CM Relief Fund: ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) పథకం పేద ప్రజలకు వరమని వరంగల్(Warangal) పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి(MLA Nayini Rajender Reddy) అన్నారు. నియోజకవర్గంలోని 52 మంది లబ్ధిదారులకు రూ. 22.50 లక్షల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అనారోగ్య సమస్యలతో ఆస్పత్రుల్లో చికిత్స పొందిన పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని అన్నారు.
Also Read: Jr NTR: సీఎం రేవంత్‌కు థ్యాంక్స్ చెప్పడం మరిచిపోయిన ఎన్టీఆర్.. ఏం చేశాడంటే?
ప్రతి ఒక్కరికీ సహాయం అందిస్తున్నామం
పార్టీలకు అతీతంగా సీఎం సహాయ నిధి చెక్కులను అర్హులైన లబ్ధిదారులకు అందిస్తామని తెలిపారు. ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి ఎల్వోసి (లెటర్ ఆఫ్ క్రెడిట్), సీఎంఆర్ఎఫ్ ద్వారా అవసరంలో ఉన్న ప్రతి ఒక్కరికీ సహాయం అందిస్తున్నామని పేర్కొన్నారు. పేదల సంక్షేమం కోసం ప్రజా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని ఎమ్మెల్యే నాయిని స్పష్టం చేశారు.
Also Read: Adluri Lakshman: వికలాంగుల కళ్లలో ఆనందం సర్కారు లక్ష్యం