Congress vs CPI (imagecrdit:swetcha)
నార్త్ తెలంగాణ

Congress vs CPI: కొత్తగూడెం కుడా చైర్మన్ కోసం కాంగ్రెస్ సిపిఐ మధ్య వార్!

Congress vs CPI: భద్రాద్రి కొత్తగూడెం(Bhadradri Kothagudem) జిల్లాలో కూడా చైర్మన్ కోసం కాంగ్రెస్(Congress) పార్టీ సిపిఐ(CPI) పార్టీ హోరాహోరీగా పోటీ పడుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా కొత్తగూడెం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీని తీసుకొచ్చింది. దీంతో స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న సిపిఐ పార్టీ, తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో సిపిఐ పార్టీకి కొత్తగూడెం(Kothagudem) నియోజకవర్గంలో మద్దతు తెలిపిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు బద్ధ శత్రువులుగా మారాయి. కూడా చైర్మన్ కోసం ఇరు పార్టీలు తమ బలాబలాలను నిరూపించుకునేందుకు పోటీ పడుతున్నాయి. ఎట్టకేలకు కూడా చైర్మన్ పదవిని దక్కించుకోవాలని ఇరు పార్టీల నేతలు తహతహలాడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో భాయి భాయిగా కలిసిమెలిసి ఉన్న కాంగ్రెస్, సిపిఐ పార్టీలు ఇప్పుడు నువ్వెంత నేనంత అనే స్థాయిలో పోటీ పడుతుండడం విశేషం.

కుడా కోసం లడాయికి రెడీ
కొత్తగూడెం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (kuda) కోసం కాంగ్రెస్ వర్సెస్ సిపిఐ పార్టీలుగా నిలుస్తున్నాయి. కొత్తగూడెంలో ఎమ్మెల్యేగా ఉన్న కూనంనేని సాంబశివరావు(Kunamneni Sambasiva Rao) తన ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు ఉవ్విల్లురూతున్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ(Congress Party) మీ మేమైనా తక్కువ అంటూ పోటీకి నువ్వా నేనా సై అనే విధంగా ఒకరికొకరు పోటీ పడుతున్నారు. మొత్తంగా చూస్తే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో దోస్తీగా కలిసి పనిచేసిన కాంగ్రెస్ సిపిఐ పార్టీలు ఎప్పుడు ఒకరినొకరు చూస్తే ఓరవలేని పరిస్థితి కనిపిస్తోంది. కూడా చైర్మన్ పదవి కోసం ఇరు పార్టీలు లడాయికి రెడీగా ఉన్నట్లుగా పరిస్థితులు కనిపిస్తున్నాయి.

ఎమ్మెల్యే సీటు సాధించిన ఎర్రన్నలు కూడా చైర్మన్ పై దృష్టి
తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ(Congress) అధికారంలోకి రావాలంటే సిపిఐ పార్టీని పొత్తు కలుపుకోవాలని నేపథ్యంలో కొత్తగూడెం ఎమ్మెల్యే సీటును సిపిఐ పార్టీకి కేటాయించారు. కేటాయించడమే కాదు ఆస్థానం గెలుపొందేందుకు కాంగ్రెస్ తన శాయశక్తుల కృషిచేసి గెలిపించింది. అప్పటివరకు బాగానే ఉంది. ఆ తర్వాత కాంగ్రెస్ వర్సెస్ సిపిఐ(CPI) పార్టీలుగా పరిస్థితి కొనసాగుతుంది. కొత్తగూడెం జిల్లాలో సిపిఐ, కాంగ్రెస్ పార్టీల మధ్య కొత్త పంచాయతీ మొదలైంది. కొత్తగా ఏర్పాటు అయిన కొత్తగూడెం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కూడా కోసం ఇరు పార్టీలు కొట్లాడుకుంటున్నాయి. ఇరు పార్టీలకు చెందిన నేతలు హోరాహోరీగా పట్టుదలతో ఉండడంతో కూడా చైర్మన్ పదవి ఇరు వర్గాలకు సవాల్గా మారింది. కొత్తగూడెం, పాల్వంచ మున్సిపాలిటీలతోపాటు సుజాతనగర్ మండలంలో ఏడు గ్రామపంచాయతీలు విలీనంతో కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ అయింది.

AlsoRead: Bhadradri Kothagudem: ప్రజలపై పంజా విసురుతున్న సీజనల్ వ్యాధులు

సిపిఐ పార్టీలు తమ పంతాలు
ఈ కార్పొరేషన్ను 60 డివిజన్లుగా ఏర్పాటు చేశారు. కార్పొరేషన్లో మొత్తం 1,30,000 మంది ఓటర్లు ఉన్నారు. పురపాలక సంఘం నుంచి నగరపాలక సంస్థ స్థాయిని పెంచిన తర్వాత కొత్తగూడెం(kothagudem) అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కూడ గెజిట్ విడుదలైంది. కూడా తొలి చైర్మన్ కోసం అటు కాంగ్రెస్(Congress) ఇటు సిపిఐ(CPI) పార్టీలు తమ పంతాలు నెగ్గించుకునేందుకు పట్టుబడుతున్నాయి. కొత్తగూడెంను మహానగరపాలక సంస్థగా తీర్చిదిద్దేందుకు స్థానిక ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పెనలేని కృషి చేశారు. ఇందుకోసం సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy), జిల్లా మంత్రులు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క(Bhatti Vikramarka), పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి(Min Ponguleti), తుమ్మల నాగేశ్వరరావుల సహకారంతో కొత్తగూడెం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఈ ఏడాది మే 29న రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. ఈ పోటీ కోసం పొంగిలేటి అనుచరులు పోటీ పడుతున్నట్టుగా తెలుస్తోంది.

పొంగిలేటి హోరాహోరేగా పోటీ
అదేవిధంగా కూనంనేని సాంబశివరావు సైతం తమ పార్టీకి చెందిన వారికి చైర్మన్ పదవి కట్టబెట్టాలని ప్రయత్నాల్లో ఉన్నారు. మరి కొంతమంది కాంగ్రెస్ నేతలు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పై ఆశలు పెట్టుకొని ఉన్నారు. గతంలో పాల్వంచ పెద్దమ్మతల్లి ఆలయ పాలకమండలి చైర్మన్ ఎంపికలో బట్టి విక్రమార్క, పొంగిలేటి హోరాహోరే గా పోటీపడ్డారు. అలాంటి సీన్ రిపీట్ కాకుండా కూడా చైర్మన్ విషయంలో ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకున్నట్టుగా తెలుస్తోంది. రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్, సిపిఐ పార్టీలకు పొత్తు తప్పదు. ఈ నేపథ్యంలో కూడా చైర్మన్ వైస్ చైర్మన్ విషయంలో సిపిఐ పోటీ పడుతుందని కాంగ్రెస్ నేతల భావన. దీంతో ఎలాగైనా కూడా చైర్మన్ కాంగ్రెస్ వశం కావాలని పార్టీ శ్రేణులు పట్టుబడుతున్నాయి. అదేవిధంగా సిపిఐ పార్టీ సైతం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు నేతృత్వంలో కూడా చైర్మన్ ను సొంతం చేసుకునేందుకు ఆ పార్టీలు సైతం ప్రణాళికలు రచిస్తున్నాయి.

Also Read: KCR: యశోద ఆస్పత్రికి కేసీఆర్.. ఇంతకీ ఏమైంది?

 

 

Just In

01

Viral Video: యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థి చెంపపై 50-60 సార్లు దాడి.. వీడియో వైరల్

Ponguleti Srinivasa Reddy: పేద ప్రజల అభ్యున్నతే సీఎం కల.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Niharika Konidela: ‘కమిటీ కుర్రోళ్లు’ ఖాతాలో మరో రెండు.. హిస్టరీ క్రియేట్ చేసిన నిహారిక!

Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్సీ.. ఇండియా-ఏ జట్టుని ప్రకటించిన బీసీసీఐ

Son Kills Father: రాష్ట్రంలో ఘోరం.. కూతురిపై చేతబడి చేశాడని.. తండ్రిని చంపిన కొడుకు