Hanumakonda District: హనుమకొండ జిల్లా క్రీడలు, యువజన శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న వేసవి క్రీడ శిక్షణ శిబిరాలు విజయవంతం చేసేందుకు విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మే ఒకటి నుంచి 31 వరకు జవహర్లాల్ నెహ్రూ స్టేడియం ప్రధాన వేదికగా దాదాపు 23 క్రీడాంశాల్లో శిక్షణ ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమంలో వరంగల్, హనుమకొండ, కాజీపేట త్రినగిరిలోని విద్యార్థులు, యువత ఎక్కువ సంఖ్యలో భాగస్వాములు అయ్యేందుకు జిల్లా క్రీడా శాఖ గతానికి భిన్నంగా విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది.
ఈ నెల 9 నుండి 25వ తేదీ వరకు 4వ తరగతి నుండి ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఈ శిక్షణ కార్యక్రమంలో పాల్గొనేందుకు అర్హులు. అందుకోసం జిల్లా క్రీడలు యువజన అధికారి గుగులోతు అశోక్ కుమార్ నేతృత్వంలో జిల్లా క్రీడా శాఖ కోచ్ లు నగరంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు కళాశాలలను బుధవారం సందర్శించారు.
జిల్లా క్రీడా శాఖ ఆధ్వర్యంలో చేపట్టబోయే క్రీడా శిక్షణ కార్యక్రమాలకి సంబంధించిన సమాచారాన్ని సంబంధిత పాఠశాలలు కళాశాలల యాజమాన్యాలకు వివరిస్తూ విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొనేందుకు కరపత్రాలతో పాటు రిజిస్ట్రేషన్ ఫారాలను అందించారు. విద్యార్థులకు నచ్చిన క్రీడాంశాలకు సంబంధించిన సమాచారం అందిస్తూ వారి సందేహాలను నివృత్తి చేశారు.
విశేష స్పందన లభిస్తుంది
క్రీడా శిక్షణ శిభిరం విద్యార్థులకు ఉపయోగపడి క్రీడలు అభివృద్ధి చెందాలనే సంకల్పంతో క్రీడా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే శిభిరానికి విద్యార్థుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. క్రీడా శాఖలోని ప్రతి కోచ్ కు పది పాఠశాలలు, కళాశాలలు సందర్శించడం లక్ష్యంగా నిర్దేశించి ప్రచారం నిరాహహిస్తున్నాం.
Also read: Airports Authority of India: డిగ్రీ అర్హతతో ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు!
కోచ్ లచే అవగాహన కార్యక్రమం మరో వారం రోజులపాటు నిర్వహిస్తాం. ప్రధాన కూడళ్లలో శిక్షణ కార్యక్రమాలకు సంబంధించిన సంపూర్ణ సమాచారంతో కూడిన ఫ్లెక్సీలను ఏర్పాటు చేశాం. మునుపెన్నడూ లేని రీతిలో జిల్లా క్రీడా శాఖ ఆధ్వర్యంలో ఉచిత వేసవి క్రీడ శిక్షణ శిబిరాలకు అని వర్గాల నుండి విశేషణ స్పందన లభిస్తుందని చెప్పారు.