Sardar Sarvai Papanna Goud (imagecredit:swetcha)
నార్త్ తెలంగాణ

Sardar Sarvai Papanna Goud: బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి సర్వాయి పాపన్న:  కలెక్టర్ సంతోష్

Sardar Sarvai Papanna Goud: బడుగు బలహీనుల హక్కుల కోసం అహర్నిశలు పోరాడిన మహావీరుడు సర్దార్ సర్వాయి పాపన్న అని జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్ అన్నారు. ఐడిఓసిలో ఆవరణంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సర్దార్ సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా గద్వాల్ శాసన సభ్యులు బండ్ల కృష్ణ మోహన్(Mandla Krishna Mohan) తో కలిసి ఆయన చిత్రపటానికి పుష్పమాలలు సమర్పించి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సాహస వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న మొగలులను, గోల్కొండ నవాబులను ఎదిరించి తెలంగాణ కీర్తి పతాకాన్ని ఎగరవేసిన గొప్పవీరుడని అన్నారు. సర్దార్ పాపన్న గౌడ్ కేవలం ఒక వీరయోధుడే కాకుండా, సామాజిక న్యాయం కోసం అహర్నిశలు పోరాడిన సమాజ సంస్కర్త అని అన్నారు. సర్వాయి పాపన్న జయంతిని ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అధికారికంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.పేదల కోసం ఆయన చేసిన త్యాగం,అన్యాయ దోపిడీ వ్యవస్థకు వ్యతిరేకంగా నడిపిన ఉద్యమం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని తెలిపారు.

Also Read: Dating With AI: 5 నెలలుగా ఏఐతో డేటింగ్.. నిశ్చితార్థం కూడా జరిగింది.. యువతి షాకింగ్ ప్రకటన!

ప్రజల హృదయాలలో

గద్వాల్ శాసన సభ్యులు మాట్లాడుతూ మొగల్ సామ్రాజ్యం మరియు నిజాం దోపిడీ పాలనకు వ్యతిరేకంగా అచంచల ధైర్యసాహసాలతో పోరాడిన మహావీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్(Sardar Sarvai Papanna Goud) అని అన్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం తన జీవితాన్ని అర్పించి ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచారని కొనియాడారు. సమానత్వం, ఆత్మగౌరవం, న్యాయం కోసం ఆయన శాశ్వత ప్రతీకగా నిలిచారని పేర్కొన్నారు. ఆయన జయంతి సందర్భంగా ఆయన త్యాగస్ఫూర్తిని స్మరించుకోవడం ప్రతి తరానికి గర్వకారణమని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు లక్ష్మీ నారాయణ, నర్సింగ రావు, బీసీ సంక్షేమ శాఖ అధికారి నిశిత, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, సంఘం నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో

బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలలో మాజీ జడ్పీ చైర్ పర్సన్ సరిత ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అధిక సంఖ్యలో హాజరై ఈ పాపన్న విగ్రహానికి పూలమాలలు వేసి అర్పించారు. అదేవిధంగా బి ఆర్ ఎస్ జిల్లా నాయకుడు బాసు హనుమంతు నాయుడు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో హాజరై సర్దార్ వారి విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అదేవిధంగా గౌడ్ సంఘం నాయకులు వెంకటేశ్వర్ గౌడ్,మల్లికార్జున్ గౌడ్, సుదర్శన్ గౌడ్ తదితరులు సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు.

Also Read: Addanki Dayakar: భవిష్యత్తులో ఇది మళ్లీ పునరావృతం కావొద్దు: అద్దంకి దయాకర్

Just In

01

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ