Jagtial district (imagecredit:swetcha)
నార్త్ తెలంగాణ

Jagtial district: జగిత్యాల్లో దారుణం.. నేలపై పడుకొని ఓ వికలాంగుడు నిరసన

Jagtial district: తిరిగి తిరిగి విసుగు వచ్చింది. కార్యాలయాల చుట్టూ, అధికారుల చుట్టూ ఏండ్ల తరబడి దరఖాస్తులు ఇచ్చి విసుగు వచ్చిన ఓ వికలాంగుడు(Disabled Person) వినూత్న పోరాటం మొదలు పెట్టాడు. ప్రజావాణిలో దరఖాస్తు ఇచ్చేందుకు వచ్చి ఏకంగా కలెక్టర్ కార్యాలయం ముందు పడుకుని తన ఆవేదనను వినూత్న రీతిలో వ్యక్తం చేశాడు. జగిత్యాల జిల్లా(Jagtial District) మల్లాపూర్ మండలం ముత్యంపేట(Mutyampet) గ్రామానికి చెందిన మర్రిపెల్లి రాజు(Raju) గంగారం అనే వికలాంగుడు తన ఇంటికి(Home) దారి ఇవ్వడం లేదని ఈ విషయంపై గత 8 సంవత్సరాలుగా పోరాడుతున్నాను.

అధికారులు కనికరం చూపడం లేదు
ఇంత తిరుగుతున్న ఆర్డీవో(RDO) ఎమ్మార్వో(MRO), ఎంపీడీవో(MPDO) ఎవరు తన గోడు పట్టించుకోలేదు. ఎనమిది ఏండ్ల నుంచి తిరుగుతున్నానని బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. 15 సంవత్సరాల క్రితం నల్ల కోసం ఫీజు చెల్లించిన బాట లేదని నల్ల ఇవ్వడం లేదని బాధితుడు పేర్కొన్నాడు. ఇంటికి బాట లేక, నల్ల లేక తీవ్ర ఇబ్బంది పడుతున్న అధికారులు కనికరం చూపడం లేదని అసహనం వ్యక్తం చేస్తూ సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో దరఖాస్తు ఇచ్చేందుకు వచ్చిన జగిత్యాల జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ముందు పడుకుని నిరసన తెలిపాడు.

Also Read: Gadwal District: గురుకుల విద్యార్థుల అవస్థలు.. పట్టించుకోని అధికారులు

కాంగ్రెస్ నాయకుడు జీవన్ రెడ్డి
తనకు న్యాయం జరిగే వరకు ఇక్కడి నుంచి లేచేది లేదని హెచ్చరించాడు. మాజీ, ఎమ్మెల్సీ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు జీవన్ రెడ్డి(Jeevan Reddy), పోలీసులు నచ్చజెప్పేందుకు ప్రయత్నం చేసిన బాధితుడు వినలేదు. చివరకు పోలీసులు అధికారుల వద్దకు తీసుకెళ్లారు. న్యాయం చేస్తానని హామి ఇవ్వటంతో ఆందోళన విరమించాడు.

Also Read; KCR Meetings: భవిష్యత్తు కనపడుతోందా.. బీఆర్ఎస్‌లో టెన్షన్ టెన్షన్

Just In

01

Viral Fevers: కేజిబీవీలలో విజృంభిస్తున్న విష జ్వరాలు.. ఆలస్యంగా వెలుగులోకి?

KCR KTR Harish Meet: ఎర్రవెల్లిలో కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు సుధీర్ఘ చర్చలు.. నెక్స్ట్ స్టెప్ ఏంటి?

Ganesh Immersion 2025: పాతబస్తీ గణనాధులపై స్పెషల్ ఫోకస్.. మంత్రి పొన్నం, డీజీపీ, మేయర్ విజయలక్ష్మి ఏరియల్ సర్వే

Kishkindhapuri: మొదట్లో వచ్చే ముఖేష్ యాడ్ లేకుండానే బెల్లంకొండ బాబు సినిమా.. మ్యాటర్ ఏంటంటే?

Asia Cup Prediction: ఆసియా కప్‌లో టీమిండియాతో ఫైనల్ ఆడేది ఆ జట్టే!.. ఆశిష్ నెహ్రా అంచనా ఇదే