Warangal District: ఎస్.జి.ఎఫ్.టి. జాతీయస్థాయి వాలీబాల్ పోటీకు సంగీత అనే విద్యార్ధి ఎంపిక అయిది. 19 సంవత్సరాల విభాగంలో జాతీయ స్థాయికి కమలాపూర్ విద్యార్థిని ఎంపిక కావడంతో అక్కడి స్ధానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కళాశాల ఉపాధ్యాయులు మరియు తల్లితండ్రులు ఆనందం వ్యక్తం చేశారు.
ఇక వివరాల్లోకి వెలితే..
69వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(School Games Federation of India) (ఎస్.జి.ఎఫ్.టి.) పోటీలలో కమలాపూర్ టీజీ మోడల్ స్కూల్(Kamalapur TG Model School) లో సీఈసీ(CEC) సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని మౌటం సంగీత(Sageetha) అండర్ 19 విభాగం వాలీబాల్(Volleyball) క్రీడల్లో రాష్ట్రస్థాయి పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచి జాతీయస్థాయిలో మధ్యప్రదేశ్(Madhya Pradesh) లోని ఆదర్శ గద్వాల్ నర్సింగాపూర్ లో నవంబర్ 13 నుండి 17 తేదీల్లో జరిగే పోటీల్లో పాల్గొనే రాష్ట్ర జట్టుకు ఎంపిక అయ్యింది. రాష్ట్రస్థాయి పోటీలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన సంగీత ను ప్రముఖులు అభినందించారు. జాతీయస్థాయిలో కూడా మంచి ప్రతిభను ప్రదర్శించి కళాశాలకు, గ్రామానికి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జి.అనిత(G Anitha), ఉపాధ్యాయ బృందం, పిడి రాజు, తల్లిదండ్రులు ఆషా భావం వ్యక్తం చేశారు.
