Anganwadi Teachers (imagecredit:swetcha)
నార్త్ తెలంగాణ

Anganwadi Teachers: ఫ్రీ ప్రైమరి టీచర్స్‌గా అంగన్వాడీ టీచర్లను నియమించాలి.. మంత్రికి వినతి

Anganwadi Teachers: ఫ్రీ పైమరి టీచర్స్‌గా అంగన్వాడీ టీచర్లను తీసుకోవాలని శిశు సంక్షేమ శాఖ మంత్రి క్యాంపు కార్యాలయంలొ మంత్రి సీతక్క(Min Seethakka)ను గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి(Mla Bandla Krishna Mohan Reddy)) ఆధ్వర్యంలో తెలంగాణ అంగన్వాడీ టీచర్స్(Telangana Anganwadi Teachers), హెల్పర్స్ అసోసియేషన్ సభ్యులు విన్నవించారు. ఈ మేరకు ఆమెకు వినతిపత్రం సమర్పించారు. ప్రభుత్వం త్వరలో తేబోతున్న ప్రభుత్వ పాఠశాలల్లో ఫ్రీ ప్రైమరీ పాఠశాల నిర్వహణ కోసం ఫ్రీ పైమరి టీచర్స్‌‌‌‌గా అంగన్వాడీ టీచర్లను తీసుకోవాలని మంత్రికి వినతి పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్లు మాట్లాడుతూ..
గత 50 సంవత్సరాలుగా అంగన్వాడీ ఉద్యోగులుగా గౌరవ వేతనంతో పనిచేస్తూ ప్రభుత్వము ప్రవేశ పెట్టిన ప్రతి పథకాన్ని ప్రజలోకి తీసుకెళ్లడమే కాకుండా అనేక అదనపు ప్రభుత్వ కార్యక్రమాలను చేస్తున్నామన్నారు. ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన ప్రభుత్వ పాఠశాలలో ఫ్రీ ప్రైమరి పాఠశాల(Free Primary School)ల నిర్వహణకు వేరే వాలంటీర్లను నియమించడం కోసం జిఓ(GO) ను తేవడం జరిగిందని దానిని రద్దు చేసి, అంగన్వాడీ ఉద్యోగులు డిగ్రీలు, పీజీలతో పాటు ప్రీ స్కూల్ ట్రయినింగ్లు(Pre-school trainings), జాబ్ కోర్స్ అర్బీ ట్రైనింగులు(Job Course Arbi Trainings), ప్రీ స్కూల్(Free School) కార్యక్రమాల మీద పూర్తి అవగాహనా ఉన్నందున అర్హులైన అంగన్వాడీ ఉద్యోగులను నియమించాలని కోరారు.

Also Read: Guest Lecturers: 6 నెలలుగా వేతనాలు పెండింగ్.. ఆర్థికశాఖ కొర్రీలు

ఇందుకు సానుకూలంగా స్పందించిన మంత్రి తదుపరి కార్యచరణను పరిగణలోకి తీసుకుంటామని తెలిపారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ(Telangana) అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ సభ్యులు సౌధామిని, ఇందిరమ్మ, శ్రీలత, అనంత లక్ష్మి, సువర్ణ, వెంకట లక్ష్మి, శైలజ, సుజాత తదితరులు పాల్గొన్నారు.

Just In

01

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?