KTR: మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ నిర్ణయించిన అభ్యర్థిని కాదని ఎవ్వరూ అలగడం గులగడం చేయొద్దని, ఒకవేళ అలిగినా గులిగినా గులాబీ జెండాను గెలిపించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. జనగామ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లకు ఆత్మీయ అభినందన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కేటీఆర్ మాట్లాడుతూ, జనగామ జిల్లా కేంద్రం చేసింది బీఆర్ఎస్ పార్టీయేనని గుర్తు చేశారు. ‘కేసీఆర్ మాటే వేధంగా పనిచేసే నాయకులు ఉన్నారు. అలాంటి జనగామ జిల్లాలో ఉన్న మూడు మున్సిపాలిటీలు జనగామ, స్టేషన్ ఘన్‌పూర్, చేర్యాలలో గులాబీ జెండా రెపరెపలాడాలి. ఎవరికి టికెట్ ఇచ్చినా అందరూ కలిసికట్టుగా పనిచేయాలి.
కేసీఆర్‌ను ఎందుకు ఉరి తీయాలో చెప్పాలి
కేసీఆర్‌ను ఉరి తీయాలని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఎందుకు ఉరి తీయాలో చెప్పాలి. రైతు బందు ఇచ్చినందుకా, రైతు భీమా ఇచ్చినందుకా, కళ్యాణలక్ష్మీ, షాదీ ముభారక్ ఇచ్చినందుకా, రుణమాఫీ చేసినందుకా, ఇంటింటికి నల్లా పెట్టి మహిళల గోస తీర్చినందుకా, తెలంగాణ తెచ్చినందుకా? ఎందుకు ఉరి తీయాలో చెప్పాలి. ప్రజా సమస్యలు ప్రస్తావిద్దామని అసెంబ్లీకి పోదామని పోతే అక్కడ అంతా అస్తవ్యస్తంగా ఉంది. అది గౌరవ సభలాగా లేదు, కౌరవ సభలాగా ఉంది. కేసీఆర్‌ను సభకు రావాలి.. రావాలి అని డిమాండ్ చేస్తున్నారు. అసలు సభ సభలాగా లేదు. సభ సజావుగా సాగితే సభకు వస్తే బాగుంటుంది’ అని కేటీఆర్ చెప్పారు.
గులాబీ జెండా ఎగురేస్తాం
జనగామ, స్టేషన్ ఘన్‌పూర్, తొర్రూరు, చేర్యాల మున్సిపాలిటీల్లో గులాబీ జెండాను ఎగురవేస్తామని మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో గులాబీ జెండాను రెపరెపలాడించామని, అత్యధిక స్థానాలు గెలిపించామని అన్నారు. ‘జనగామ జిల్లాను చేసింది మేమే. గోదావరి నీళ్ళు తెచ్చింది, స్టేషన్ ఘన్‌పూర్‌కు 100 పడకల దావాఖానా తెచ్చింది, ఘన్‌పూర్‌ను మున్సిపాలిటి చేసింది కేసీఆరే. పాలకుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 46వేల ఓట్ల మెజారిటీ వస్తే, సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు 18వేల ఓట్ల మెజారిటీ వచ్చింది’ అని ఎర్రబెల్లి తెలిపారు. కాగా, కేటీఆర్ పర్యటనకు పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు. జనగామ పట్టణం గులాబీమయం అయింది. హైదరాబాద్ బైపాస్ రోడ్డు నుంచి చౌరస్తా మీదుగా బీఆర్ఎస్ కార్యాలయం వరకు భారీ ఊరేగింపు నిర్వహించారు. కేటీఆర్ రాకతో జనగామ పట్టణం శ్రేణులు బైక్ ర్యాలీ చేపట్టారు.
Also Read: KTR: క్యాలెండర్లు మారుతున్నాయి తప్ప.. ప్రజల జీవితాల్లో మార్పు లేదు: కేటీఆర్
కృష్ణా జలాల కోసం బీఆర్ఎస్ పోరుబాట
జూరాల ప్రాజెక్టు నుంచి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు నీరు తీసుకోవాల్సిందని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న అసత్య ప్రచారంపై, నీటి లభ్యత లేని జూరాల దగ్గర పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం చేపడతాం అన్న కాంగ్రెస్ పార్టీ ప్రకటనలను,పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జూరాల ప్రాజెక్టు నుంచి నీరు తీసుకోవడానికి అనుకూలం కాదని కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలియజేయడానికి ఉమ్మడి పాలమూరు బీఆర్ఎస్ మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి,శ్రీనివాస్ గౌడ్,లక్ష్మారెడ్డి,ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి,ఎమ్మెల్యే విజయుడు,మాజీ ఎమ్మెల్యేలు చిట్టెం రామ్మోహన్ రెడ్డి,అంజయ్య యాదవ్, మరి జనార్దన్ రెడ్డి,పట్నం నరేందర్ రెడ్డి,రాజేందర్ రెడ్డి,ఆల వెంకటేశ్వర్ రెడ్డి లతో కలసి, గద్వాల నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జి బాసు హనుమంతు నాయుడు జూరాల ప్రాజెక్టును సందర్శించారు.
ఈ కార్యక్రమంలో జాంపల్లి వెంకటేశ్వర రెడ్డి, రాజారెడ్డి, వెంకటేష్ నాయుడు,మోనేష్,గంజిపేట రాజు,చక్రిధర్ రెడ్డి,శ్రీరాములు,శ్రీనివాస్,గోవిందు,భరత్ సింహారెడ్డి,లక్ష్మారెడ్డి,అబ్రహం,నాగరాజు,గొనుపాడురాము,రజినిబాబు,శ్రీనివాసులు,వెంకటేష్,నరసింహులు,రవి,వీరేష్,ఉమ్మడి మహబూబ్ నగర్ మరియు గద్వాల నియోజకవర్గ బిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Also Read: KTR: కేసీఆర్‌ను మళ్లీ సీఎం చేయాలి.. నాగర్‌కర్నూల్‌లో కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు

