Chhattisgarh Maoists: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు భయంకరమైన ఘాతకానికి పాల్పడుతున్నారు. ఇన్ఫార్మర్లు అనే నెపంతో ఇద్దరిని హతమార్చారు. కేంద్ర, ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh)రాష్ట్ర ప్రభుత్వాలు మావోయిస్టులను పూర్తిస్థాయిలో అణచివేయాలని కోణంలో (Operation Kagar)ఆపరేషన్ కగార్‌ను కొనసాగిస్తున్నాయి. మావోయిస్టులను మట్టు పెట్టడమే ధ్యేయంగా భద్రతా బలగాలు పనిచేస్తున్నాయి. భద్రత బలగాల చేతిలో మరణించిన మావోయిస్టులకు ప్రతీకార ధ్యేయంగా ఆదివాసి గ్రామాల్లో తమ భీకరమైన ఘాతుకాలకు పాల్పడుతున్నారు.
Also Read:Operation Kagar: కర్రె గుట్టల్లో భీకర కాల్పులు.. మావోయిస్టులకు భారీ దెబ్బ!
12 మంది కేంద్ర కమిటీ సభ్యులు
లొంగిపోయిన మావోయిస్టు కుటుంబాలను హతమార్చడంతోపాటు అనుమానం వచ్చిన వారిని ఇన్ఫార్మర్ అనే నేపంతో మట్టు పెడుతూ వస్తున్నారు. ఎట్టకేలకు కేంద్ర కమిటీ సభ్యులు ఇప్పటికే ఆరుగురిని భద్రతా బలగాలు మట్టుపెట్టాయి. ఇంకా మరో 12 మంది కేంద్ర కమిటీ సభ్యులు ఉన్నట్లుగా భద్రతా బలగాలు వెల్లడిస్తున్నాయి. అంతేకాకుండా రాష్ట్ర కమిటీ సభ్యులు సైతం దాదాపు పదుల సంఖ్యలోనే ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. అయితే ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో బీజాపూర్, నారాయణపూర్, దంతేవాడ లతోపాటు మరికొన్ని జిల్లాల్లో మావోయిస్టులకు స్వర్గధామంగా కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. అయితే ఇక్కడ తలదాచుకుంటున్న మావోయిస్టులను కేంద్ర భద్రత బలగాలు మట్టు పెట్టడంతో ఇన్ఫార్మర్లు సమాచారం చేరవేయడంతోనే మావోయిస్టులు మృత్యువాత చెందుతున్నారనేది వారు భావిస్తున్న పరిస్థితి.
బిక్కుబిక్కుమంటూ బతకడమే కష్టం
ఈ కోణంలోనే దాదాపుగా పదుల మందిని ఇన్ఫార్మర్ల నెపంతో ఆదివాసి అమాయక ప్రజలను మావోయిస్టులు చంపేస్తూ తమ క్షనికానందాన్ని పొందుతున్నారు. అసలు ఆపరేషన్ కగార్ (Operation Kagar) చేపట్టిందే మావోయిస్టులను అంతమొందించడానికి అనే విషయం మావోయిస్టులకు ఎందుకు అర్థం కావడం లేదు అని ఆదివాసి కుటుంబాలు బెంబేలెత్తిపోతున్నాయి. తాము ఇలాంటి పరిస్థితుల్లో బిక్కుబిక్కుమంటూ బతకడమే కష్టంగా ఉంటే ఇన్ఫార్మల్గా ఎలా పనిచేస్తామని ప్రశ్నలు సైతం వెళ్ళువేత్తుతున్నాయి.
అర్థం కాని పరిస్థితులు
ఆదివాసి అమాయక ప్రజల ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకొని బ్రతుకుతున్న పరిస్థితులు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని పాలు జిల్లాల్లో ఉన్న దుస్థితి. అటు భద్రతా బలగాలకు సహకరించలేని పరిస్థితి ప్రస్తుతం ఆ ఆదివాసి పల్లెల్లో నెలకొన్నది. ఇటు మావోయిస్టులకు సైతం సహకరించలేని పరిస్థితి కూడా నెలకొన్నది. కరవమంటే కప్పకు కోపం విడపోమంటే పాము కోపం అనే చందంగా ఆదివాసి పల్లెల పరిస్థితి ఉంది. అసలు ఇరు వర్గాల మధ్య ఎలా జీవనాన్ని కొనసాగించాలో అర్థం కాని పరిస్థితులు ఆ ఆదివాసి పల్లెల్లో ఉండడం గమనార్హం. ప్రభుత్వాలు సైతం ఆదివాసీలను చిన్నచూపు చూడడంతో వారు తమ జీవన స్థితిగతులను మార్చుకోలేని దుస్థితిలో ఉన్నట్లుగా తెలుస్తోంది. కేంద్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల భద్రతా బలగాలు ఎట్టకేలకు మావోయిస్టులను ఒక్కొక్కరుగా మట్టు పెడుతూ వస్తున్నారు. మొత్తంగా చూస్తే చివరి అంకానికి ఆపరేషన్ కగార్ చేరిందనే చర్చలు సైతం సాగుతుండడం విశేషం.
Also Read: Farmers Protest: రోడ్డెక్కిన రైతన్నలు.. సీడ్ కంపెనీల తీరుపై తీవ్ర ఆగ్రహం..