Ideal Marriage: సమాజంలో వివాహాలు వివిధ రకాలు జరుగుతాయి. అందులో స్త్రీ, పురుషులు సమానంగా భావించి కట్న కానుకలు లేకుండా ఆదర్శ వివాహం చేసుకోవడం ఎంతో గొప్ప విషయమని, ఆకాష్.. అమృత వర్ష ల ఆదర్శ వివాహం ఎంతో మందికి స్ఫూర్తిగా నిలవాలని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు అన్నారు.
ఆదివారం మహబూబాబాద్ లో పిఎస్ఆర్ కన్వెన్షన్ లో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జి నాగయ్య అధ్యక్షతన సీపీఎం జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్.. నాగమణి దంపతుల కుమారుడు ఆకాష్, మహబూబాబాద్ కు చెందిన బొమ్మ వెంకటేశ్వర్లు.. రోజా రమణిల కుమార్తె అమృత వర్ష ల ఆదర్శ వివాహాన్ని బీవీ రాఘవులు ఆచారత్వంలో జరిగింది.
వధూవరులుద్దరూ ప్రేమ వివాహం అంగీకరించగా వారి తల్లిదండ్రుల సమక్షంలో హిందూ, ముస్లిం, క్రిస్టియన్ సాంప్రదాయాలకు భిన్నంగా కమ్యూనిస్టు పద్ధతిలో దండలు మార్చుకొని వివాహ ప్రమాణ పత్రాలపై సంతకాలు చేసి ఆదర్శ వివాహం చేసుకున్నారు. వధువు, వరుడుతో వివాహ ప్రమాణ పత్రాలు చదివించి బీవీ రాఘవులు సంతకాలు చేయించారు. వివాహ ప్రమాణ పత్రంపై సాక్షులు సైతం సంతకాలు చేశారు.
Also read: Jayashankar Badibata: స్కూళ్ల రీఓపెన్.. విద్యాశాఖ కీలక నిర్ణయం!
ఈ సందర్భంగా బీవీ రాఘవులు మాట్లాడారు . లౌకిక భారతదేశంలో వివాహంలో విభిన్న పద్ధతులు అమల్లో ఉన్నాయని అన్నారు. హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు వివిధ రకాలుగా వివిధ పద్ధతుల్లో వివాహాలు చేసుకుంటారని అన్నారు. పురాతన భారతదేశంలో గాంధర్వ వివాహం, రుక్మిణి కళ్యాణం, సీతారాముల కళ్యాణం, పాండవుల కళ్యాణం ప్రాచుర్యంలో ఉన్నాయన్నారు. ఇలా రకరకాల కళ్యాణాలు వివాహ వేడుకలు సమాజంలో కొనసాగుతున్నాయని అన్నారు.
వివాహం చేసుకున్న దంపతులు కడసారి వరకు సుఖసంతోషాలతో ఆప్యాయతలు అనురాగంతో కలిసిమెలిసి ఉండాలని ఆకాంక్షించారు. భారతదేశంలో స్త్రీ పురుషులు సమానమని ఇద్దరికీ సమాజంలో సంసారంలో సగభాగం ఉండాలని ఆకాంక్షించారు. పురుషులతో సమానంగా అన్ని రంగాలలో మహిళలు రాణిస్తున్నారని అన్నారు. అయితే సమాజంలో బయటికి రావటంలో మహిళలు కొంత వెనుకబాటులో ఉన్నారని బయట సమాజంలో 90 శాతం పురుషులు ఉంటే 10 శాతం మాత్రమే మహిళలు కనిపిస్తున్నారని అన్నారు.
భారతదేశంలో వాహనాలు నడపడంలో పురుషులు ముందుంటే స్త్రీలు వెనుక కూర్చుంటున్నారని అన్నారు. అదే చైనాలో చూస్తే సమాజంలో స్త్రీ పురుషులు సమాన భాగంలో వీధుల్లో కనిపిస్తున్నారని, అక్కడ మహిళలు వాహనాలు నడిపితే పురుషులు వెనక కూర్చోవడం కనిపిస్తుందని అన్నారు. అన్ని రంగాల్లో చైనా మనకంటే భారతదేశం 40 సంవత్సరాలు ముందంజలో ఉందని అన్నారు.
Also read: Miss World: టూరిజం శాఖ ఫెయిల్.. అంతా ఆ ఇద్దరి వల్లేనా?
దేశంలో స్త్రీ, పురుషులు ఇద్దరూ ఉత్పత్తిలో భాగస్వామ్యం అయితే దేశ జీడీపి పెరుగుతుందని అన్నారు. భారతదేశ సమాజంలో మహిళలు పిల్లలనీ కంటున్నారని పురుషులు పోషిస్తున్నారని అన్నారు. అయితే ఇంకా సమాజంలో ఉత్పత్తి రంగంలో మహిళల భాగస్వామ్యం పెరగాలని కుటుంబ వ్యవస్థలో పురుషుల పని విధానం పెరగాలని అన్నారు. సంసార బాధ్యతల లో స్త్రీలు అధిక శ్రమ పడుతున్నారని, స్త్రీ పురుషులు ఇద్దరు భాగస్వామ్యం కావాలని అన్నారు.
ఆదర్శ వివాహాలు సమాజంలో సమానత్వాన్ని పెంచుతాయని స్త్రీ పురుషుడు సమానమని భావాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. ఇది దేశ అభ్యున్నతికి ఎంతో అవసరం స్పష్టం చేశారు. ఆదర్శ వివాహం చేసుకున్న దంపతులు జీవితాంతం కష్టసుఖాలలో పాలుపంచుకుంటూ సుఖసంతోషాలతో జీవించాలని పొరపొచ్చాలు, భిన్న అభిప్రాయాలు, మనస్పర్ధలు లేకుండా సర్దుకుపోతూ ఏకాభిప్రాయంతో ముందు భవిష్యత్తు సమాజానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు.