.

సమస్యల పరిష్కరించరా అని అడిగితే నిధుల్లేవు, ఉన్నతాధికారులకు వద్దకు వెళ్లండని ఉచిత సలహాలు ఇస్తుండడంపై స్థానికులు మండిపడుతున్నారు. రోడ్డుపై మురుగు నీరు పారుతుంటే పట్టించుకోరా? ఇలా ఇదేనా ప్రజా పాలన అని వారు ప్రశ్నిస్తున్నారు, వెంటనే సమస్యల పరిష్కారానికి చర్య తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

మా బాధలు పట్టించుకునే వారే లేరు :అక్కపల్లి ఎల్లమ్మ, గ్రామస్థురాలు

మూడు నెలల నుంచి ఇంటి ముందు నుంచి మురుగు నీరు పారుతున్నాయి. ఇంట్లో నుంచి బయటకు పోలేకపోతున్నాం. బయటకు వస్తే ఇంట్లోకి పోలేకపోతున్నాం. ఇంటి ముందు వస్తున్న గబ్బు వాసనతో ఇంట్ల ఉండలేకపోతున్నామంటూ, మోరీల నీళ్లు రోడ్డుపైకి రాకుండా చేయాలని ఎన్ని సార్లు మా బాధ చెప్పిన పట్టించుకోవడం లేదని అన్నారు.

Also Read: Harish Rao: మద్యం ప్రియుల పక్షాన హరీష్ రావు.. రేవంత్ సర్కార్‌పై కొట్లాట!

 

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!