Viral Video: ప్రస్తుతం, సోషల్ మీడియా ( Social Media )వాడకం రోజు రోజుకు పెరిగిపోతుంది. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు స్మార్ట్ ఫోన్ లో వీడియోస్ చూస్తూ.. వాళ్ళు కూడా అలాగే చేస్తున్నారు. మరి ముఖ్యంగా, రీల్స్ అనే ఫీచర్ వచ్చాక ఒక్కొక్కరు తమకున్న టాలెంట్ ను బయట పెడుతున్నారు.
Also Read: Hansika Motwani : స్లీవ్ లెస్ బ్లౌజ్ తో కుర్రకారు మతి పోగొడుతోన్న బన్నీ హీరోయిన్.. ఫోటోలు వైరల్
ప్రపంచనలుమూలల్లో(World) ఏం జరిగినా స్మార్ట్ ఫోన్లో క్షణాల్లో వచ్చేస్తుంది. ఇలా రోజు నెట్టింట కొన్ని లక్షల వీడియోలు ( Viral Videos ) అప్లోడ్ అవుతుంటాయి. వాటిలో కొన్ని బాగా వైరల్ అవుతుంటాయి. అయితే, తాజాగా ఓ వ్యక్తికి సంబందించిన వీడియో ఇంటర్నెట్ నే షేక్ చేస్తుంది. ఇది చూశాక ..మీరు కూడా షాక్ అవ్వడం పక్కా..! ఇంతకీ , ఆయన ఏం చేశాడో ఇక్కడ తెలుసుకుందాం..
Also Read: Scariest Sea Animal: మొక్కలా కనిపించే అత్యంత భయంకరమైన ఈ సముద్ర జంతువు గురించి తెలుసా?
మనం ఇప్పటి వరకు ఎన్నో వీడియోలు చూశాము. కానీ, ఇలాంటి వీడియో ఎక్కడా చూసి ఉండము. ఒక్క రోజులోనే ఫేమస్ అవ్వాలనుకున్నాడేమో ? ఇతనకు ప్లేస్ ఎక్కడా దొరకనట్టు ఏకంగా గేదే మీదకు ఎక్కి మరి డ్యాన్స్ చేశాడు. పైగా, మెగాస్టార్ చిరంజీవి హిట్ మూవీలోని ” ఈ పేటకు నేనే మేస్త్రి “పాటకు చిందులేశాడు. గేదే మీద ఇలాంటి స్టెప్పులు వేయడంతో వీడియో చాలా వైరల్ అవుతుంది. చిరు స్టెప్పులు దించేశాడు. గేదెకు మాత్రం ఎలాంటి చలనం లేదు. చక్కగా గడ్డి మేస్తూ దాని పని అది చేసుకుంటుంది. ఇతను మాత్రం పైకి ఎక్కి కిందకి పైకి మెలికలు తిరుగుతూ డ్యాన్స్ వేశాడు.
దీని మీద నెటిజన్స్ రక రకాలుగా రియాక్ట్ అవుతున్నారు. ” అయ్యా నాయన ఎక్కడ దొరకలేదు ప్లేస్ నీకు గేదే మీదకు ఎక్కేసావ్ .. ఎంతైనా మీ ధైర్యాన్ని మెచ్చుకోవాలి బ్రో ” అని కొందరు అంటుండగా, ముందు దిగరా బాబు అది ఒక్కసారి కదిలింది అనుకో మళ్లీ ఇంకోసారి డ్యాన్స్ కూడా వేయలేవు.. పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఒకసారి ఊహించుకో అంటూ ఇంకొకరు కామెంట్ లో రాశారు. ” మేము చాలా వీడియోలు చూసాము కానీ, ఇలాంటిదే ఇప్పుడే చూస్తున్నాం .. త్వరలో నీకు అవార్డు వస్తుందిలే ” అని మరొకరు రాశారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు