Nadendla Manohar:(Image Credit: Twitter)
విశాఖపట్నం

Nadendla Manohar: పవన్ టార్గెట్ చెప్పేసిన నాదెండ్ల.. విలువలతో కూడిన రాజకీయాలంటూ..

Nadendla Manohar: ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే తపనతో పని చేస్తున్నారని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ టార్గెట్ గురించి నేరుగా చెప్పకుండానే, ఆయన చేస్తున్న కృషి ద్వారా ఆ దిశగా సాగుతున్నట్లు మంత్రి వెల్లడించారు. విలువలతో కూడిన రాజకీయాలు చేయడానికి జనసేన కట్టుబడి ఉందని మంత్రి మనోహర్ స్పష్టం చేశారు.

గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) పరిధిలో భవిష్యత్‌లో చేపట్టబోయే కార్యక్రమాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినట్లు మంత్రి మనోహర్ వెల్లడించారు. విశాఖలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ప్రజల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోందని తెలిపారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌లు సంయుక్తంగా పీ4 పథకాన్ని ప్రారంభించినట్లు ఆయన వివరించారు. ఈ పథకం ద్వారా 99 లక్షల మంది లబ్ధిదారులకు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందజేసినట్లు మంత్రి పేర్కొన్నారు. అంతేకాకుండా, రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. గతంలో ఎన్నడూలేని విధంగా ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసినట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతుల కోసం రూ.8,200 కోట్ల నగదును వారి బ్యాంకు ఖాతాల్లో వేసినట్లు మంత్రి వివరించారు.

Also Read: రూటు మార్చిన కేతిరెడ్డి.. పైలెట్ గా చక్కర్లు.. వీడియో వైరల్

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్వయంగా గిరిజన గ్రామాల్లో పర్యటించి రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన విషయాన్ని కూడా మంత్రి మనోహర్ ప్రస్తావించారు. ఇటీవల పిఠాపురంలో జనసేన ఆవిర్భావ సభ అద్భుతంగా జరిగినట్లు తెలిపారు. జనసేన పార్టీని బలోపేతం చేయడానికి అన్ని స్థాయిలలో కమిటీల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని పేర్కొన్నారు. టీడీపీ, బీజేపీతో కలిసి జనసేన నాయకులు ప్రజల కోసం అంకితభావంతో పని చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

గత ప్రభుత్వ పాలనపై విమర్శలు గుప్పించిన మంత్రి, విశాఖలో చట్టం, లా అండ్ ఆర్డర్ సమస్యలను సృష్టించారన్నారు. రుషికొండలో ప్రజాధనంతో విలాసవంతమైన ప్యాలస్ నిర్మించారని ఆరోపించారు. అంతేకాకుండా, విశాఖలో భూకబ్జాలకు పాల్పడి, పర్యావరణ విధ్వంసం చేశారని ధ్వజమెత్తారు.

Just In

01

Coolie: ‘కూలీ’ మూవీ ‘చికిటు’ ఫుల్ వీడియో సాంగ్.. యూట్యూబ్‌లో రచ్చ రచ్చ!

JD Chakravarthy: ‘జాతస్య మరణం ధ్రువం’ టైటిల్ క్రెడిట్ నాదే..

Malkaajgiri Excise: డిఫెన్స్ మద్యం స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్

Chiranjeevi Team: ‘స్పిరిట్’, ‘ది ప్యారడైజ్‌’ చిత్రాలలో చిరు.. క్లారిటీ ఇచ్చిన టీమ్!

GHMC: ఎంటమాలజీలో ఇష్టారాజ్యంగా జీతాల చెల్లింపులు.. చార్మినార్ జోన్ లో వెలుగు చూసిన అక్రమం