Konda Surekha (IMAGE credit: swetcha reporter)
నార్త్ తెలంగాణ

Konda Surekha: విడ‌త‌ల‌వారీగా అర్హులంద‌రికీ ఇండ్లు ఇస్తాం.. మంత్రి కొండా సురేఖ హామీ

Konda Surekha: ప్రతి పేద ఇంటికి ఇందిర‌మ్మ ఇళ్లు ఇస్తామ‌ని విడ‌త‌ల‌వారీగా అర్హులంద‌రికీ ఇండ్లు ఇస్తామ‌ని రాష్ట్ర మంత్రి కొండా సురేఖ (Konda Surekha) హామీనిచ్చారు. వ‌రంగ‌ల్ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న మంత్రి సురేఖ వ‌రంగల్ ఈస్ట్ ల‌బ్ధిదారుల‌కు ఇందిర‌మ్మ ఇల్లు (Indiramma’s house) సాంక్ష‌న్ ప‌త్రాలు అంద‌జేశారు. అనంత‌రం ఆమె మాట్లాడుతూ ఇందిరమ్మ ఇంటి నిర్మాణం పూర్తి చేసుకున్న లబ్ధిదారుడికి ఐదు లక్షలు రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తుందని వివ‌రించారు. గత ఎన్నికలకు ముందు ప్రజా ప్రభుత్వం ఇచ్చిన హామీలతో పాటు నూతన హామీలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. పేదవారి ఆశయాన్ని నెరవేర్చడం కోసం రాష్ట్రం ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను చేప‌డుతుంద‌న్నారు.

 Also Read: Bellamkonda Srinivas: సినిమా మొదలైన పది నిమిషాల తర్వాత అలా జరగదు.. ఎందుకంటే?

నిరుపేద అర్హులకు ఇందిరమ్మ ఇల్లు

ఎన్నికల ముందు నియోజకవర్గ అభివృద్ధి కోసం ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా నెరవేరుస్తామని మంత్రి సురేఖ (Konda Surekha) తెలిపారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో అత్యంత నిరుపేద అర్హులకు ఇందిరమ్మ ఇల్లు మంజూరయ్యేలా ప్రభుత్వం పారదర్శకంగా పోర్టల్ ద్వారా మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. మంజూరి పత్రాలు స్వీకరించిన లబ్ధిదారులు త్వరగా ఇళ్ళను నిర్మించుకోవాలని కోరారు. తెలంగాణ ప్రజా ప్రభుత్వంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ. 500 రూపాయలకే సబ్సిడీపై గ్యాస్ సిలిండర్, 200 యూనిట్స్ వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామన్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో పేదల సమస్యలు మానవత దృక్పథంతో అధికారులు పరిశీలించి త్వరితంగా పరిష్కరించాలన్నారు.

మహిళల కోసం అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు

నిరుపేదలు గుడిసెలలో, అద్దెకు ఉంటూ సుదీర్ఘ కాలంగా ఇండ్ల నిర్మాణాలకు వేచి చూస్తున్నారన్నారు. అటువంటి పేద‌ వారి కలలను రాష్ట్ర ప్రభుత్వం నిజం చేస్తున్నదని అన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన మాటకు కట్టుబడి మహిళల కోసం అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు తీసుకువచ్చారని చెప్పారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరు కార్యక్రమం నిరంతరమని, ఇల్లు రాని నిరుపేదలు నిరుత్సాహపడవలసిన అవసరం లేదని, అర్హులైన ప్రతినిరుపేదకు తప్పనిసరిగా ఇల్లు మంజూరు చేస్తామన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) సారధ్యంలో అభివృద్ధి, సంక్షేమం జోడొద్దుల్లా ముందుకు తీసుకెళుతున్నారని మంత్రి సురేఖ తెలిపారు.

 Also Read: Mirai Train Stunt: ‘మిరాయ్’ కోసం ప్రాణాలను సైతం లెక్క చేయని హీరో.. ఏం చేశాడో తెలుసా?

Just In

01

Harish Rao: ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే యూరియా సంక్షోభం.. హరీష్ రావు సంచలన కామెంట్స్

GHMC: 60 ఇందిరమ్మ టిఫిన్ స్టాళ్లకు బల్దియా సిద్దం.. ఎప్పుడు ప్రారంభమంటే?

GHMC Commissioner: పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.. అధికారులకు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆదేశం

Hydra: కూకట్ పల్లిలో రూ. వంద కోట్ల విలువైన ప్రభుత్వ భూమి స్వాధీనం

Daggubati Brothers: విచారణకు హాజరుకాని దగ్గుబాటి బ్రదర్స్.. కోర్టు సీరియస్​