CI Rajesh (imaecredit:swetcha)
నార్త్ తెలంగాణ

CI Rajesh: పేరుకే రక్షక భటుడు.. లోపల మాత్రం అక్రమార్కుడు.. ఎవరంటే?

CI Rajesh: ఆయన పోలీస్ అధికారి… కానీ ఆ లక్షణాలు ఎక్కడ కనిపించవు.. నన్ను ఎవ్వరూ ఏమి చేయలేరనే నైజం తో ముందుకు సాగుతున్న డోర్నకల్ సీఐ(CI) కాలం అడ్డం తిరిగి ఏసీబీ(ACB) అధికారులకు అడ్డంగా పట్టుబడ్డారు. పోలీస్ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాలు సైతం పక్కకు పెట్టి తన ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించాడు. అదే ఆయనకు శాపంగా మారి ఏసీబీ అధికారులకు పట్టుబడేలా చేసింది. నిత్యం కిందిస్థాయి అధికారులను వేధిస్తూ తనదైన శైలిలో పోలీస్ స్టేషన్ మొత్తం నా సొంతమే అని రీతిలో వ్యవహరించడం అక్కడ విధులు నిర్వహించే అధికారులు సహించలేకపోయారు.

అక్రమార్కులకు అండదండలు అందిస్తూనే అనుకున్న డబ్బు ఇవ్వకపోతే వారిని వేధించి వెంటాడి వారి వద్ద నుంచి డబ్బులు భారీగా లాగడమే పనిగా పెట్టుకున్నాడు. కురవి మండలానికి చెందిన ఓ అక్రమ బెల్లం వ్యాపారి కి సీఐ(CI) కి మధ్య లావాదేవీలు కొనసాగుతున్నాయనేది ఎప్పటినుంచో ప్రచారంలో ఉంది. మా అక్రమ వ్యాపారికి పూర్తిస్థాయిలో అండదండలు అందిస్తూ నల్లబెల్లం(Black ginger) వ్యాపారం ద్వారా వచ్చే నగదు నీకింత నాకింత అనే చందంగా వ్యవహారాన్ని చెక్కబెడుతూ వస్తున్నాడు.

హలో నన్ను ఎవ్వరు..? ఏమి చేయలేరు..?

ఆ సీఐ స్టైలే వేరు పోలీస్(Police) శాఖ అంటే కనీస గౌరవం కూడా లేదు. సాదాసీదా కిందిస్థాయి ఉద్యోగిలాగా అందిన కాడికి అక్రమార్కుల కానించి వసూలు చేయడమే పనిగా పెట్టుకున్నాడు. అక్రమార్కులకు సపోర్టు చేసేందుకు ఓ కానిస్టేబుల్ ను సైతం అక్రమ వ్యాపారికి జతచేస్తూ… అక్రమార్కుడు చేసే నల్ల బెల్లం వ్యాపారానికి ఎస్కార్ట్ గా వ్యవహరించాలని సిఐ ఆదేశించినట్లుగా కూడా చర్చ సాగుతోంది. ఆ కానిస్టేబుల్ కేవలం అక్రమార్కులకు ఎస్కార్ట్ ఇవ్వడం… వారి వద్ద నుంచి డబ్బులు వసూలు చేసి సీఐ(CI) కి అప్పగించడమే విధులుగా నిర్వర్తిస్తూ వస్తున్నట్లుగా కూడా డోర్నకల్(Dornakal) లో చర్చ సాగుతోంది. ఆ కానిస్టేబుల్ ఇప్పటివరకు పోలీస్ ఖాకీ డ్రెస్ వేసుకున్న దాఖలాలు లేవు అనే చర్చ కూడా ఉంది.

సివిల్ డ్రెస్సులు వెళ్లడం.. ఎస్కార్ట్ నిర్వహించడం.. నల్ల బెల్లం డంపింగ్ అయిన తర్వాత అనుకున్న ప్రకారం అక్రమ నల్ల బెల్లం వ్యాపారి నుంచి డబ్బులు వసూలు చేసి ఆ అధికారికి ఇవ్వడమే పనిగా పెట్టుకున్నట్లుగా కూడా గుసగుసలు వినపడుతున్నాయి.

Also Read: Paradha movie review: ‘పరదా’ సినిమా ఎలా ఉందంటే..

డబ్బులు ఇస్తే ఓకే.. లేదంటే నరకమే

శనివారం ఏసీబీ(ACB) అధికారుల దాడిలో ఓ అక్రమ నల్ల బెల్లం వ్యాపారి నుంచి 30 వేలు తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన ఆ సీఐ తీరే వేరుగా ఉంటుందని డోర్నకల్ వాసులు చర్చించుకుంటున్నారు. ఎవరైతే నాకేంటి? నాకు డబ్బులు ఇస్తే ఓకే… లేదంటే నరకం చూపిస్తానంటూ చాలామంది అక్రమ వ్యాపారులను, పోలీస్ స్టేషన్(Police Station)కు వచ్చే ఫిర్యాదు దారులను సైతం బెదిరింపులకు గురి చేస్తుంటాడని డోర్నకల్ పోలీస్ స్టేషన్ పరిధి ప్రజలు చర్చించుకోవడం గమనార్హం. ఇలాంటి అక్రమాలకు అండదండలు అందించే డోర్నకల్ సీఐ రాజేష్(CI Rajesh) ను ఏసీబీ(ACB) అధికారులకు పట్టించేందుకు ఓ నల్ల బెల్లం వ్యాపారి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.

దీంతో ఏసీబీ అధికారులు దాదాపు 30 మంది మూడు రోజులుగా సీఐ రాజేష్ నడవడికపై దృష్టి సారించారు. ఫిర్యాదుదారు భూక్య సురేష్(Bukya Suresh) విజ్ఞప్తితో ఏసీబీ(ACB) అధికారులు సీఐ రాజేష్(CI Rajesh) సురేష్(Suresh) నుంచి డబ్బులు తీసుకుంటున్నాగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. గత 15 రోజులుగా ఏసీబీ(ACB) అధికారులు మహబూబాబాద్(Mahabubabad), ఖమ్మం(Khammam), ములుగు(Mulugu), కొత్తగూడెం(Kotha Gudem), సూర్యాపేట(Surayapet) పోలీసులపై ప్రత్యేక దృష్టి సారించారని విశ్వసనీయ సమాచారం. అక్రమాలకు పాల్పడుతున్న పోలీసుల ఆగడాలను అరికట్టేందుకే ఏసీబీ అధికారులు దూకుడుగా వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది. దీంతో అక్రమాలకు పాల్పడే పోలీసుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని చర్చ విస్తృతంగా సాగుతుంది.

Also Read: Jogulamba Gadwal: రైతులను వెంటాడుతున్న యూరియ కష్టాలు

Just In

01

Tummala Nageshwar Rao: రైతులకు గుడ్ న్యూస్.. ఇకపై రైతు వేదికల వద్ద యూరియా అమ్మకం

Coolie: ‘కూలీ’ మూవీ ‘చికిటు’ ఫుల్ వీడియో సాంగ్.. యూట్యూబ్‌లో రచ్చ రచ్చ!

JD Chakravarthy: ‘జాతస్య మరణం ధ్రువం’ టైటిల్ క్రెడిట్ నాదే..

Malkaajgiri Excise: డిఫెన్స్ మద్యం స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్

Chiranjeevi Team: ‘స్పిరిట్’, ‘ది ప్యారడైజ్‌’ చిత్రాలలో చిరు.. క్లారిటీ ఇచ్చిన టీమ్!