CPI on Operation Sindoor: భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ కు జాతీయ పతాకంతో సిపిఐ సంఘీభావం తెలుపుతూ మూడు కొట్ల సెంటర్లో నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి బి విజయసారథి మాట్లాడుతూ జై జవాన్, జై భారత్, జై ఇండియా నినాదాలతో భారత సైన్యానికి రెడ్ సెల్యూట్ చేశారు. దేశ సమగ్రత, సమైక్యతే ప్రధానంగా సైనికులు ముందుకు సాగడం అభినందనీయమన్నారు.
ఆపరేషన్ సింధూర్ ను సిపిఐ స్వాగతిస్తుందన్నారు. పాకిస్తాన్ ప్రజలపై భారత్ దాడి చేయలేదని, పాకిస్తాన్ లో ఉన్న ఉగ్రవాదుల స్థావరాలపై ఇండియా దాడి చేసిందన్నారు. పాకిస్తాన్ ఉగ్రవాదులను పెంచి పోషించడం వల్లనే ఈ దుస్థితి వచ్చిందని, ఈ సమయంలో ప్రజలందరూ శాంతియుతంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఉగ్రవాదాన్ని అంతమొందించాలని ఆకాంక్షించారు.
Also Read: Operation Kagar: కర్రెగుట్ట పై భీకర కాల్పులు.. మావోయిస్టులు మృతి!
దేశంలో 140 కోట్ల మంది ప్రజలు కులమతాలకు తావు లేకుండా కలిసికట్టుగా ఉగ్రవాదంపై ఆర్మీ జవాన్లు పోరాడేందుకు ప్రతి ఒక్కరు మద్దతు తెలపాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పహల్గాం మృతులకు నివాళులు అర్పించారు. భారతదేశం గొప్ప ప్రజాస్వామిక దేశమని ఈ సమయంలో భారతీయులంతా ఒక్కటే అని చాటుతామన్నారు. పాకిస్తాన్ ఇప్పటికైనా పెంచి పోషిస్తున్న ఉగ్రవాదాన్ని తుద ముట్టించాలన్నారు.
పాకిస్తాన్ తో భారత్ యుద్ధం చేయడం లేదని ఉగ్రవాదంపై భారత్ యుద్ధం చేస్తుందని దానికి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ మద్దతుగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బి అజయ్ సారధి రెడ్డి, తధితరుల పాల్గొన్నారు.