Crime News: తమ కూతురిని ప్రేమిస్తున్నాడన్న కోపంతో యువతి కుటుంబ సభ్యులు ఇంజనీరింగ్ విద్యార్థిని కడతేర్చారు. స్థానికంగా సంచలనం సృష్టించిన ఈ హత్య పటాన్ చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. కృష్ణా జిల్లా పెనుగంచి ప్రోలు గ్రామానికి చెందిన కాకాణి జ్యోతి శ్రవణ్ సాయి (19) మైసమ్మగూడలోని సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ రెండో సంవత్సరం విద్యార్థి. అమీన్ పూర్ లోని ఓ ప్రైవేట్ హాస్టల్లో ఉంటున్నాడు. తల్లిదండ్రులు చనిపోవటంతో శ్రవణ్ ను పెదనాన్న వెంకటేశ్వరరావు చదివిస్తున్నాడు.
యువతి తల్లి సిరితో వాగ్వాదం
ఇదిలా ఉండగా శ్రవణ్ తనతోపాటు 10వ తరగతి చదువుకున్న ఓ యువతితో ప్రేమలో పడ్డాడు. అదే విషయాన్ని యువతికి చెప్పగా ఆమె కూడా అంగీకరించింది. ఈ క్రమంలో ఇద్దరూ తరచూ కలుసుకునే వారు. విషయం తెలిసి యువతి తల్లిదండ్రులు తమ కూతురి జోలికి రావద్దంటూ శ్రవణ్ ను హెచ్చరించారు. అయితే, దీనిని శ్రవణ్ పట్టించుకోలేదు. ఈనెల సాయంత్రం సృజన లక్ష్మీనగర్ లోని యువతి ఇంటికి ఆమెను కలవటానికి వెళ్లాడు. ఆ సమయంలో యువతి తల్లి సిరితో వాగ్వాదం జరిగింది.
Also Read: Crime News: 150కి పైగా దొంగతనాలు చేసిన కరుడ గట్టిన దొంగ అరెస్ట్.. వాడి కన్నుపడితే ఇల్లు గుల్లే..!
యువతి చేతి ఎముక విరిగిపోగా శ్రవణ్ కు కూడా తీవ్ర గాయాలు
కోపంతో రెచ్చిపోయిన ఆమె క్రికెట్ బ్యాట్ తో శ్రవణ్ తోపాటు కూతురిపై దాడి చేసి విచక్షణారహితంగా కొట్టింది. దాంతో యువతి చేతి ఎముక విరిగిపోగా శ్రవణ్ కు కూడా తీవ్ర గాయాలయ్యాయి. మరుసటి రోజు తెల్లవారుఝామున పరిస్థితి విషమించటంతో యువతి కుటుంబ సభ్యులు శ్రవణ్ ను నిజాంపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుఝామున మరణించాడు. ఈ మేరకు పటాన్ చెరు పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: Crime News: 150కి పైగా దొంగతనాలు చేసిన కరుడ గట్టిన దొంగ అరెస్ట్.. వాడి కన్నుపడితే ఇల్లు గుల్లే..!
కామాటిపురాలో హత్య
వివాహేతర సంబంధం హత్యకు దారి తీసింది. ఈ సంఘటన కామాటిపురా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. నందిముస్లాయిగూడ నివాసి అరవింద్ భోస్లే (32) గతంలో దూద్ బౌలిలోని ఓ బియ్యం దుకాణంలో ఉద్యోగం చేశాడు. ఆ సమయంలో ఓ మహిళతో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. దాంతో మహిళ కుటుంబ సభ్యులు అరవింద్ పై కక్ష పెంచుకున్నారు. ఈ క్రమంలోనే బుధవారం అర్ధరాత్రి సమయంలో అరవింద్ బైక్ పై వెళుతుండగా దేవీబాగ్ వద్ద అడ్డగించి కత్తులతో విచక్షణారహితంగా పొడిచారు. దాంతో అరవింద్ అక్కడికక్కడే మరణించాడు. విషయం తెలియగానే కామాటిపురా సీఐ భాస్కర్ సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అరవింద్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ప్రాథమిక విచారణలో వివాహేతర సంబంధమే హత్యకు దారి తీసినట్టుగా తెలిసిందని పోలీసులు తెలిపారు.

