Anakapalle Crime (image credit:Twitter)
విశాఖపట్నం

Anakapalle Crime: భర్త వేధింపులు.. పగ తీర్చుకున్న భార్య.. అనకాపల్లిలో దారుణం

Anakapalle Crime: మద్యం మత్తులో భర్త వేధింపులు భరించలేని ఓ భార్య చేసిన నిర్వాకం ఇది. బాగా మరిగిన నూనెను భర్త ఒంటిపై పోసి భార్య పరారైన ఘటన అనకాపల్లి జిల్లా పరవాడ మండలంలో మంగళవారం వెలుగులోకి వచ్చింది. అయితే ప్రస్తుతం సదరు వ్యక్తి గాయాలపాలై స్థానిక వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు.

అసలు విషయంలోకి వెళితే..
అనకాపల్లి జిల్లా పరవాడ మండలం సాలాపు వనపాలెం గ్రామంలో రామకృష్ణ, రమణమ్మ అనే దంపతులు నివసిస్తున్నారు. వీరు 14 రోజుల క్రితం ఓ అద్దె గృహాన్ని తీసుకొని జీవనం సాగిస్తున్నారు. అయితే రోజు మద్యం మత్తులో రామకృష్ణ తన భార్యను వేధింపులకు గురి చేసేవాడని ఇంటి యజమాని తెలుపుతున్నారు. ప్రస్తుతం రామకృష్ణ భార్య రవణమ్మ గర్భం దాల్చి ఉంది. రమణమ్మ గర్భం దాల్చిన విషయాన్ని సైతం పట్టించుకోకుండా రామకృష్ణ ప్రతిరోజు మద్యం మత్తులో భార్యను వేధించేవాడని స్థానికులు తెలుపుతున్నారు.

Also Read: Vijayasai Reddy: ఏంటన్న సాయన్న ఇలా మారిపోయావ్.. వైసీపీలో ఒకటే గుబులు!

ఈ వేధింపులు భరించలేని భార్య రమణమ్మ ఆగ్రహం వ్యక్తం చేస్తూ బాగా మరిగిన నూనెను భర్త రామకృష్ణ పై పోసింది. అలా నూనె వేసిన అనంతరం స్థానిక ప్రహరీ గోడ దూకి ఆమె పరారైనట్లు స్థానికులు తెలుపుతున్నారు. నూనె శరీరంపై పడడంతో రామకృష్ణ గట్టిగా కేకలు వేయగా ఇంటి యజమాని స్పందించారు. హుటాహుటిన ఏమి జరిగిందని కోణంలో రామకృష్ణ ఇంటిలోకి వెళ్లి చూడగా, తన భార్య తనపై నూనె పోసిందని రామకృష్ణ తెలిపాడు.

Also Read: Sunitha On Pravasthi: సారీ.. సారీ.. ప్రాధేయపడుతున్న సింగర్ సునీత? ప్రవస్తి ఇప్పుడు హ్యాపీనా?

స్థానిక పోలీసులకు రామకృష్ణ సమాచారం అందించడంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని అసలేం జరిగిందని కోణంలో విచారణ సాగించారు. డబల్ కాట్ మంచం మీద రామకృష్ణ నిద్రిస్తున్న క్రమంలో మరిగిన నూనె ఒంటి మీద పోయాగా 40 శాతం శరీరం కాలినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు సాగిస్తున్నారు. రామకృష్ణను మొదటగా అనకాపల్లి ఎన్టీఆర్ వైద్యశాలకు తరలించి చికిత్స అందించారు. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం విశాఖ కేజీహెచ్ వైద్యశాలకు తరలించి చికిత్సను అందిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద భర్త వేధింపులను తట్టుకోలేక గర్భిణీ స్త్రీ అయిన భార్య నూనె పోసినట్లు విషయం బయటకు రావడంతో ప్రస్తుతం ఈ అంశం చర్చకు దారితీసింది.

Just In

01

Coolie: ‘కూలీ’ మూవీ ‘చికిటు’ ఫుల్ వీడియో సాంగ్.. యూట్యూబ్‌లో రచ్చ రచ్చ!

JD Chakravarthy: ‘జాతస్య మరణం ధ్రువం’ టైటిల్ క్రెడిట్ నాదే..

Malkaajgiri Excise: డిఫెన్స్ మద్యం స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్

Chiranjeevi Team: ‘స్పిరిట్’, ‘ది ప్యారడైజ్‌’ చిత్రాలలో చిరు.. క్లారిటీ ఇచ్చిన టీమ్!

GHMC: ఎంటమాలజీలో ఇష్టారాజ్యంగా జీతాల చెల్లింపులు.. చార్మినార్ జోన్ లో వెలుగు చూసిన అక్రమం