Bhadradri Kothagudem: ప్రభుత్వ విద్య సమస్యల వలయంలో చిక్కుకుని విలవిలలాడుతోందని, మణుగూరు పరిసరాల్లోని హాస్టళ్లు గందరగోళంగా మారాయని, మరమ్మత్తులు లేకపోవడంతో శిథిలావస్థకు చేరినా పట్టించుకునే నాథుడే కరువయ్యారని పి డి ఎస్ యు రాష్ట్ర అధ్యక్షులు కాంపాటి పృథ్వీ, భద్రాద్రి కొత్తగూడెం9Bhadradri Kothagudem) జిల్లా నాయకుడు మునిగెలా శివ ప్రశాంత్ అన్నారు. పి డి ఎస్ యు ఆధ్వర్యంలో నిర్వహించిన ‘విద్యార్థి పోరుబాట యాత్ర’ మణుగూరుకు చేరుకున్న సందర్భంగా, పట్టణంలోని వివిధ హాస్టళ్లు, కళాశాలలను వారు సందర్శించారు.
Also Read: Khammam Rains: ఆ జిల్లాలో భారీ వర్షాలు జలమయమైన రోడ్లు.. అత్యవసరమైతే తప్పా ప్రయాణాలు చేయవద్దు
విద్యార్థులు తీవ్ర మనోవేదన
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, గిరిజన హాస్టళ్లు మురికివాడలుగా మారాయని, మరుగుదొడ్లు శుభ్రంగా లేకపోవడంతో పాటు, ఉన్నవి కూడా శిథిలావస్థలో ఉండటం వల్ల విద్యార్థుల(Students) రోజువారీ అవసరాలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయనితెలిపారు. వర్షాకాలం కావడంతో విద్యార్థులు(Students) తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని పేర్కొన్నారు. వర్షాలు పెరగడంతో వసతి గృహాల్లోకి నీరు చేరి, విద్యార్థులు (Students)హాస్టళ్లను ఖాళీ చేయాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. సంవత్సరాలు గడుస్తున్నా భవనాలకు రంగులు వేయకపోవడంతో అవి పాతబడి, కళ తప్పాయని తెలిపారు. కనీసం విద్యార్థులకు సురక్షితమైన తాగునీరు కూడా లభించడం లేదని పేర్కొన్నారు.
కళాశాలలు దారుణమైన స్థితిలో
మణుగూరులో బీసీ పోస్ట్ మెట్రిక్ హాస్టల్ అద్దె భవనంలో కొనసాగుతోందని, మూడు సంవత్సరాలుగా అద్దె చెల్లించకపోవడంతో భవన యజమానులు విద్యార్థులను బయటకు వెళ్ళగొట్టే పరిస్థితి వచ్చిందని వారు అన్నారు. తక్షణమే విద్యార్థులకు సొంత భవనం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. హాస్టళ్ళు, కళాశాలలు దారుణమైన స్థితిలో ఉన్నప్పటికీ, ప్రభుత్వం ఏ మాత్రం నిధులు కేటాయించకుండా నిర్లక్ష్యం చేస్తోందన్నారు. రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం విద్యారంగానికి తగిన నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.
ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లను విడుదల చేయాలని, ఫీజు నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలని, పాఠశాలల్లో నాణ్యమైన మధ్యాహ్న భోజనాన్ని అందించాలని, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మైనింగ్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పి డి ఎస్ యు నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
Also Read: Alekhya Chitti Pickles: కెరీర్ మీద ఫోకస్ పెంచిన పికిల్స్ బ్యూటీ.. అక్కడ రచ్చ చేయడానికి రెడీ
