Kothagudem district (Image credit: swetcha reporter)
నార్త్ తెలంగాణ

Kothagudem district: కెమికల్ వ్యర్థాల వల్ల పశువుల మృత్యువు.. బాధ్యత వహించేది ఎవరు?

Kothagudem district: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అన్నపురెడ్డిపల్లి మండలం రాజాపురం (Rajapuram) గ్రామంలోని పెద్దమ్మ చెరువు ప్రస్తుతం ఒక డంప్‌యార్డ్‌లా మారిపోయింది. పరిసర గ్రామాల నుంచి వచ్చే చెత్త, వ్యర్థాలు చెరువులోకి పడేయడంతో, చెరువు పూర్తిగా కలుషితమైపోయింది. గతంలో ఈ చెరువు ఆధారంగా రెండు పంటల సాగు జరిగేది. కానీ ఇప్పుడు ఆ భూములు బీడు ప్రదేశాలుగా మారిపోయాయి. రైతులు వ్యవసాయాన్ని వదిలేసి పాడి పరిశ్రమపై ఆధారపడుతున్నారు. అయినా కూడా ఇబ్బందులు తప్పడం లేదు.

పశువుల మృత్యువు – రైతుల దుస్థితి
ఈ చెరువు ఆధారంగా సుమారు 100 కుటుంబాలు పాడి పరిశ్రమను నమ్ముకుని జీవిస్తున్నాయి. చెరువులోని కలుషిత నీరు తాగిన గేదెలు, ఆవులు అస్వస్థతకు గురవుతున్నాయి. పలువురు రైతులు (Farmers) తమ కళ్ల ముందే వేల రూపాయల ఖర్చుతో కొనుగోలు చేసిన పశువులు చనిపోతుంటే తట్టుకోలేక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్లాస్టిక్, కెమికల్ వ్యర్థాల వల్లే ఇవి చనిపోతున్నాయని వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: Farmers Protest: రోడ్డెక్కిన రైతన్నలు.. సీడ్ కంపెనీల తీరుపై తీవ్ర ఆగ్రహం..

చనిపోయిన పశువులకు పోస్టుమార్టం నివేదికలు సమర్పించినప్పటికీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత శాఖలు ఇప్పటికైనా స్పందించి, చెరువులోకి వ్యర్థాలు వదులుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, చెరువును శుద్ధి చేసి (Farmers) రైతులను, పశువులను కాపాడాలని డిమాండ్ చేస్తున్నారు.

ఆ నీటి వల్లే గేదెలు చనిపోతున్నాయి

పాడి రైతులు వారి గోడు వెళ్ళపించుకుంటున్నారు. “మేము మా పొలం వదిలి, కనీసం పశువులను పెంచుకుందామని ఆశ పెట్టుకున్నాం. కానీ ఇప్పుడు ఆ నీటి వల్లే గేదెలు చనిపోతున్నాయి. ఒక గేదె కనీసం 70 వేల నుంచి లక్ష రూపాయలు పెట్టి కొన్న పశువులు, కళ్ల ముందు చచ్చిపోతున్నాయి.మేము పోస్టుమార్టం చేయించి నివేదికలు ఇచ్చాం. చెరువు నీటిలో హానికరమైన రసాయనాలు ఉన్నట్టు తేలింది. అయినా అధికారులు ఏం చర్యలు తీసుకోవడం లేదు. ఎవరు వ్యర్థాలు వదులుతున్నారో తెలిసి తెలిసి కూడా వారిని ఏమి అనడం లేదు. చెరువు నీరు తాగిన తర్వాత పశువులకు జ్వరాలు, విరేచనలు, గర్భస్రావాలు, నిలదొక్కుకోలేక పడి చనిపోవడం రోజువారీ దృశ్యాలుగా మారాయి.

ఈ సమస్యపై మే నెల నుంచే పాడి రైతులు పలు మార్లు గ్రామ పంచాయతీ, మున్సిపల్ అధికారులు, వ్యవసాయ శాఖకు ఫిర్యాదు చేశారు. కానీ ఫలితం శూన్యం. “ఒకవేళ మనుషులే ఈ నీరు తాగితే ఏం జరిగేదో ఊహించుకోవచ్చు. పశువులు మాట్లాడలేవు, అందుకే తేలికగా పట్టించుకోవడం లేదు” అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పట్టించుకోకపోతే పరిస్థితి మరింత భయంకరంగా మారే ప్రమాదం ఉంది. ఇప్పటికే ఆర్థికంగా నష్టపోయిన పాడిరైతులు పశువులను అమ్మేస్తున్నారు. “ఇంకా ఇలా కొనసాగితే, గ్రామం మొత్తంగా పాడి రంగం నుంచి వెనక్కి తగ్గిపోవాల్సిందే” అనే భయం వారిలో పెరుగుతోంది.

* రైతుల డిమాండ్ – తక్షణ స్పందన కావాలి:
• చెరువులోకి వ్యర్థాలు వదులుతున్న వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలి
* చెరువును శుద్ధి చేసి, నిరంతర పర్యవేక్షణ ఏర్పాటు చేయాలి
* మృతిచెందిన పశువులకు నష్టపరిహారం ఇవ్వాలి
* పాడిరంగం కోసం శుభ్రమైన నీటి వనరుల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి
రాజాపురం చెరువు.. ఒక సముద్రం లాంటి విశ్వాసం నుంచి, ఒక ముప్పు లాంటి శాపంగా మారింది. ఇప్పటికైనా అధికారులు స్పందించకపోతే, ఈ గ్రామం విపత్తులో మునిగిపోవడం తప్పదు. రైతుల కన్నీళ్లను, వారి ఆవేదనను గుర్తించాలని అధికార యంత్రాంగాన్ని రైతులు (Farmers) కోరుతున్నారు

Also Read: Khammam District Farmers: వినూత్న రీతిలో మామిడి పిక్కల నుండి మొక్క తయారీ.. ఎక్కడంటే!

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు