Jogulamba Gadwal District:( image CREDIT: SWETCHA REPORTER)
నార్త్ తెలంగాణ

Jogulamba Gadwal District: స్థానిక ఆశావహులపై చవితి ఎఫెక్ట్.. తేలని రిజర్వేషన్లపైనే అయోమయం!

Jogulamba Gadwal District: జోగులాంబ గద్వాల జిల్లాలో రానున్న స్థానిక ఎన్నికల వేళ వినాయక చవితి వేడుకలు రావడం పోటీ చేయనున్న ఆశావహులలో వినాయక చవితి చందా గుబులు లేపుతోంది. 42 శాతం రిజర్వేషన్(Reservation) ప్రక్రియ కొలిక్కి రాకపోవడం, ప్రభుత్వం స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ పై స్పష్టత ఇవ్వకపోవడంతో స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీకి ఉత్సాహం చూపుతున్న ఆశావహులలో పెట్టుబడిపై బెంగ పట్టుకుంది. గ్రామస్థాయిలో సర్పంచ్ ఎంపీటీసీ స్థానాలలో తక్కువ ఖర్చు రానుండగా మండల స్థాయిలో జడ్పిటిసి,(ZPTC) ఎంపీపీ(Mpp) స్థానాలపై దృష్టి సారిస్తున్న వారికి వినాయక చవితి(Ganesh Chavithi) వేడుకలకు అన్ని వర్గాల వారికి గ్రామాల్లో వార్డులలో ఏర్పాటు చేసే వినాయకుల కొనుగోలు కోసం నిర్వాహకులకు చందాలు ఇచ్చేందుకు ఆశావాహులు భవిష్యత్తుపై స్పష్టత రాకపోవడంతో తమకు తోచిన చందా రాస్తూ నిర్వాహకులను సంతృప్తి పరుస్తున్నారు. దీంతో మరింత వ్యయం చేయాల్సి వస్తోంది.

 Also Read: Jogulamba Gadwal district: గద్వాల జిల్లాలో అధ్వానంగా మారిన రోడ్లు.. పట్టించుకోని ప్రజాప్రతినిధులు అధికారులు

మండలాల్లో ప్రజా ప్రతినిధులుగా వ్యవహరించిన నాయకులు మళ్లీ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో నూ పోటీ చేసి ఆ పదవిని తిరిగి పొందాలనే ఉత్సుకతతో ఉన్నారు అయితే ప్రస్తుతం వినాయక చవితి(Ganesh Chavithi) సమీపంలో ఉండడంతో చందాల బెంగ పట్టుకుంది. తన పదవికి సం బంధించి మూడు నాలుగు గ్రామాలతో సంబంధం ఉండడంతో ఇప్పుడు ఆ గ్రామ ప్రజల ఓట్లను ఆకర్షించాలంటే ఈ ఖర్చుకు వెనకాడే పరిస్థితి లేకపోవడం.. గతంలో పదవిలో ఉన్నప్పుడు లక్షల్లో చందాల రూపంలో ఇచ్చేవారు. ఇప్పుడు ఎన్నికలు సమీపంలో ఉండడంతో ఇటు యువజన సంఘాలు,అటు వార్డుల్లో వినాయక మండపాలు ఏర్పాటు చేసే నిర్వాహకులను ఆకట్టుకోవాలంటే వినాయక విగ్రహాల కోసం భారీగా చందాలు ఇవ్వాల్సిందే. అయితే వీరికి ఓ సందేహం వెంటాడుతుంది. ఒకవేళ ఆ పదవికి సంబంధించి రిజర్వేషన్(Reservation) తమకు అనుకూలంగా రాకపోతే ఎలా.. ఇప్పుడు ఈ ఖర్చంతా వృథా గా పోతుందనే భావన వారిలో మెదులుతోంది.

లెక్కలేస్తున్న ఆశావహులు..

స్థానిక సంస్థల్లో పోటీ చేయాలని గ్రామాలు, మండలాలు, పట్టణాల్లోని వార్డుల్లో పలువురు ఆశావహులు ఉత్సాహంతో ఉన్నారు. సర్పంచ్, ఎంపీటీసీ,(MPTC)  జడ్పీటీసీ,(ZPTC) పట్టణంలోని వార్డుల్లో కౌన్సిలర్.. ఇలా గతంలో ఈ పదవిలో ఉన్నవారు. ఇప్పుడు అనేక కొత్త నాయకులు పోటీ చేసి ఎలాగైనా గెలవాలనే ఆశతో ఉన్నారు. ఎన్నికలు వస్తే ఖర్చు కోసం డబ్బులు ఎలా సర్దుబాటు చేయాలి.. ఎంత ఖర్చవుతుంది.. అనే లెక్కల్లో ఇప్పటినుంచే ఉన్నారు. అయితే ఈ ఎన్నికల కంటే ముందు వారికి ఇప్పుడు కొత్త చిక్కు వచ్చిపడింది. రానున్న రోజులలో వినాయక చవితి ఉంది. ఆ పండగ నేపథ్యంలో ఇటు గ్రా మాలు, అటు పట్టణంలో అన్ని వార్డుల్లో కనీసంగా ఓ పది వరకు మండపాలు ఏర్పాటయ్యే పరిస్థితి ఉంది. దీంతో గద్వాల(Gadwala) ఐజ వడ్డేపల్లి అలంపూర్ మున్సిపాలిటీలలో ప్రజాప్రతినిధులు కావాలని వస్తాను ఉన్నవారికి ఆదిలోనే ఓటర్లను మంచిగా చేసుకునేందుకు వార్డులలో అధిక సంఖ్యలో పెట్టే వినాయక మండపాలకు చందాలను విరివిగా ఇవ్వాల్సి వస్తోంది. యువజన సంఘాలు, వార్డు ప్రజలు ఏర్పాటు చేస్తుంటారు. వారు ముఖ్యంగా రాజకీయాలతో సంబంధం ఉన్న నాయకుల వద్ద చందాలు అధిక మొత్తంలో కలెక్ట్ చేస్తున్నారు. ఇది ఆశావహుల్లో గుబులు రేపుతోంది.

రిజర్వేషన్లు ఎలా ఉంటాయో..

స్థానిక ఎన్నికల్లో పోటీ చేయాలని పలువురు నాయకులు ప్రణాళికలు చేసుకుంటున్నారు. దానికంటే ముందు రిజర్వేషన్ ఎలా ఉంటుం దనేది వారిని వెంటాడుతుంది. ఒకవేళ రిజర్వేషన్లపై క్లారిటీ వచ్చి ఉంటే ఆ సామాజికవర్గం నాయకులు పోటీలో ఉండేదానిపై స్పష్టత వచ్చేది. ఇప్పుడు ఎలాంటి క్లారిటీ లేదు. అలాగని జనాలకు అనువుగా లేకపోతే చులకనయ్యే పరిస్థితి. ఈ మీమాంసలో ప్రస్తుతం పలువురు నాయకులు కొట్టుమిట్టాడుతున్నారు. ఇప్పుడు ఖర్చు చేసుకున్న తర్వాత రిజర్వేషన్లు అనుకూలంగా రాకపోతే పెట్టిన వ్యయం బూడిదలో పోసిన పన్నీరులా మారనుంది. దీంతో ‘ఇదే మి పరిస్థితిరా నాయనా’ అని తలలు పట్టుకుంటున్నారు. రిజర్వేషన్ల అంశం ఆలస్యమవుతుండటం పలువురు నాయకులు, నేతలకు మింగుడుపడని వ్యవహారంలా మారింది.

 Also Read: Gadwal: నూతన రేషన్ కార్డులతో నెరవేరిన పేదల కల

Just In

01

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్

KTR: రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు