Mynampally Hanumanth Rao ( image credit: swetcha reporter)
Politics, నార్త్ తెలంగాణ

Mynampally Hanumanth Rao: ప్రజలను మభ్య పెట్టేందుకే బాకీ కార్డులు.. మైనంపల్లి హనుమంతరావు కీలక వ్యాఖ్యలు

Mynampally Hanumanth Rao: మెదక్ జిల్లా నిజాంపేట మండల పరిధిలోని రాంపూర్ గ్రామంలో లీలా గ్రూప్ చైర్మన్ మీనాక్షి డాక్టర్ మోహన్ నాయక్,ల ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు హాజరై రోగులకు ఉచిత మందులను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలానికి ఈశాన్యం మూల అయినటువంటి రాంపూర్ గ్రామంలో డాక్టర్ మోహన్ నాయక్ ఉచిత ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ప్రతి గ్రామంలో ఉచిత క్యాంపులు ఏర్పాటు చేస్తామని ఈ గ్రామం నుండి పనులు ప్రారంభించినట్టయితే శుభం కలుగుతుందన్నారు.

Also Read:Kaleshwaram Report: కాళేశ్వరంపై న్యాయపోరాటానికి సన్నాహాలు

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేరుస్తాం

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అవుతుందని ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని గత పది సంవత్సరాల కాలంలో నిజాంపేట్ నుండి రహదారిని గత పాలకులు పట్టించుకోలేదని అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన మాట ప్రకారం రహదారిని పునర్ నిర్మించామని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. అలాగే రాబోయే మూడు సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేరుస్తామన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఒక్క గ్రామంలో కూడా సిసి రోడ్డులు వేయించిన దాఖలాలు లేవని బిఆర్ఎస్ ను విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట కట్టుబడి ఉంటూ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేస్తామని తెలిపారు. కాంగ్రెస్ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను పూర్వలేకనే కాంగ్రెస్ ప్రభుత్వంపై బిఆర్ ఎస్ పార్టీ నాయకులు విమర్శలు చేస్తున్నారని అలాగే ప్రజలను మభ్య పెట్టేందుకే బాకీ కార్డుల నాటకానికి తెరదీశారని ఆయన మండిపడ్డారు.

రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీకే దక్కింది

దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ఇచ్చిన మాట మీద నిలబడలేదని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. 10 సంవత్సరాల కాలంలో అందిన కాడికి దోచుకుని రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీకే దక్కిందన్నారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన ప్రజల కోసం ఒక్కొక్క హామీని అమలు చేసుకుంటా ముందుకు పోతున్నామని మరొక్కసారి బీఆర్ఎస్ మోసాలకు ప్రజలు గురికావద్దని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, మాజీ ఎంపీపీ దేశెట్టి సిద్ధ రాములు, మండల అధ్యక్షుడు వెంకటేష్ గౌడ్,పట్టణ అధ్యక్షుడు కొమ్మట బాబు,పంజా మహేందర్,నసీరుద్దీన్, మారుతి, మాజీ సర్పంచ్లు కొమ్మట సత్యనారాయణ,ఆకుల బాలయ్య, బాజా రమేష్, మధుసూదన్ రెడ్డి,నాగరాజు,రాజు నాయక్, శ్రీనివాస్ నాయక్,మహేందర్ రెడ్డి, గరుగుల శ్రీనివాస్, అందే స్వామి,సూరా రాములు, తదితరులు పాల్గొన్నారు.

Also Read:TG Congress Ministers: వరుసగా వివాదాల్లో చిక్కుకుంటున్న మంత్రులు.. ఒకరిపై ఒకరు ఫిర్యాదులు

Just In

01

Ellamma movie: బలగం వేణు ‘ఎల్లమ్మ’ సినిమాకు సంగీత దర్శకుడు ఎవరంటే?

Liquor License: వైన్​ షాపుల లాటరీకి హైకోర్టు గ్రీన్ సిగ్నల్!

Telugu States Disasters 2025: ప్రకృతి గట్టిగానే హెచ్చరిస్తుందిగా.. లోకంలో పాపాలు ఆపకపోతే ఇలాంటి వినాశనాలు తప్పవా?

Aryan second single: విష్ణు విశాల్ ‘ఆర్యన్’ సెకండ్ సింగిల్ వచ్చేసింది.. చూసేయండి మరి..

AI photo controversy: దీపావళికి దీపికా పదుకోణె చూపించిన ‘దువా’ ఫోటో నిజం కాదా!.. మరి ఏంటంటే?