Saraswati Pushkaralu (imagecredit:swetcha)
నార్త్ తెలంగాణ

Saraswati Pushkaralu: పుష్కరాలకు ముస్తాబవుతున్న కాళేశ్వరం.. స్వరాష్ట్రంలో తోలి పుష్కరాలు

వరంగల్ స్వేచ్ఛ: Saraswati Pushkaralu: దేశంలోని ప్రసిద్ధ శైవ క్షేత్రాల్లో ఎంతో విశిష్టత సంతరించుకున్న ప్రముఖ పుణ్యక్షేత్రమైన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కాళేశ్వరంలో నిరవించే సరస్వతీ నది పుష్కరాలను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2013లో పుష్కరాలు నిర్వహించారు. ప్రతి పుష్కరం తరువాత నిర్వహించే సరస్వతి పుష్కరాలు మే 15 నుంచి 26 వరకు నిర్వహించనున్నారు.స్వరాష్ట్రం సాధించుకున్న తర్వాత మొదటిసారి సరస్వతి పుష్కరాలు నిర్వహిస్తుండడంతో తెలంగాణ రాష్ట్రంలోని ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.

పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ముందస్తు ఏర్పాట్లు చేస్తుంది. పుష్కరాల కోసం చేపట్టే అభివృద్ధి పనులకు గాను రూ.25 కోట్లు మంజూరు చేసింది. ఎప్పటికప్పుడు రాష్ట్ర దేవాదాయ శాఖతో పాటు జిల్లా యంత్రాంగం పనులు పనులు నిత్యం సమీక్షిస్తున్నారు. సరస్వతి పుష్కరాల ఏర్పాట్లకు సంబంధించి స్వేచ్ఛ ప్రత్యేక కథనం

ప్రత్యేక ఆకర్షణగా సరస్వతి అమ్మవారి విగ్రహం, వేదమూర్తుల విగ్రహాలు

కాళేశ్వరం పుణ్యక్షేత్రంలో నిర్వహించే సరస్వతీ నది పుష్కరాలను వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేస్తుంది. దేవాదాయ శాఖ సహా పలు ప్రభుత్వ విభాగాలు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా సరస్వతీ నది పుష్కరాలు రావడంతో ప్రాముఖ్యత సంతరించుకుంది. పుష్కరాలకు సంబంధించి 120 పనులు చేపట్టేందుకు అధికారులు ప్రతిపాదనలు రూపొందించారు.

ఇందుకు రూ.35 కోట్ల అంచనా వేయగా, ప్రభుత్వం రూ.25 కోట్లు మంజూరు చేసింది. ప్రస్తుతం ఆ పనులు శరవేగంగా నడుస్తున్నాయి. కాళేశ్వరం త్రివేణి సంగమం సమీపంలోని ప్రధాన పుష్కర ఘాట్ వద్ద 20 అడుగుల ఎత్తులో సరస్వతి అమ్మవారి విగ్రహం, వేదమూర్తుల విగ్రహాలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పుష్కరాల్లో ఆ విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నాయి.

మూడు పుష్కరాలు కాళేశ్వరం ప్రత్యేకత

సరస్వతి నది పుష్కరాలు మే 15న సూర్యోదయం నుంచి ప్రారంభించేందుకు పీఠాధిపతులు ముహుర్తం ఖరారు చేశారు. 26 వరకు పుష్కరాలు కొనసాగనున్నాయి. తెలంగాణ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ సహా అనేక రాష్ట్రాల నుంచి లక్షలాదిగా భక్తులు పుష్కర స్నానాలు ఆచరించేందుకు భక్తులు తరలివస్తారని అధికారులు అంచనా వేస్తుంటారు. పుష్కరాలకు వచ్చే రద్దీకి తగ్గట్లుగా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇటీవలే ప్రయాగ్ రాజ్లో జరిగిన మహా కుంభమేళాలో దేవాదాయ శాఖ అధికారులు పర్యటించి అక్కడి ఏర్పాట్లను పరిశీలించారు.

సరస్వతీ పుష్కరాల సందర్భంగా చేపట్టాల్సిన చర్యలు. ఏర్పాట్లు, పారిశుధ్య నిర్వహణ, పార్కింగ్, భద్రత అంశాలపై ప్రత్యేక అధ్యయనం చేసి అందించిన నివేదిక ఆధారంగా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. సాధారణంగా ఒక ప్రాంతంలో ఒకే సారి అంటే ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు వస్తాయి. కానీ కాళేశ్వరంలో మాత్రం 12 సంవత్సరాలు మూడు పుష్కరాలు నిర్వహించడం ఇక్కడ ప్రత్యేకత.

కాళేశ్వరం వద్ద గోదావరి నది, ప్రాణహిత నది, సరస్వతి నదులు మూడు కలిసి త్రివేణి సంగమంగా ప్రవహిస్తాయి. అందుకే ఇక్కడ ఈ మూడు నదులకు సంబంధించి ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు నిర్వహిస్తారు. బృహస్పతి 0868 ప్రవేశించినప్పటి నుండి 12 రోజులపాటు సరస్వతి పుష్కరాలు జరుపుకుంటారు. పుష్కరాలు అంటే 12 సంవత్సరాలకు పవిత్ర నదుల ఒడ్డున జరిగే ఒక పండుగ. పండుగలో నదిలో పుణ్యస్నానం ఆచరిస్తే ఎంతో పుణ్యం కలుగుతుందని భక్తుల నమ్మకం.

స్పీడ్ అందుకున్న పనులు సమయానికి పూర్తి అయ్యేనా…?

కాళేశ్వరంలోని సరస్వతీ నది పుష్కరాల సందర్భంగా అభివృద్ధి పనులు స్పీడందుకున్నాయి. త్రివేణి అతిథి గృహం చుట్టూ సిసి పనులకు రూ.7 లక్షలు, విఐపి పార్కింగ్ స్థలంలో సిసి పనులకు రూ.30 లక్షలు, ప్రసాద తయారీ హాల్ లో సిసి పనులకు రూ.6 లక్షలు, ప్రసాద తయారీ హాల్ ఉత్తరం వైపు సిసి పనులకు రూ.20 లక్షలు, కల్యాణ మండపం నుండి ప్రసాదం తయారీ హాల్ వరకు సిసి పనులకు రూ.40 లక్షలు, ఎస్ఆర్ఆర్ రోడ్ ముందు సిసి పనులకు రూ.41 లక్షలు, శ్రీ నాగేంద్రస్వామి ఆలయానికి 100 గదుల ఉత్తరం వైపు సిసీ పసులకు రూ.88 లక్షలు, కార్యాలయ భవనం జంక్షన్ నుండి ప్రధాన ఆలయ తూర్పు రాజగోపురం వరకు సిసి పనులకు రూ.28 లక్షలు, సూర్య మండపం వద్ద గోపురం వరకు సిసి పనులకు రూ.25 లక్షలు, కల్యాణ మండపానికి ఉత్తర, తూర్పు మూలకు సిసి పనులకు రూ.18 లక్షలు,

దక్షిణ ప్రవేశద్వారం వద్ద క్యూ లైన్ మండపం చుట్టూ సిసి పనులకు రూ.42 లక్షలు, సింగరేణి గెస్ట్ హౌస్ చుట్టూ అఫ్రోచ్ రోడ్ సిసి పనులకు రూ.38 లక్షలు, కార్యాలయం ముందు చదును పనులకు రూ.10 లక్షలు, శ్రీ నాగేంద్ర స్వామి ఆలయానికి తూర్పు, ఉత్తరం వైపు కాంపౌండ్ వాల్ నిర్మాణానికి రూ.9 లక్షలు, గులుకోట గెస్ట్ హౌస్ చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మాణానికి రూ.15 లక్షలు, ఇప్పటికే ఉన్న క్యూ లైన్ చుట్టూ మెష్ జాలి ఏర్పాటు కోసం రూ.15 లక్షలు, గోదావరి హారతి కోసం గోదావరి ఘాట్ వద్ద ఆర్చ్ గేట్ నిర్మాణానికి రూ.40 లక్షలు, కళ్యాణ కట్ట నిర్మాణానికి రూ. 42 లక్షలు, పిండ ప్రధానం హాల్ నిర్మాణానికి రూ.42 లక్షలు,

Also Read: BRS Cadre in Rangareddy: గులాబీ వనంలో మౌనరాగం!.. దిక్కుతోచని స్థితిలో క్యాడర్‌!

కళ్యాణ మండపం ముందు పిలిగ్రిమ్ షెడ్ నిర్మాణానికి రూ.1 కోటి 15 లక్షలు, క్యూ లైన్తో ప్రసాదం కౌంటర్ల నిర్మాణానికి (గ్రౌండ్ ఫ్లోర్, మొదటి అంతస్తు) ప్రసాదం తయారీ హాల్ నిర్మాణానికి రూ.1 కోటి 12 లక్షలు, వెదురు పెండల్స్. కోసం రూ.15 లక్షలు, ప్రస్తుత ఆర్చ్ గేట్ వద్ద 4 వైపులా ఇనుప వెల్డెడ్ గేట్ల నిర్మాణానికి రూ.20 లక్షలు, వీటితో పాటు, విఐపీ ఘాట్ వద్ద ర్యాంప్ నిర్మాణం, సరస్వతి దేవి విగ్రహ ఏర్పాటు, శాశ్వత మరుగు దొడ్ల నిర్మాణం, విద్యుత్ స్థంబాల ఏర్పాటు, మంచినీటి ట్యాంక్ నిర్మాణ పనులు, మంచి నీరు, పుష్కర ఘాట్లలో స్నానఘట్టాలు, బట్టలు మార్చుకునే గదులు, చలువ పందిళ్ళ ఏర్పాటు తదితర పనులు చేయడం జరుగుతుంది. అయితే పనులన్నీ మే 4 లోపు పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తేవాలని అధికారులు చెబుతున్నారు. సమయం సమీపించడంతో పనులు పూర్తి నిర్దేశిత సమయంలో పూర్తి అవుతాయా అనేది ప్రశ్నార్ధకంగా మారింది.

పుష్కరాలకు వచ్చే భక్తులకు అన్ని వస్తాయి కల్పిస్తాం

తెలంగాణ రాష్ట్రం సాధించుకుని ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వస్తున్న మొదటి పుష్కరాలు సరస్వతి నది పుష్కరాలు. ప్రభుత్వం ఎక్కడా వెనకాడకుండా పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాలైన వసతులతో కూడిన సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నాం తాత్కాలిక అభివృద్ధి పనులతో పాటు నిలిచే పనులకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం. ఇప్పటికే పుష్కరాల పనులు అన్నీ ప్రారంభమై చురుగ్గా జరుగుచున్నాయి.

ఒక్కో ప్రభుత్వ శాఖకు పలు బాధ్యతలు అప్పగించి పనులు నిత్యం పర్యవేక్షిస్తున్నాం. దేవాదాయ శాఖ అధికారులు సహా జిల్లా యంత్రాగం మొత్తం పుష్కర ఏర్పాట్ల పనులలో నిమగ్నమై ఉన్నారు. పుష్కరాలు ప్రారంభమయ్యే నాటికి అన్ని పనులు పూర్తి చేయాలనే దృడ సంకల్పంతో అన్ని శాఖల అధికారులు పనిచేస్తున్నారు.

Also Read: స్వేచ్ఛ Eపేపర్ కోసం ఈ లింక్ ని క్లిక్ చేయండి https://epaper.swetchadaily.com/

Just In

01

CCI Cotton Procurement: పత్తి కొనుగోళ్లలో అవకతవకలు జరగొద్దు.. పినపాక ఎమ్మెల్యే

Kavitha Janam Bata: కేసీఆర్‌కు ఆ అవసరం లేదు.. నిజామాబాద్ ప్రెస్‌మీట్‌లో కవిత ఆసక్తికర వ్యాఖ్యలు

Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో ట్విస్ట్.. చనిపోయిన వ్యక్తిపై కేసు.. ఏం జరగబోతోంది?

Drinking Culture: మందు బాబులు మద్యం సేవించిన తర్వాత ఎందుకు ఎక్కువగా తింటారో తెలుసా?

Bigg Boss Telugu 9: సంజన నోటికి లాక్.. క్లౌడ్ గేమ్ షురూ.. మేఘం వర్షిస్తేనే సేఫ్, లేదంటే?