Dammapeta mandal: చినుకు పడితే చిత్తడిగా మారుతున్న గ్రామపంచాయతీలు ప్రజా ప్రతినిధులు లేకపోవడం వలన మమ్మల్ని అడిగే వారు ఎవరు అన్న విధంగా ఇష్టారాజ్యంగా తవ తీస్తున్నారని గ్రామపంచాయతీ పారిశుధాన్ని పట్టించుకోకుండా మాకెందుకులే అన్న ధోరణిలో జీతాలకే పరిమితి అయిన గ్రామపంచాయతీ అధికారులు.
గ్రామపంచాయతీ ప్రజల అవస్థలు
దమ్మపేట మండలం గ్రామ పంచాయతీలో ప్రజలు పడుతున్న ఇబ్బందులు ప్రస్తుతం వర్షాకాలం కావడంతో మరి అద్వానంగా మారిందని వర్షపు నీరు నిలవడం వలన ఎక్కడ పడితే అక్కడ మురుగు వాసన దానితోపాటు విపరీతమైన దోమలతో బాధపడుతున్నాము అంటున్న గ్రామపంచాయతీ ప్రజలు డ్రైనేజీలు సిసి రోడ్లు(CC Roads) గ్రామపంచాయతీలలో పంచాయతీ రాజు అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదు ఆర్లపేట గ్రామపంచాయతీలో బొల్లి గట్టు కోడిసగట్టు ఏజెన్సీ గ్రామాల్లో మరి పరిస్థితి అధ్వానంగా మారింది వర్షాకాలం కావడంతో ఈ గ్రామాల్లో డ్రైనేజీలు సైడ్ కాలువలు సిసి రోడ్లు లేకపోవడం వలన ఇంకా నయం వర్షాకాలం సీజన్ కావడంతో నీరు ఎక్కడి కక్కడే నిలిచిపోయి చెత్తతో కలిసి మురుగుగా మారి క్రిమి కీటకాలు దోమలు విపరీతంగా తయారవుతున్నాయి. ఇదిలా ఉంటే గ్రామాలలో సీజనల్ వ్యాధుల ఇబ్బంది పడుతున్నా పట్టించుకోవడం లేదు.
Also Read: Congress on KTR: మెదక్ ప్రజలను గాడిదలు అన్న కేటిఆర్.. ఎస్పీకి ఫిర్యాదు
సైడ్ కాలువలు సిసి రోడ్లు లేకపోవడమే కారణం
ఆర్లపల్లి గ్రామపంచాయతీలో బుల్లిగుట్ట, కొడిశ గట్టు గ్రామాల్లో సైడ్ కాలువలు డ్రైనేజీలు సిసి రోడ్లు లేకపోవడం వలన ఈ మధ్యకాలంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్(Double bedroom) ఇండ్లు కూడా రోడ్డు కాలువలు మరమ్మత్తుల చేయక పోవడం వలన వలన వాటిని నుండి వచ్చే నీరు కూడా ఈ గ్రామం చిత్తడిగా మారుతున్నాయి. మా బాధ ఎన్ని రోజులు గ్రామపంచాయతీ సిబ్బందికి చెప్పిన పట్టించుకోవడం లేదు కనీసం ఇప్పుడున్న పరిస్థితులకు సీజనల్ వ్యాధులు వ్యాపిస్తాయని ప్రస్తుత మరమ్మత్తులు కూడా చేయడం లేదని గ్రామపంచాయతీ ప్రజలు పెడుతున్నారు ఇప్పటికైనా పంచాయతీ అధికారులు దృష్టి సారించి మరమ్మత్తులు చేసి గ్రామ పంచాయతీలోని ప్రజలకు రోగాల బారిన పడకుండా కాపాడాలని కోరుకుంటున్నారు.
Also Read: Vijayawada: వీధి కుక్కలపై అమానుషం.. వాడు అసలు మనిషేనా!