Viral News: అక్కడా ఇక్కడ అని లేదు. ఎక్కడ చూసినా వివాహేతర సంబంధాలు, వాటి పర్యావసానంగా నేరాలు, హత్యలు. ముఖ్యంగా ఇటీవలి కాలంలో ఈ తరహా ఘటనలు మరీ విపరీతమయ్యాయి. అలాంటి ఘటనే ఒకటి బెంగళూరు నగరంలో (Viral News) ఆదివారం వెలుగుచూసింది. ఆదివారం తెల్లవారుజామున చెత్త సేకరించే ఓ ట్రక్కులో దాదాపు 40 ఏళ్ల వయసున్న ఓ మహిళ మృతదేహం బయటపడింది. గోనె సంచిలో చుట్టి ట్రక్కులో పడేశారు. సమాచారం అందుకొని రంగంలోకి దిగిన పోలీసులు, మృతురాలిని ఆశాగా గుర్తించారు. మహ్మద్ షంషుద్దీన్ అనే వ్యక్తితో ఆమె సహజీవనం చేసిందని, అతడే ఈ హత్యకు పాల్పడినట్టు పోలీసులు తేల్చారు. సమాచారం అందుకొని రంగంలోకి దిగిన పోలీసులు, మృతదేహం వెలుగులోకి వచ్చిన 20 గంటల్లోనే నిందితుడిని అరెస్ట్ చేశారు. సోమవారం అతడిని అదుపులోకి తీసుకున్నారు.
బెంగళూరు పాలక సంస్థ అయిన బృహత్ బెంగళూరు మహానగర పాలికే (BBMP) పరిధిలో చెత్త సమీకరించే ట్రక్కులో ఆదివారం ఆశా మృతదేహాన్ని గుర్తించామని పేర్కొన్నారు. చేతులు కట్టేసి ఉన్నాయని వివరించారు. కేసు నమోదు చేశామని, దర్యాప్తులో భాగంగా మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపించామని వివరించారు.
Read Also- Watch Video: ఇదేం వింతరా బాబూ.. చెట్లు మూత్రం పోస్తున్నాయ్.. వీడియో వైరల్!
పోలీసులు సీసీటీవీ ఫుటేజ్, ఇతర ఆధారాల ఆధారంగా నిందితుడిని గుర్తించారు. నిందితుడు మహ్మద్ షంషుద్దీన్ అస్సాంకు చెందినవాడని, అతడి వయసు 33 ఏళ్లు అని పోలీసులు చెప్పారు. మృతురాలు ఆశా, మహ్మద్ మధ్య ఏడాదిన్నరగా సంబంధం ఉందని చెప్పారు. దక్షిణ బెంగళూరులోని హులిమావు ఏరియాలో ఒక ఇంట్లో అద్దెకు దిగారు. ఇద్దరికీ వేర్వేరుగా పెళ్లిళ్లు అయ్యాయి. అయితే, భార్యభర్తలని చెప్పుకొని అద్దెకు దిగారు. ఇద్దరు చొప్పున వారిద్దరికీ పిల్లలు ఉన్నారని వివరించారు.
కాగా, ఆశా ఒక వితంతువు అని, అర్బన్ కంపెనీలో పనిచేసేదని, హౌస్ కీపింగ్ సర్వీస్ చేస్తుండేదని వివరించారు. మహ్మద్ షంషుద్దీన్ కూడా పెళ్లి అయ్యిందని, అతడి భార్య, పిల్లలు అస్సాంలోనే ఉంటున్నారని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (బెంగళూరు సౌత్) లోకేష్ జగలసర్ వెల్లడించారు. ఇద్దరి మధ్య ఘర్షణ జరిగిందని, అది కాస్తా భౌతిక దాడికి దారితీసిందని, ఆశా మృతికి కారణమైందన్నారు. హత్య చేసిన తర్వాత మృతదేహాన్ని దాదాపు 20 కిలోమీటర్ల దూరం బైక్‌పై తీసుకెళ్లి, చెత్త ట్రక్కులో పడవేసి అక్కడి నుంచి పారిపోయాడన్నారు. ఈ దృశ్యాలు సీసీటీవీలో రికార్డు అయ్యాయని వివరించారు.
Read Also- Mogalirekulu Sagar: మొగలిరేకులు RK నాయుడు గురించి బయటపడ్డ నమ్మలేని నిజాలు
మృతదేహాన్ని రాత్రి 2 గంటల సమయంలో ట్రక్‌లో పడేశాడని వివరించారు. ఉదయం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో, పోలీసులు వెంటనే హత్య కేసు నమోదు చేశారు. మృతురాలు దక్షిణ బెంగళూరులోని హుళిమావు ప్రాంతానికి చెందిన వాసిగా నిర్ధారించారు. ఇద్దరు గత నాలుగు నెలలుగా కలిసి ఉంటున్నారని వివరించారు. ‘‘హుళిమావులోని ఒక హౌస్‌కీపింగ్ మెటీరియల్ కంపెనీలో పనిచేశారు. ఇద్దరికి అక్కడే పరిచయం అయ్యింది. ఇటీవల ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరిగాయి. ఆశా మద్యం తాగుతుండడం, బాగా పొద్దుపోయాక కూడా ఫోన్ కాల్స్ మాట్లాడుతుండడం ఇద్దరి మధ్య ఘర్షణలకు కారణమని తెలిసింది. హత్య జరిగిన రోజు రాత్రి షంషూద్దీన్ మద్యం సేవించి ఇంటికి వెళ్లాడు. ఇద్దరి మధ్య ఘర్షణ తీవ్ర స్థాయిలో జరిగింది. ఈ క్రమంలో ఆగ్రహంతో గొంతు నులిమి చంపాడు’’ అని వివరించారు.