Bhatti Vikramarka: ముక్తేశ్వర స్వామి, సరస్వతీ దేవి కటాక్షాలు రాష్ట్రంపై ఉండాలి. రాష్ట్రం పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని కోరుకున్నానని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కాళేశ్వరంలోని సరస్వతి నది పుష్కరాల్లో పాల్గొన్న ఉపముఖ్యమంత్రి శనివారం ఉదయం సరస్వతి ఘాట్ లో సోదరుడు మల్లు ప్రసాద్ తో కలిసి పెద్దలకు పిండప్రదానం చేశారు.
అనంతరం సరస్వతి పుష్కర ఘాట్ లో స్నానమాచరించి కాళేశ్వర శివాలయంలో కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. డిప్యూటీ సీఎంతో పాటు మంత్రి శ్రీధర్ బాబు, శాసన సభ్యులు మక్కన్ సింగ్, గండ్ర సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
Also read: YouTuber Jyoti Malhotra: పాక్ స్పైగా భారత మహిళా యూట్యూబర్.. ఈమె మామూలు కి’లేడీ’ కాదు!
ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ గోదావరి, ప్రాణహిత అలాగే సరస్వతి అంతర్వాహిని మూడు నదుల సంగమం 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే మూడు పుష్కరాలు కాళేశ్వరంలో అద్భుతంగా జరుగుతున్నాయని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు.
పుష్కరాలకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు బాగా చేశారన్నారు. ప్రతి రోజు లక్షలాది మంది భక్తులు వచ్చి ఈ పవిత్రమైన పుష్కర స్నానాలను ఆచరిస్తూ, సరస్వతి అమ్మవారిని దర్శించుకుని కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి ఆశీస్సులు పొందుతున్నారన్నారు.
12 సంవత్సరాలకు వచ్చే పుష్కరాలకు లక్షలల్లో భక్తులు కాళేశ్వరం వచ్చి పవిత్రమైనటువంటి స్నానం చేస్తున్నారని అన్నారు. సరస్వతి, కాళేశ్వర ముక్తేశ్వర స్వామి వారిని దర్శించుకున్న వారికి సర్వ విజయాలు సాధిస్తారనే నమ్మకంతో పాటు చేసిన తప్పులు, పొరపాట్లు, పాపాలన్నీ తొలగిపోతాయని, మంచి మనసుతో అమ్మవారిని కోరుకుంటే అన్ని సవ్యంగా, సక్రమంగా జరుగుతాయని నమ్మకం ఉందని తెలిపారు.
Also read: Minister Seethakka: ఏజెన్సీల్లో రోడ్డు మార్గాలు.. అధికారుల మీనమేషాలు!
రాష్ట్ర ప్రభుత్వం నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదటి రోజు వచ్చి పుష్కరాల కార్యక్రమాన్ని ప్రారంభించారని తెలిపారు. మంథిని శాసన సభ్యులు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు దగ్గరుండి ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారని తెలిపారు.
తాను రెండో రోజు సరస్వతి అమ్మవారిని దర్శనం చేసుకున్నానని, అమ్మవారిని ముక్తేశ్వరా స్వామిని కోరుకొన్నది ఒకటే తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, నదులు సక్రమంగా పారుతూ పాడి పంటలతో తెలంగాణ రాష్ట్రం విరాజిల్లాలని ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా మన రాష్ట్రం ప్రపంచంతో పోటీ పడే స్థాయికి ఎదగాలని ఈ పవిత్ర పుష్కరాలు సందర్భంగా అమ్మవారిని కోరుకుంటున్నానని తెలిపారు.