Kali Yuga: మన హిందూ గ్రంథ ధర్మాలలో నాలుగు యుగాల గురించి, వాటి యొక్క కాల వ్యవధుల గురించి, ఏ యుగంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో వివరంగా చెప్పారు. సత్య యుగం పూర్తైన తర్వాత, త్రేతా యుగం ప్రారంభమైతుంది, ఆ తర్వాత ద్వాపర యుగం ఆ తర్వాత కలి యుగం ప్రారంభమౌతాయి.
సత్య యుగం యొక్క కాల వ్యవథి 17 లక్షల 28,000 సంవత్సరాలు. త్రేతా యుగం యొక్క కాల వ్యవథి 12 లక్షల 96,000 సంవత్సరాలు. ద్వాపర యుగం 8 లక్షల 64,000 సంవత్సరాలు. కలి యుగం యొక్క కాల వ్యవధి 4,32,000 సంవత్సరాలు. ఒక యుగం పూర్తైన తర్వాత మరొక కొత్త యుగం ప్రారంభమవుతుంది. ఈ యుగాలన్నీ పూర్తైన తర్వాతే కాల చక్రం పూర్తవుతుంది. మళ్లీ ఒక కొత్త కాల చక్రం మొదలవుతుంది.
కలియుగం అంత దారుణంగా అంతమవుతుందా?
ప్రతి యుగంలో మన మనుషుల ప్రవర్తన, ఆలోచనలు, జీవన విధానాలు, రంగు, రూపం, ఆకారం మారిపోతూ ఉంటుంది. వాటి గురించి తెలియకపోవచ్చు. ప్రస్తుతం, మనం కలి యుగంలో నివసిస్తున్నాం. ఈ కలి యుగం గురించి ఎన్నో భవిష్య వాణిలో చెప్పినన్నీ జరుగుతున్నాయి. ముందు ముందు ఇంకా చాలా జరుగుతాయని అంటున్నారు. శ్రీ కృష్ణుడు కూడా ఈ కలి యుగం గురించి ఎన్నో నిజాలు చెప్పాడు. వాటిలో చాలా వరకు నిజమయ్యాయి. అసలు ఈ భూమి ఎప్పుడు అంతమవుతుంది? ఎలా అంతమవుతుందో శ్రీ కృష్ణుడు వివరంగా చెప్పాడు.
కలి యుగం అంతంలో అన్ని ఘోరాలు జరుగుతాయా?
కలి యుగం ముగుస్తుందన్న సమయంలో వారి జీవిత కాలం 20 ఏళ్ళ వరకు తగ్గి పోతుంది. అంతే కాదు ఈ ఘోర కలి యుగంలో మనుషులు 30 ఏళ్ళ కంటే ఎక్కువ బతక లేరు. అలాగే, సగటు జీవిత కాలం 20 ఏళ్ళు మాత్రమే ఉంటుంది. దీని బట్టి మనుషులు 16 ఏళ్ళ వయస్సులోనే వృద్దులు అవుతారు. 20 ఏళ్ళ కన్నా తమ ప్రాణాలను విడిచి పెడతారు. శరీరం కూడా చాలా బలహీనంగా మారుతుంది. కలి యుగం అంతంలో మనుషుల్లో క్రూరత్వం పెరిగి పోతుంది. కలి అనే రాక్షకుడు ప్రతి ఒక్కర్ని తమ భక్తులుగా చేసుకుంటాడు. అతను దైవాన్ని ఎదురిస్తాడు. సరిగ్గా ఇదే సమయంలో విష్ణువు కల్కి భగవానుడిగా జన్మించి కల్కి ని చంపేస్తాడు.
