Ramachandra Rao (IMAGE credit: swetcha reporter)
నార్త్ తెలంగాణ

Ramachandra Rao: యూరియా కొరతపై తుమ్మలతో చర్చకు సిద్ధం!

Ramachandra Rao: రాష్ట్రంలో ఏ పార్టీతో పొట్టు ఉండదని,ప్రజలతోనే బిజెపి పొత్తు ఉంటుందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రావు (Ramachandra Rao) అన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా(Jogulamba Gadwal District)కేంద్రంలో ఎస్పి ఈవెంట్ హల్ లో జరిగిన బిజెపి ముఖ్య కార్యకర్తల సమావేశం నేపథ్యంలో ఎంపీ డీకే అరుణ తో కలిసి ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడారు.రాష్ట్రంలో పంచాయతీ రాజ్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రేస్ పార్టీ బిజెపిపై లేనిపోని ఆరోపణలు చేస్తుందన్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రెండో వారం వరకు రాష్ట్రవ్యాప్తంగా పర్యటన కొనసాగుతుందన్నారు.

 Also Read: Farmers Protest: రోడ్డెక్కిన రైతన్నలు.. సీడ్ కంపెనీల తీరుపై తీవ్ర ఆగ్రహం..

చర్చకు సిద్ధమా.. ?

నడిగడ్డ ప్రాంతంలో కాటన్ సీడ్ హబ్ గా ఉందని పత్తి రైతులను విస్మరిస్తూ మద్దత్తు ధరలో రైతులకు ప్రభుత్వం,కంపెనీలు మొండిచేయి చూపుతుందన్నారు.రాష్ట్ర ప్రభుత్వం ఎరువులు కొరత సృష్టిస్తూ బిజెపి(Bjp)పై నిందలు వేస్తూ రాజకీయ లబ్ది పొందేందుకు ప్రయత్నిస్తుందన్నారు .మిగతా రాష్ట్రాలలో యూరియా నిల్వలు ఉండగా ఒక్క తెలంగాణ రాష్టంలో యూరియా కొరత పేరున రాజకీయం చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి 9 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా 12 లక్షల మెట్రిక్ టన్నులు యూరియాను తెలంగాణకు కేంద్రం ఇచ్చిందని, కొందరు దళారులు కృతిమ కొరత సృష్టిస్తున్నారన్నారు.. దీనిపై వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు(Thummala Nageshwar Rao)తో చర్చకు సిద్ధమన్నారు. రైతులకు ఎందుకు ఇవ్వలేకపోతున్నరన్నారు. దీనిపై దర్యాప్తు చేపట్టాలన్నారు.రాబోయే పంచాయతీ రాజ్ ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని కాంగ్రేస్ పార్టీ ఇలాంటి జిమ్మిక్కులకు పాల్పడుతోందన్నారు.

కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

ఎంపీ డీకే అరుణ(DK Aruna) మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందన్నారు. బిజెపిపై ప్రజల్లో సానుకూలత ఉందని నాయకులు కార్యకర్తలు వారికి అండగా ఉండి పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలన్నారుఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు రామాంజనేయులు, ఎస్ రామచంద్రారెడ్డి,బండల వెంకట్ రాములు, వెంకటేశ్వర్ రెడ్డి, అక్కల రమా సాయి బాబా తదితరులు పాల్గొన్నారు.

 Also Read: Thummala Nageswara Rao: జాతీయ చేనేత దినోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు

Just In

01

Bathukamma Kunta: 5న బ‌తుక‌మ్మ‌కుంట గ్రాండ్ ఓపెనింగ్‌. రూ.7.40 కోట్లతో అభివృద్ధి

Manchu Manoj: అయోధ్య రాములవారిని దర్శించుకుని క్షమాపణలు చెప్పిన బ్లాక్ స్వార్డ్.. విషయమిదే!

KTR: స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరించండి.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

BJP: త్వరలోనే స్థానిక ఎన్నికలు… కానీ, బీజేపీలో మాత్రం వింత పరిస్థితి?

Kavitha: పెద్దోళ్లను వదిలి పేదలపై ప్రతాపమా?.. కవిత కీలక వ్యాఖ్యలు