ములుగు, స్వేచ్ఛ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏడుళ్ల బయ్యారం పోలీస్ స్టేషన్లో ఏఆర్ ఎస్సై (AR SI)గా పనిచేస్తున్న స్వర్ణపాక లక్ష్మీ నరసయ్య గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం పస్రా గ్రామంలోని తన సొంత ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నాడు. గత కొంతకాలంగా కుటుంబంలో కలహాల కారణంతో భార్యాభర్తలు తరచూ గొడవలు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే లక్ష్మీ నరసయ్య ఆత్మహత్యకు పాల్పడినట్లు బంధువులు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న పస్ర పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బయ్యారం పోలీస్ స్టేషన్లో ఏఆర్ ఎస్సై గా పనిచేస్తున్న స్వర్ణపాక లక్ష్మీ నరసయ్య స్వస్థలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం మాణిక్యపురం గ్రామం. కాగా, లక్ష్మీ నరసయ్య భార్య సునీత గోవిందరావుపేట మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పని చేస్తోంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.