Warangal News: వరంగల్ జిల్లా ఖిలవారంగల్ మండలం బొల్లికుంట గ్రామంలో ఓ భూ వివాదం తీవ్ర ఘర్షణకు దారితీసింది. గ్రామస్థులు ఏకమై ఆక్రమణకు వచ్చిన వారిపై తిరగబడి తరిమి కొట్టారు. బొల్లికుంట(Bollikunta)కు చేసిన సోల్తి రాజు గౌడ్(Raju Goud), రామస్వామి(Ramaswami) లకు చెందిన భూమిలోకి దొంతి ఇంద్రసేనా రెడ్డి(Indrasena Reddy) తన అనుచరులు 100 మంది కిరాయి వ్యక్తులతో జేసీబీ(JCB), దోజర్లతో వచ్చిన వారు భూమిలోకి చొరబడే ప్రయత్నం చేశారు. ఇల్లు కూల్చి దౌర్జన్యం చేసేందుకు అక్రమార్కులు ప్రయత్నించగా ఒక్కటైనా బొల్లికుంట గ్రామస్తులు వారిని తరిమికొట్టారు.
సీసీ కెమెరాలు ధ్వంసం
ఉదయం భూమిలోకి దొంతి ఇంద్రసేన రెడ్డి(Indrasena Reddy) అతని అనుచరులు అతని భార్య మరియు అల్లుడు 100 మంది కిరాయి వ్యక్తులతో జేసీబీ, డోజర్ తీసుకొని వచ్చారు. ఇదేమని ప్రశ్నించిన స్థానికలుపై ఇష్టం వచ్చినట్లు దౌర్జన్యం చేశారు. వీడియో తీసి ఎందుకు ప్రశ్నించిన వారి ఇండ్ల పైకి పోయి దాడికి ప్రయత్నించారు. కొట్టి చంపుతాం అని భేదిరించి భూమిలోకి ప్రవేశించి బయ బ్రాంతులకు గురి చేశారు. సీసీ కెమెరాల(CC Camera) ను ధ్వంసం చేసి హార్డ్ డిస్క్ ని తీసువెళ్లి నిర్మించిన ఇంటిని కూల్చి వేసినట్లు స్థానికులు ఆరోపించారు.
Allso Read: Banakacherla: బనకచర్ల రాజకీయం.. మళ్లీ మొదలు!
చంపుతామని బెదిరిస్తూ విధ్వంసం
మారన ఆయుధాలతో బెదిరిస్తూ అక్కడ ఉన్న నిర్మాణాన్ని కూల్చి వేవయమే కాకుండా ఎక్కడ చెప్పుకుంటారో చెప్పుకోండి అంటూ ఎవరు అడిగితే వాళ్ళని సైతం కొట్టి చంపుతామని బెదిరిస్తూ విధ్వంసం సృష్టించడంతో గ్రామస్తులు ఏకమయ్యారు. ఈ విషయంపై పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు(Police) నిందితులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఇంద్రసేనరెడ్డి(Indrasena Reddy) అతని అనుచరులు చేసిన విధ్వంసకాండ పై పోలీసులు తమకు న్యాయం చేయాలని బాదితులతో పాటు గ్రామస్తులు కోరుతున్నారు. ఇదిలా ఉంటే ఇంద్రసేనరెడ్డి మరియు అంతని అనుచరుల దాడి ఘటనపై విచారణ చెపట్టిన పోలీసులు పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తున్నారు.
Also Read: Anganwadi Teachers: ఫ్రీ ప్రైమరి టీచర్స్‌గా అంగన్వాడీ టీచర్లను నియమించాలి.. మంత్రికి వినతి