Komatireddy on KTR: గత బీఆర్ఎస్ ప్రభుత్వ పదేళ్ల అవినీతిపై కమిషన్లతో విచారణ జరిపిస్తున్నామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి((Komatireddy Venkat Reddy) తెలిపారు. సచివాలయంలో మీడియాతో చిట్ చాట్ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమ ప్రభుత్వంపై కేటీఆర్(KTR) చేస్తున్న విమర్శలను తిప్పికొట్టారు. “20 నెలల కాంగ్రెస్(Congress) పాలనలో పేర్లు రాసుకుంటున్నామని కేటీఆర్(Ktr) అంటున్నారు. పదేళ్లలో మా కార్యకర్తలు పడిన ఇబ్బందులను రాసుకోవాలంటే ఎన్నో డైరీలు సరిపోవు,” అని అన్నారు.
ప్రాజెక్టుల పురోగతిపై దృష్టి
తనకు తన శాఖ తప్ప వేరే పని లేదని, అందుకే పనులు వేగంగా జరుగుతున్నాయని మంత్రి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పలు కీలక ప్రాజెక్టుల పురోగతిని వివరించారు. వచ్చే వారంలో హామ్ రోడ్లకు టెండర్లు పిలవనున్నట్లు తెలిపారు. మూడేళ్లలో ఈ రోడ్లను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. ఉప్పల్-నారపల్లి ఎక్స్‌ప్రెస్‌వే రోడ్డు పనులు వచ్చే దసరా నాటికి పూర్తవుతాయని వెల్లడించారు. సనత్ నగర్ టిమ్స్ ఆస్పత్రి అక్టోబర్‌లో ప్రారంభమవుతుందని, వర్క్ చివరి దశకు చేరుకుందని చెప్పారు. రీజనల్ రింగ్ రోడ్డుపై ఈ నెలాఖరు వరకు స్పష్టత వస్తుందని, కేంద్ర క్యాబినెట్ ఆమోదం లభిస్తుందని గడ్కరీ హామీ ఇచ్చారని తెలిపారు.
టాస్క్‌ఫోర్స్ కమిటీ..
కాంగ్రెస్ ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవస్థ లేదని కోమటిరెడ్డి స్పష్టం చేశారు. సినీ కార్మికుల సమస్యలపై సమావేశం ఉందని, దీని తర్వాత ఒక పరిష్కారం లభిస్తుందని తెలిపారు. ఉమ్మడి నల్లగొండ అభివృద్ధి తన లక్ష్యమని చెప్పారు. అలాగే, జాతీయ రహదారుల పనుల పురోగతిపై ఒక టాస్క్‌ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. దీనికి తానే చైర్మన్‌గా వ్యవహరిస్తానని, రోడ్ల నిర్మాణానికి అటవీ, విద్యుత్ అనుమతుల సమస్యలను ఈ కమిటీ పరిష్కరిస్తుందని తెలిపారు.
Also Read: DGP Jitender: డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపండి.. సమీక్షా సమావేశంలో డీజీపీ జితేందర్