CM Revanth Reddy: ఆచిరకాలం గుర్తుండిపోయే విధంగా తెలంగాణ కుంభమేళగా పేరుగాంచిన మేడారం సమ్మక్క సారలమ్మ ఆలయ ప్రాంగణ నిర్మాణ పనులు రాతి కట్టడాలతో చేపడుతున్నామని తెలంగాణ రాష్ట్ర సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)పేర్కొన్నారు. హైదరాబాదు నుండి హెలికాప్టర్లో మేడారం సమ్మక్క సారలమ్మ వద్దకు చేరుకున్నారు. తొలుత మేడారంలో మంత్రులు పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి, ధనసరి సీతక్క, కొండా సురేఖ లతో కలిసి సమ్మక్క సారలమ్మలను దర్శించుకున్నారు. అనంతరం నిలువెత్తు బంగారాన్ని సమర్పించారు. ఆ తర్వాత పూజారులు, ఆలయ, ఆదివాసి పెద్దలు, మంత్రులతో కలిసి మేడారం సమ్మక్క సారలమ్మ ఆలయ ప్రాంగణ అభివృద్ధి పనులను ఏ విధంగా చేస్తే బాగుంటుందో సమీక్షించారు. వివిధ రకాల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు.
అందరికీ సంక్షేమం అందేలా ప్రణాళికలు
అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ…. గిరిజనులు, ఆదివాసీలను పరిపాలనలో భాగస్వామ్యం చేస్తూ, సంక్షేమ, అభివృద్ధి వైపు సాగుతున్నామన్నారు. సన్న బియ్యం, రేషన్ కార్డులు, రైతు రుణమాఫీ, రైతు భరోసా వంటి సంక్షేమ పథకాలను తీసుకొచ్చి అందరికీ సంక్షేమం అందేలా ప్రణాళికలు చేశామన్నారు. ప్రాంగణ పునర్నిర్మాణ అభివృద్ధి పనులను పునః ప్రారంభించడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. ఫిబ్రవరి 6, 2023న కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఆ ఏడాది మేడారం జాతర కోసం సీతక్క సమయం లేదు.. త్వరగా పూర్తి చేయాలని నా దృష్టికి తీసుకువచ్చారు.
Also Read: Sandeep Reddy Vanga: సెన్సేషనల్ డెసిషన్ తీసుకున్న సందీప్ రెడ్డి వంగా .. త్వరలోనే బిగ్ అనౌన్స్మెంట్
గిరిజన సంప్రదాయాలు కాపాడవలసిన బాధ్యత ఆదివాసీలదే
దీంతో మేడారం మహా జాతర అభివృద్ధి పనులను అనుకున్న సమయంలోనే పూర్తి చేశాం. ఆదివాసీలు ఆదివాసి దేవతకు సంతకం చేస్తే నిధులు వచ్చేలా ఆధునీకరించి సీతక్కను మంత్రిని చేసి ప్రభుత్వంలో భాగస్వామ్యం అందించామన్నారు. గిరిజన సంప్రదాయాలు కాపాడవలసిన బాధ్యత ఆదివాసీలదేనన్నారు. సిమెంట్ కట్టడంతో నిర్మాణాలు చేస్తే 100 ఏళ్ళు మాత్రమే నిర్మాణం ఉంటుందని, రాతి కట్టడాలతో అయితే వేల సంవత్సరాలు నిర్మాణాలు సుస్థిరంగా ఉంటాయని ఆలోచనతో మేడారం ఆలయ ప్రాంగణాన్ని రాతి కట్టడాలతో పునర్నిర్మానం చేస్తున్నామని వెల్లడించారు. రాతి కట్టడాల నిర్మాణాలు వేల సంవత్సరాలు ఉంటాయన్నడానికి ప్రత్యేక ప్రత్యక్ష ఉదాహరణ రామప్ప దేవాలయమేనన్నారు. రుద్ర దేవుడు అప్పటి నిర్మాణాలు చేసిన లక్ష్యంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం మేడారం ఆలయ ప్రాంగణ పునర్ నిర్మాణ పనులను ప్రారంభిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలోని ప్రజలందరి ఆశీర్వాదం సహకారం ప్రభుత్వానికి కావాలని విజ్ఞప్తి చేశారు.
కుంభమేళాకు వేలకోట్లు… మరి ప్రకృతి దేవతలకు నిధులేవి..?
కుంభమేళాకు వేల కోట్ల నిధులను కుమ్మరిస్తున్న కేంద్ర ప్రభుత్వం తెలంగాణ కుంభమేళా, ఆసియాలోనే అతిపెద్ద ఆదివాసి జాతరగగా పేరుగాంచిన మేడారం సమ్మక్క సారలమ్మ లకు నిధులు ఎందుకు కేటాయించడం లేదని కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లను నిలదీశారు. ప్రకృతి దేవతలు సమ్మక్క సారలమ్మ ఆశీర్వాదంతో తెలంగాణ రాష్ట్రంలో గెలుపొందిన బండి సంజయ్, కిషన్ రెడ్డి లు సమ్మక్క సారలమ్మ ఆలయానికి కేంద్ర ప్రభుత్వం నుంచి మరిన్ని నిధులు తీసుకురావాలని డిమాండ్ చేశారు. రాతి కట్టడాలతో నిర్మాణ పనులను చేపట్టి వంద రోజుల్లోనే పూర్తి చేయాలని ఆదేశించారు. ఇందుకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దనసరి సీతక్కలకు ఆదేశాలు జారీ చేశామన్నారు. ఒక పగలు మాత్రమే చేస్తే పనులు పూర్తిగా కావని, రాత్రింబవళ్లు కష్టించి పనిచేసి 100 రోజుల్లో సమ్మక్క సారలమ్మ ఆలయ పునర్నిర్మాణ పనులను పూర్తి చేయాలని సూచించారు. పూర్తయ్యాక మళ్ళీ వస్తా అందరం కలిసి మేడారం జాతరను అంగరంగ వైభవంగా నిర్వహించుకుందామన్నారు.
ప్రకృతి దేవతలు సమ్మక్క, సారలమ్మలు… అందుకు ప్రత్యక్ష ఉదాహరణ నేటి వాతావరణం
సమ్మక్క సారలమ్మలు ప్రకృతి దేవతలని, అందుకు ప్రత్యక్ష ఉదాహరణ నేటి వాతావరణమే నని చెప్పారు. హైదరాబాదు నుండి హెలికాప్టర్లో మేడారంలోని సమ్మక్క సారలమ్మ ఆలయ అభివృద్ధి పనులకు బయలుదేరేటప్పుడు హెలికాప్టర్ నడిపేందుకు వాతావరణం సహకరించదని అధికారులు తెలిపినట్లు చెప్పారు. అందుకు సీఎం రేవంత్ రెడ్డి స్పందించి సమ్మక్క, సారలమ్మలు మబ్బులను తొలగించేశారని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మేడారం జాతరకు జాతీయ హోదా కల్పించి రూ.100 కోట్ల నిధులు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Also Read: Jayammu Nischayammu Raa: నాకు ఆ డ్యాన్స్‌లేవీ రావ్.. జగపతిబాబు షోలో ప్రభుదేవా!